మోనాల్ ఘోర తప్పిందం.. అరియానాను వరించిన అదృష్టం.. హారిక మనస్తాపం

బిగ్‌బాస్ తెలుగు 4 రియాలిటీ షోలో 8వ వారంలో జరిగిన కెప్టెన్సీ టాస్క్‌లో కేవలం మహిళలకే ప్రధాన్యం ఇచ్చారు. ఇంటికి కెప్టెన్‌గా వ్యవహరించేందుకు ఈ సారి మగ కంటెస్టెంట్లకు అవకాశం లేకపోవడంతో యాంకర్ లాస్య, హారిక, మోనాల్ గజ్జర్, అరియానా మాత్రమే పాల్గొన్నారు. అయితే కెప్టెన్సీ టాస్క్‌లో మోనాల్ తీసుకొన్న నిర్ణయం కెప్టెన్సీ టాస్క్‌ వివాదంగా మారడానికి కారణమైందనే అభిప్రాయాన్ని ఇంటి సభ్యులు వెల్లడించడం గమనార్హం. అయితే మోనాల్ తప్పుగా వ్యవహరించడంతో అరియానాకు ఎలా కలిసి వచ్చిందంటే...

కెప్టెన్సీ గేమ్‌లో చేజారిన మోనాల్ అవకాశం

కెప్టెన్సీ గేమ్‌లో చేజారిన మోనాల్ అవకాశం

కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా ఆడిన ఆటలో అఖిల్‌‌కు తాళం చెవి ఇవ్వడంతో కెప్టెన్‌గా మారే వ్యక్తిని నిర్ణయించే అవకాశం మోనాల్‌కు దక్కింది. తనకు లభించిన అవకాశంతో కెప్టెన్సీ రేసు నుంచి హారికను బయటకు పంపించింది. ఇక రేసులో లాస్య, అరియానా, మోనాల్ మాత్రమే మిగిలారు.

అరియానా తెలివిగా లాస్కకు చెక్

అరియానా తెలివిగా లాస్కకు చెక్

ఇక రెండే అవకాశం అరియానాకు చిక్కడంతో తెలివిగా ఆమె యాంకర్ లాస్యను కెప్టెన్సీ రేసు నుంచి తప్పించింది. దాంతో అరియానా, మోనాల్‌ మాత్రమే మిగిలారు. తాళం చెవి ఆటలో ఇంటి సభ్యుడు ఒక్కరే పాల్గొనాలనే నిబంధనతో అఖిల్ ఆ గేమ్‌కు దూరమయ్యాడు. దాంతో మోనాల్‌కు కెప్టెన్సీ రేసులో నెగ్గడం కష్టంగా మారింది. ఎందుకంటే ఇంటిలో ఎక్కువ మంది మోనాల్‌కు వ్యతిరేకంగా ఉన్నవారే..

అరియానాకు మోహబూబ్ సపోర్టు చేయడంతో

అరియానాకు మోహబూబ్ సపోర్టు చేయడంతో

ఇక చివరి, మూడోసారి ఆడిన తాళం చెవి ఆటలో మెహబూబ్‌కు తాళం దొరకడంతో మోనాల్‌కు మరింత కష్టంగా మారింది. ఎందుకంటే గతంలో మెహబూబ్ కోసం అరియానా స్వయంగా ఎలిమినేషన్‌ కోసం నామినేట్ చేసుకోవడంతో దానికి గ్రాటిట్యూడ్‌గా అరియానాకు సహాయం చేస్తానని గతంలో మాటిచ్చాడు. దాని ప్రకారం అరియానాకు అవకాశం లభించడంతో కెప్టెన్‌గా మారింది.

Recommended Video

Bigg Boss Telugu 4: Monal Ghajjar Extra Glamour
మోనాల్ తెలివిగా ఆడి అరియానాను తప్పిస్తే..

మోనాల్ తెలివిగా ఆడి అరియానాను తప్పిస్తే..


ఒకవేళ మోనాల్ తన గేమ్ ప్లాన్ మార్చేసి హారికను కాకుండా అరియానాను రేసు నుంచి బయటకు పంపిస్తే.. సమానంగా ఇంటి సభ్యుల మద్దతు ఉన్న హారిక, లాస్యతో మోనాల్‌కు గట్టిపోటి అయ్యేది. ఆట రసవత్తరంగా మారేదనే విషయాన్ని లాస్య, హారిక చర్చించుకోవడం షోలో కనిపించింది. ఆ తర్వాత మోనాల్ కూడా అదే విషయాన్ని లాస్య, హారికతో చర్చించడం కనిపించింది. మోనాల్ తప్పు చేయడం వల్లే అరియానాకు అదృష్టం వరించిందనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X