ఆ కోరిక తీరకుండానే మోనాల్ బిగ్‌బాస్ నుంచి అవుట్.. 14 వారాలకు రెమ్యునరేషన్ ఎంతంటే!

కరోనావైరస్ లాక్‌డౌన్ సమయంలో ప్రారంభమవుతుందా లేదా అనే సందేహాల మధ్య ఆరంభమైన బిగ్‌బాస్‌ తెలుగు 4 షో ముగింపు దశకు చేరుకొన్నది. మరి ఏడు రోజుల్లో సీజన్ 4 విజేత ఎవరనే విషయం స్పష్టం కాబోతున్నది. ఈ నేపథ్యంలో ఇంటి నుంచి 14వ వారంలో మోనాల్ గజ్జర్ బయటకు వెళ్లింది. అయితే మోనాల్ తన లక్ష్యాన్ని చేరుకోకుండానే బయటకు వెళ్లడం ఓ కోరిక అలానే మిగిలిపోయింది. ఆ వివరాల్లోకి వెళితే...

మోనాల్ గజ్జర్ ఎవరు అంటూ

మోనాల్ గజ్జర్ ఎవరు అంటూ


తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా నాలుగైదు సినిమాలు చేసినా మోనాల్ గజ్జర్ అంటే ఎవరో తెలియని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో బిగ్‌బాస్‌లోకి రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతకు ఈమె ఎవరు అని తెలుసుకోవడానికే నాలుగైదు వారాలు పట్టింది. ప్రేక్షకుల ఆదరణ పొందడానికి కాస్త సమయాన్ని ఎక్కువగానే తీసుకొన్నది.

గేమ్ ప్లాన్ లేకుండానే..

గేమ్ ప్లాన్ లేకుండానే..

ఇక ఇంటిలోకి రాకముందే బిగ్‌బాస్ నిర్వాహకులు ఆమెతో ఎలా గేమ్ ఆడించాలనే విషయా్ని ప్లాన్ చేశారు. పెళ్లి చేసుకోనే విధంగా ఇంటిలో గేమ్‌ను ప్లాన్ చేసుకొంటానని అభిజిత్‌తో చెప్పించారు. ఇంటిలో తన గేమ్‌పై ఎలాంటి క్లారిటీ లేకుండా నెట్టుకొచ్చింది. అయితే ఆమె ఎలిమినేషన్ నుంచి బయటపడటం అందరికి ఓ రకమైన షాక్‌నే కలిగించింది.

ట్రయాంగిల్ లవ్ స్టోరీతో

ట్రయాంగిల్ లవ్ స్టోరీతో


బిగ్‌బాస్ ఇంటిలో ఐదు వారాల తర్వాత గానీ ట్రాయాంగిల్ లవ్ స్టోరికి రూట్ వేస్ తన గేమ్‌ ప్లాన్ సెట్ చేసుకొన్నది. అఖిల్, అభిజిత్‌ మధ్య చిచ్చు పెట్టడానికి ఉన్న అవకాశాలను ఉపయోగించుకొన్నది. కొద్ది రోజులపాటు ఇద్దరిలో ఎవరితో ట్రాక్ నడపాలనే విషయంపై క్లారిటీ తెచ్చుకోలేకపోయింది. చివరికి అఖిల్‌తో తన బిగ్‌బాస్ జర్నీని కొనసాగించింది.

12 వారాలు నామినేట్ అయి..

12 వారాలు నామినేట్ అయి..

మోనాల్‌ విషయానికి వస్తే.. తెలుగు భాష రాని అమ్మాయిగా ఇంట్లోకి ప్రవేశించి తెలుగు భాషపై పట్టు సాధించేందుకు ప్రయత్నించింది. అలాగే దాదాపు 14వారాల్లో 12 వారాలు నామినేట్ అయి ఎలిమినేషన్ నుంచి గట్టెక్కింది. అయితే చివర్లో ఎలిమినేషన్ నుంచి తప్పించుకోలేక పోవడంతో టాప్ 5లో చోటు సంపాదించుకోలేకపోయింది.

బిగ్‌బాస్‌లో 14 వారాలు ఉండటమే

బిగ్‌బాస్‌లో 14 వారాలు ఉండటమే

బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ కావడం వెనుక నాకు ఎలాంటి బాధ లేదు. 14 వారాలు ఇంటిలో ఉండటమే నాకు గొప్ప అచీవ్‌మెంట్. ప్రేక్షకులు అందించిన సపోర్ట్‌తో హ్యాపీగా ఉన్నాను అని అభిజిత్‌తో మోనాల్ చెప్పింది. గోవిందా.. గోవిందా.. జై కృష్ణ అంటూ మోనాల్ ఇంటి నుంచి నిష్క్రమించింది.

అమ్మ కోసం 50 లక్షలు అంటూ

అమ్మ కోసం 50 లక్షలు అంటూ

ఇక రూ.50 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకోవాలనే కోరికను మాత్రం నెరవేర్చుకోలేకపోయింది. ఒకవేళ ప్రైజ్ మనీ సాధిస్తే.. మొత్తం అమ్మ కోసం ఇవ్వాలని నేను కోరుకొంటున్నాను. నా చదువు, ఇతర ఖర్చుల కోసం చాలా కష్టపడింది. నా పెళ్లి తర్వాత నా మీదగానీ, నా చెల్లెలు మీద గానీ ఆధారపడి ఉండకుండా ఉండేందుకు ఈ డబ్బును ఉపయోగిస్తానని చెప్పారు. ప్రైజ్ మనీ తన తల్లికి ఇవ్వాలనే కోరికను మాత్రం నెరవేర్చుకోలేకపోయింది.

Recommended Video

Bigg Boss Telugu 4 : Rahul Sipligunj Slams Trollers
మోనాల్ రెమ్యునరేషన్ ఎంతంటే!

మోనాల్ రెమ్యునరేషన్ ఎంతంటే!

ఇక మోనాల్ విషయానికి వస్తే.. బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్‌లో అత్యధికంగా పారితోషికం అందుకొన్న సెలబ్రిటీ మోనాల్ గజ్జర్. వారానికి రూ.11 లక్షల రూపాయలు చెల్లించినట్టు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే.. ఇప్పటికే భారీగా అంటే.. సుమారు 1.5 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ సాధించే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X