Akhil Sarthak పై ప్రేమను మరోసారి బయటపెట్టిన మోనాల్: అంతా చూడండి అంటూ ఏకంగా ఆ మాట చెప్పేసింది!

తెలుగులో ప్రసారం అవుతోన్న సక్సెస్‌ఫుల్ షోలలో బిగ్ బాస్ ఒకటి. రియాలిటీ ఆధారంగా నడిచే దీనికి ప్రేక్షకుల నుంచి ఊహించని రీతిలో స్పందన దక్కుతోంది. అదే సమయంలో ఈ షో ద్వారా ఎంతో మంది బడా సెలెబ్రిటీలుగా ఎదిగిపోతున్నారు. అందులో కొందరు మాత్రం జంటగా ఫేమస్ అయ్యారు. అందులో అఖిల్ సార్థక్ - మోనాల్ గజ్జర్ జంట ఒకటి. హౌస్‌లో విపరీతంగా రచ్చ చేసిన వీళ్లిద్దరూ.. బయట కూడా అలాగే చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అఖిల్‌ను ఉద్దేశిస్తూ మోనాల్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆ వివరాలు మీకోసం!

అలా జంటగా మారిన అఖిల్ - మోనాల్

అలా జంటగా మారిన అఖిల్ - మోనాల్

మోనాల్ గజ్జర్.. అఖిల్ సార్థక్ బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. ఆరంభంలో వీళ్లిద్దరూ దూరం దూరంగానే ఉంటూ వచ్చారు. కానీ, కొద్ది రోజులకు చూపులు, మాటలు కలుపుకున్నారు. అప్పటి నుంచి ఎప్పుడూ కలిసే కనిపించేవారు. అలా వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అప్పట్లో ట్రైయాంగిల్ లవ్ అని ఒక ట్రాక్ కనిపించినా.. అది మధ్యలనే ఆగిపోయింది.

హౌస్‌లో రచ్చ... హగ్గులు... ముద్దులతో

హౌస్‌లో రచ్చ... హగ్గులు... ముద్దులతో

ఆరంభంలో చాలా సైలెంట్‌గా కనిపించిన మోనాల్ గజ్జర్.. ఆ తర్వాత అఖిల్ సార్థక్‌‌తో నేరుగానే ప్రేమను పండించింది. ఎక్కువగా అతడితోనే ఉంటూ.. అతడి కోసమే ఆడుతూ హాట్ టాపిక్ అయింది. అంతేకాదు, తరచూ ప్రేమను వ్యక్తపరుస్తూ వచ్చింది. అదే సమయంలో ముద్దులు, హగ్గులు ఇస్తూ వార్తల్లో నిలిచింది. అలా బిగ్ బాస్‌ హౌస్‌లో అతడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగేసిందామె.

బిగ్ బాస్ ఎఫెక్ట్.. అతడలా.. ఆమె ఇలా

బిగ్ బాస్ ఎఫెక్ట్.. అతడలా.. ఆమె ఇలా

బిగ్ బాస్ షో పుణ్యమా అని అఖిల్ సార్థక్.. మోనాల్ గజ్జర్ జోడీ ఎనలేని క్రేజ్‌ను అందుకున్నారు. అదే సమయంలో వీళ్లిద్దరూ ఆట పరంగానూ సత్తా చాటారు. దీంతో రెమ్యూనరేషన్ కూడా భారీగానే అందుకున్నారు. అంతేకాదు, సినిమా, షోలు, వెబ్ సిరీస్‌లలో అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. మోనాల్ వరుస షూట్లతో బిజీగా ఉంటే అఖిల్ మూవీని ప్రకటించాడు.

హౌస్‌లోనే కాదు... బయట కూడా అలా

హౌస్‌లోనే కాదు... బయట కూడా అలా

బిగ్ బాస్ హౌస్‌లో దాదాపు వంద రోజుల పాటు జంటగా హల్‌చల్ చేసిన మోనాల్ గజ్జర్.. అఖిల్ సార్థక్.. బయటకు వచ్చిన తర్వాత కూడా అదే తీరుదతో వార్తల్లో నిలుస్తున్నారు. తరచూ కలవడం.. జంటగా పార్టీలు చేసుకోవడం.. ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తపరచుకోవడం వంటి వాటితో నిత్యం హాట్ టాపిక్ అవుతున్నారు. దీంతో ఈ జంట బయట కూడా ట్రెండింగ్ అవుతోంది.

కలిసి ప్రకటించారు... ఇంకా మొదలెట్టలే

కలిసి ప్రకటించారు... ఇంకా మొదలెట్టలే

ప్రేమికుల రోజును పురస్కరించుకుని అఖిల్ సార్థక్‌తో చేస్తున్న వెబ్ సిరీస్‌ను ప్రకటించింది మోనాల్ గజ్జర్. 'తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి' అనే టైటిల్‌తో వస్తున్న దీన్ని సరస్వతి క్రియేషన్స్ బ్యానర్‌పై భాస్కర్ బంతుపల్లి తెరకెక్కిస్తున్నారు. అంతేకాదు, ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. అయితే, ఇద్దరి డేట్స్ కుదరకపోవడంతో ఇది ఇంకా పట్టాలెక్కలేదని తెలిసింది.

మోస్ట్ డిజైరబుల్‌ మ్యాన్‌గా అఖిల్ సార్థక్

మోస్ట్ డిజైరబుల్‌ మ్యాన్‌గా అఖిల్ సార్థక్

2020 సంవత్సరానికి గానూ హైదరాబాద్ టైమ్స్ పత్రిక ప్రకటించిన మోస్ట్ డిజైరబుల్‌ మ్యాన్ జాబితాలో బిగ్ బాస్ రన్నర్ అఖిల్ సార్థక్ మొదటి స్థానంలో నిలిచాడు. దీంతో అతడికి బుల్లితెరతో పాటు వెండితెరకు చెందిన సెలెబ్రిటీల నుంచి భారీ స్థాయిలో శుభాకాంక్షలు వస్తున్నాయి. ఇప్పుడే కాదు.. గతంలోనూ అతడు ఓ సారి మోస్ట్ డిజైరబుల్‌ మ్యాన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే.

Recommended Video

Bengaluru లో Pranitha Subhash Nitin Raju Marriage | గొప్ప మనసున్న నటి || Filmibeat Telugu
మోనాల్ గజ్జర్ నుంచి ఊహించని పోస్టు

మోనాల్ గజ్జర్ నుంచి ఊహించని పోస్టు

అఖిల్ సార్థక్ మోస్ట్ డిజైరబుల్‌ మ్యాన్‌గా ఎంపిక అవడం పట్ల మోనాల్ గజ్జర్ స్పందించింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఈ విషయాన్ని షేర్ చేసుకుంటూ.. 'అందరూ చూడండి.. మా దోస్త్ అఖిలే నెంబర్ వన్' అంటూ ముద్దుల ఎమోజీలను పెట్టింది. తద్వారా తన ప్రేమను మరోసారి వ్యక్త పరచుకుంది. అదే సమయంలో 'అఖిలే నెంబర్ వన్' అంటూ ప్రపంచానికి చాటి చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X