ఎట్టకేలకు బిగ్‌బాస్ నుంచి అవుట్.. మోనాల్ గజ్జర్‌కు 50 లక్షల ప్రైజ్ మనీ ఇస్తే..
బిగ్‌బాస్ తెలుగు 4లో టాప్ 5 ఫైనల్ కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ ఉండటంతో ఆదివారం ఎపిసోడ్‌పై ఉత్కంఠ కొనసాగింది. సండే ఫన్‌డే కావడంతో వినోద కార్యక్రమాలు ఆడిస్తూ టాప్ 5 ఫైనలిస్టుల ఎంపికను చేపట్టారు. ఎలాంటి వినోద కార్యక్రమాలు కొనసాగాయి? 14వ వారంలో ఎవరు ఎలిమినేట్ అయ్యారు? టాప్ 5 సభ్యులు ఎవరు అంటే..

50 లక్షల ప్రైజ్ మనీ డిస్ ప్లే
బిగ్‌బాస్ ఇంటికి ఎందుకు వచ్చారు అంటూ వేదికపైకి వచ్చిన నాగ్ తన ఇంటి సభ్యులను అడిగారు. టైటిల్ గెలవడానికి అని కొందరు... ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టాలని కొందరు అంటూ తమ సమాధానాలు ఇస్తే.. దాంతో పాటు ప్రైజ్ మనీ కోసం అంటూ నాగ్ వెల్లడించారు. ప్రైజ్ ప్లీజ్ అంటూ అనగానే.. వేదికపైన 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీ ఉన్న బ్యానర్ కిందకు దిగింది.

రైతుల అప్పు తీరుస్తానని అరియానా
ఇక 50 లక్షల ప్రైజ్ గెలిస్తే ఏం చేస్తారు అని ఇంటి సభ్యులను నాగ్ అడిగితే.. నా తల్లికి సొంత ఇళ్లు అంటూ హారిక చెబితే.. సొంత ఇంటితోపాటు తాండూరులోని కొందరు రైతులకు సహాయం చేయాలని అనుకొంటున్నాను అని అరియానా చెప్పారు. అభిజిత్ తన ప్రైజ్ మనీని డాడీకి ఇస్తాను అంటే.. అఖిల్ మాత్రం కేఫే పెడుతాను.. అలాగే ఇళ్లు కొనుగోలు చేస్తాను అని చెప్పాడు. ఇక సోహెల్ మాత్రం 10 లక్షలు పేదలకు అవసరమైతే ఇవ్వడానికి కొంత పక్కకు పెడుతాను. మిగితాది ఇళ్లు కట్టుకొంటాను అని సోహెల్ చెప్పారు. 50 లక్షల రూపాయలు తన తల్లికి ఇస్తాను. నాపై, నా చెల్లెలుపై ఆధారపడకుండా ఉండేలా అమ్మకు ఈ ప్రైజ్ మనీని ఇస్తానని చెప్పారు.

మూడో ఫైనలిస్టుగా అభిజిత్
ఆ తర్వాత టాప్ 5 ఫైనలిస్టుల్లో మూడో కంటెస్టెంట్‌ను ఎంపిక చేసేందుకు హోస్ట్ నాగార్జున చేతిలో ఓ కవర్ తీసుకొని అందులో నుంచి ఫోటోను తీసి అభిజిత్ పేరు ప్రకటించారు. దాంతో ఈ సీజన్‌లో టాప్ 5 లో చేరిన మూడో వ్యక్తిగా అభిజిత్ పేరును హోస్ట్ ప్రకటించారు. దాంతో అభిజిత్ తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పారు.

నాలుగో ఫైనలిస్టుగా హారిక దేత్తడి
ఆ తర్వాత కొన్ని గేమ్స్ ఆడిస్తూ ఇంటి సభ్యులను జోష్‌లో నింపేసాడు. నాలుగో కంటెస్టెంట్‌ను ప్రకటించే ముందు అభిజిత్‌ను ఎవరు 4 కంటెస్టెంట్ ఎవరు అవుతారని అడిగిన ప్రశ్నకు హారిక పేరు ఉంటుందని భావిస్తున్నాను అని చెప్పాడు. దాంతో ఒక బ్యానర్‌ను చేతిలో పెట్టి దానిని విప్పి చూడమని చెప్పగా.. అందులో హారిక ఫోటో కనిపించింది. దాంతో ఇంటి సభ్యుల్లో 5వ సభ్యుడి ఎంపిక మిగిలింది.

టాప్ 5లో అరియానా గ్లోరి
ఇక టాప్ 5లో నిలిచేందుకు మోనల్, అరియానా ఇద్దరు మిగలడంతో టెన్షన్ పెరిగింది. ఎవరు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతారనే ఆసక్తి పెరిగిపోయింది. అయితే తన నోటి నుంచి ఎలిమినేట్ అయ్యే వ్యక్తి పేరు చెప్పనని, బిగ్‌బాస్‌కు అవకాశం ఇస్తున్నని నాగ్ చెప్పాడు. ఆ తర్వాత ప్రింటర్ ఆన్ చేసి అందులో వచ్చిన ఫోటోను చూపించాడు. టాప్ 5 ఫైనలిస్టుగా అరియానా గ్లోరి ఎంపికైందని చెప్పాడు. దాంతో ఒక్కసారిగా ఆమె కుప్పకూలిపోయింది.

నమ్మలేకపోయిన అరియానా
ఎలిమినేషన్ నుంచి బయటపడటమే కాకుండా టాప్ 5లో నిలవడంపై కాసేపు ఆమె నమ్మలేకపోయింది. ఆ తర్వాత సోహెల్‌ను కౌగిలించుకొని తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఓటు వేసిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు అంటూ థ్యాంక్స్ చెప్పింది. తాను సేవ్ కావడమే కాకుండా టాప్ 5లో నిలువడంపై సంతోషాన్ని వ్యక్తం చేసింది.
Recommended Video

ముగిసిన మోనాల్ గజ్జర్ బిగ్‌బాస్ జర్నీ
ఆ తర్వాత మోనల్ గజ్జర్ ఎలిమినేట్ అయ్యారని నాగ్ ప్రకటించారు. ఇంటి సభ్యులతో ఫోటో దిగి వేదికపైకి రావాలని సూచించారు. దాంతో ఇంటి సభ్యుల్లో ఒక రకమైన బాధకనిపించింది. ఆ తర్వాత ఇంటి సభ్యులతో ఫోటో దిగి నాగ్ వద్దకు వచ్చి.. తన జర్నీ చూసి ఇంటి సభ్యులతో మాట్లాడింది. నాగ్‌తో సెల్ఫీ దిగి తన బిగ్‌బాస్ ప్రయాణాన్ని ముగించింది.


Click it and Unblock the Notifications











