For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మోనాల్ నిజస్వరూపం బయటకు: వీడియో లీక్ కాకముందే తేరుకుంది.. మళ్లీ ముద్దులు పెట్టడంతో!

  |

  బిగ్ బాస్ అంటేనే రియల్ ఎమోషన్స్‌తో సాగే షో అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో జరిగే ప్రతి వ్యవహారం వాస్తవంగా జరుగుతుందే తప్ప కల్పితం కాదు. అందుకే ఎప్పుడు ఎలాంటి సంఘటనలు చూడాల్సి వస్తుందో ఎవరికీ తెలియదు. అప్పటికప్పుడే కొట్టుకునే కంటెస్టెంట్లు ఆ వెంటనే కలిసిపోతుంటారు. అప్పటి వరకు స్నేహితులుగా ఉన్న వాళ్లు కొట్టుకుంటూ ఉంటారు. ఇలా బిగ్ బాస్ షో రక్తి కడుతోంది. ఇక, తాజా సీజన్ మరింత ఆసక్తికరంగా సాగుతోంది. ఇలాంటి సమయంలో మోనాల్ గజ్జర్ నిజస్వరూపం బయటకు వచ్చింది. అసలేం జరిగింది? వివరాల్లోకి వెళితే...

  లవ్ ట్రాకులతో చెడ్డ పేరు తెచ్చుకుంది

  లవ్ ట్రాకులతో చెడ్డ పేరు తెచ్చుకుంది

  నాలుగో సీజన్ ఆరంభంలోనే మోనాల్ గజ్జర్ బాగా పాపులర్ అయింది. దీనికి కారణం తోటి కంటెస్టెంట్ అభిజీత్‌తో ఆమె లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు ప్రచారం జరగడమే. వీళ్లిద్దరూ అలాగే కనిపించడంతో అంతా నిజమేనని అనుకున్నారు. అదే సమయంలో మోనాల్.. అఖిల్ సార్థక్‌తోనూ కలిసి తిరుగుతూ షాకిచ్చింది. ఈ ట్రాకుల వల్ల చెడ్డ పేరును మూటగట్టుకుంది.

  చివరిలో తేరుకుని గేమ్‌లో మిగిలింది

  చివరిలో తేరుకుని గేమ్‌లో మిగిలింది

  బిగ్ బాస్ నాలుగో సీజన్ చివరి దశకు చేరుకుంది. దీంతో ఒంటరిగా ఆడాలని డిసైడ్ అయిందేమో.. మోనాల్ గజ్జర్ చివరిలో తేరుకుంది. ఇందులో భాగంగానే తన ఆట తాను ఆడుతూ హైలైట్ అవుతోంది. ఇన్ని రోజులు టాస్కులు ఆడుతున్నా పెద్దగా కనిపించని ఆమె.. ఇప్పుడు అఖిల్‌కు పోటీగానే శ్రమిస్తోంది. అంతేకాదు, అందరితో గొడవలకు కూడా దిగుతోంది.

  అవినాష్‌ను కాలితో తన్నిన మోనాల్

  అవినాష్‌ను కాలితో తన్నిన మోనాల్

  ఈ వారం బిగ్ బాస్ హౌస్‌లో ‘రేస్ టు ఫినాలే' టాస్క్ మొదలైంది. మొదటి లెవెల్‌లో భాగంగా గార్డెన్ ఏరియాలో ఉన్న ఆవు నుంచి వచ్చే పాలను తమ దగ్గర ఉన్న బాటిల్స్‌లో నింపుకోవాలి కంటెస్టెంట్లు. ఈ టాస్కులో పాలు నింపుకునే సమయంలో మోనాల్ గజ్జర్.. అవినాష్‌ను కాలితో తన్నింది. దీంతో అతడు ఆమె కాలికున్న షూను పట్టుకుని విసిరేశాడు.

  సీరియస్‌గా తీసుకోవడంతో గొడవలు

  సీరియస్‌గా తీసుకోవడంతో గొడవలు

  ఒక అమ్మాయి తనను కాలితో తన్నడంతో అవినాష్ జీర్ణించుకోలేకపోయాడు. దీంతో ఆ టాస్క్ ఆడనంటూ మధ్యలోనే బయటకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత కూడా దీన్నే ప్రస్తావిస్తూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక, బుధవారం ఎపిసోడ్‌లోనూ ఈ వ్యవహారాన్ని మరోసారి హైలైట్ చేశాడు. దీంతో సోహెల్.. ‘ఆమె నిన్ను నిజంగా తన్ని ఉంటే ఇకపై తనతో అస్సలు మాట్లాడను' అని చెప్పాడు.

  మోనాల్ నిజస్వరూపం బయటకు

  మోనాల్ నిజస్వరూపం బయటకు

  అవినాష్‌ విషయంలో మోనాల్ గంటకో మాట చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు అర్థం అవుతోంది. ఆరోజు రాత్రి ‘ఆరియానా కోసం తన్నాను' అని ఒప్పుకున్న ఆమె.. సోహెల్ అడగగా.. ‘నేను అలా చేయలేదు' అంటూ మరో మాట చెప్పింది. ఆ తర్వాత అఖిల్ దగ్గర ఈ ప్రస్తావన వచ్చినప్పుడు కూడా తానేమీ కొట్టలేదని చెప్పింది. తర్వాత తనకు గుర్తు లేదని కవర్ చేసింది.

  Varsha Bollamma, Anand Devarakonda Interview Part 3 | Middle Class Melodies
  వీడియో లీక్ కాకముందే తేరుకుంది

  వీడియో లీక్ కాకముందే తేరుకుంది

  ఈ వ్యవహారంపై క్లారిటీ కోసం అవినాష్.. వీకెండ్ ఎపిసోడ్‌లో ఆ వీడియో ప్లే చేయమని నాగార్జునను కోరాడు. అంత వరకు వస్తే తనకు నష్టం జరుగుతుంది అనుకుందో ఏమో.. మోనాల్ అతడి దగ్గరకు వెళ్లి సారీ చెప్పింది. తాను కావాలని చేయలేదని చెబుతూ కాళ్లు పట్టుకుంది. అంతేకాదు, ఆ తర్వాత ఏకంగా అతడి బుగ్గపై ముద్దుల మీద ముద్దులు పెట్టి తప్పు ఒప్పుకోకనే ఒప్పుకుంది.

  English summary
  Bigg Boss is the Telugu language version of the reality TV series Bigg Boss, which itself is an adaptation of the Dutch series Big Brother. It airs on Star Maa and streams on digital platform Hotstar. Season 1 was hosted by Jr NTR premiered on 16 July 2017.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X