అఖిల్ సార్థక్‌ బెడ్‌రూంలో మోనాల్ గజ్జర్: అలా బయటకొచ్చిన మేటర్.. తనంటే అందుకే ఇష్టమంటూ!

ఎవరైనా సెలెబ్రిటీ స్వతహాగానే ఫేమస్ అవుతూ ఉంటారు. అలాంటిది మరొకరితో కలిసి జంటగా పాపులర్ అయ్యారంటే.. వాళ్లిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ ఉందనే అర్థం. ఇలా బిగ్ బాస్ షోలో రచ్చ చేసి జోడీగా పేరు తెచ్చుకున్నారు అఖిల్ సార్థక్.. మోనాల్ గజ్జర్. హౌస్‌లో జంటగా హల్‌చల్ చేసిన వీళ్లిద్దరూ బయట కూడా అదే కంటిన్యూ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా అఖిల్ సార్థక్ బెడ్‌రూంలో మోనాల్ గజ్జర్ కనిపించింది. అంతేకాదు, అప్పుడు తనంటే ఎందుకు ఇష్టమో చెప్పేశాడు అఖిల్ సార్థక్. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

 అలా మొదలైన ప్రేమ కహానీ

అలా మొదలైన ప్రేమ కహానీ

హీరోయిన్ మోనాల్ గజ్జర్.. మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ అఖిల్ సార్థక్ బిగ్ బాస్ హౌస్‌లోకి సాదాసీదా కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. ఆరంభంలో సైలెంట్‌గా, దూరంగా ఉన్న వీళ్లిద్దరూ క్రమంగా దగ్గరయ్యారు. ఆ సమయంలోనే చూపులు, మాటలు, మనసులు కలుపుకున్నారు. అలా వీళ్లిద్దరి మధ్య ప్రేమ మొదలైంది. అప్పటి నుంచి ఈ జంట మధ్య లవ్ కంటిన్యూ అవుతూనే ఉంది.

ముద్దులతో... హగ్గులతో రచ్చ

ముద్దులతో... హగ్గులతో రచ్చ

మొదట్లో దూరం దూరంగా కనిపించిన మోనాల్ గజ్జర్.. అఖిల్ సార్థక్.. ఆ తర్వాత మరింతగా రెచ్చిపోయారు. ఎప్పుడూ కలిసే ఉంటూ ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా ఆడుతూ రచ్చ రచ్చ చేశారు. ఈ క్రమంలోనే ఎన్నో గొడవల్లో భాగం అయ్యారు. ఇక, రొమాంటిక్ యాంగిల్‌ను కూడా చూపిస్తూ.. అప్పుడప్పుడూ ముద్దులు, హగ్గులతో ప్రేమను పండించేవారు. తద్వారా హైలైట్ అయ్యారు.

షో తర్వాత ఇద్దరూ బిజీగానే

షో తర్వాత ఇద్దరూ బిజీగానే

బిగ్ బాస్ షో ద్వారా అటు అఖిల్ సార్థక్.. ఇటు మోనాల్ గజ్జర్ ఎనలేని క్రేజ్‌ను అందుకున్నారు. దీంతో రెమ్యూనరేషన్ కూడా భారీగానే అందుకున్నారు. అంతేకాదు, సినిమా, షోలు, వెబ్ సిరీస్‌లలో అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. మోనాల్ వరుస షూట్లతో బిజీగా ఉంటే అఖిల్ మూవీని ప్రకటించడంతో పాటుగా మరోసారి డిజైరబుల్ మ్యాన్ అయ్యాడు.

 బయట కూడా రెచ్చిపోతూనే

బయట కూడా రెచ్చిపోతూనే

దాదాపు వంద రోజుల పాటు బిగ్ బాస్ హౌస్‌లో జంటగా హల్‌చల్ చేసిన మోనాల్ గజ్జర్.. అఖిల్ సార్థక్.. బయటకు వచ్చిన తర్వాత కూడా అదే తీరుతో వార్తల్లో నిలుస్తున్నారు. తరచూ కలవడం.. జంటగా పార్టీలు చేసుకోవడం.. ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తపరచుకోవడం వంటి వాటితో నిత్యం హాట్ టాపిక్ అవుతున్నారు. దీంతో ఈ జంట బయట ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకుంది.

 అది ఇంకా మొదలెట్టలేదుగా

అది ఇంకా మొదలెట్టలేదుగా

వాలంటైన్స్‌ డేను పురస్కరించుకుని అఖిల్ సార్థక్‌తో చేస్తున్న వెబ్ సిరీస్‌ను ప్రకటించింది మోనాల్ గజ్జర్. 'తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి' అనే టైటిల్‌తో వస్తున్న దీన్ని సరస్వతి క్రియేషన్స్ బ్యానర్‌పై భాస్కర్ బంతుపల్లి తెరకెక్కిస్తున్నారు. అంతేకాదు, ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. అయితే, ఇద్దరి మధ్య డేట్స్ కుదరకపోవడంతో ఇది ఇంకా పట్టాలెక్కలేదు.

అఖిల్ బెడ్‌రూంలో మోనాల్

అఖిల్ బెడ్‌రూంలో మోనాల్

తాజాగా ఓ ప్రముఖ ఛానెల్‌తో మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ అఖిల్ సార్థక్ చిట్ చాట్ నిర్వహించాడు. ఇది అతడి ఇంట్లో, కారులో జరిగింది. ఇక, ఈ ఇంటర్వ్యూ జరుగుతోన్న సమయంలో అతడు తన బెడ్‌రూంను కూడా చూపించాడు. ఆ సమయంలో అందులో మోనాల్ గజ్జర్ ఫొటో కనిపించింది. బిగ్ బాస్ హౌస్‌లో అఖిల్ వెనుక ఆమె నిల్చుని ఉన్న సమయంలో తీసిన ఫొటో అది.

Recommended Video

Most Awaited Movies Love Story , Kgf chapter 2 Updates || Filmibeat Telugu
తనంటే అందుకే ఇష్టమంటూ

తనంటే అందుకే ఇష్టమంటూ

ఇక, ఈ ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను వెల్లడించాడు అఖిల్ సార్థక్. ఈ సందర్భంగా మోనాల్ గజ్జర్ గురించి మాట్లాడుతూ.. 'మోనాల్ అంటే నాకు చాలా ఇష్టం. తను నా ఫ్యామిలీ టైప్. అందుకే తన ఫొటోను బెడ్‌రూంలో పెట్టుకున్నాను. అంతేకాదు, నా కోసం ఎక్కువగా ఆలోచించే వాళ్లలో మోనాల్ ఒకరు. అందుకే నాకు తను అంత దగ్గరైంది' అంటూ చెప్పుకొచ్చాడీ స్టార్ బాయ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X