అదే జరిగింది.. సోహెల్, మోహబూబ్ వీడియోపై ఘాటుగా స్పందించిన మోనాల్
బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్ ముగిసిన తర్వాత సెలబ్రిటీలందరూ యూట్యూబ్, ఇన్స్‌టాగ్రామ్‌లో లైవ్ ఛాట్‌తో సందడి చేశారు. ఈ సందర్భంగా మోనాల్ గజ్జర్ తన అభిమానులతో ముచ్చటించారు. అంతేకాకుండా అభిజిత్, అఖిల్, మెహబూబ్, సోహెల్‌తో గొడవలు, వివాదంగా గురించి మాట్లాడుతూ..

అలా చేయకపోవడం బాధగా ఉంది
బిగ్‌బాస్ ఇంటిలో ఇంకా బాగా చేయాల్సిందనే విషయం ఇప్పుడు వెంటాడుతున్నది. ఇంటిలోకి వెళ్లడానికి ముందు తెలుగు నేర్చుకొని ఉండాల్సింది. అంతేకాకుండా ఐదారు వారాల తర్వాత తెలుగును అర్ధం చేసుకోలేకపోయాను. అది నాకు బాధ కలిగించే అంశం అని మోనాల్ చెప్పారు.

అభిజిత్‌తో నేను మాట్లాడాను..
బిగ్‌బాస్ తెలుగు 4 ట్రోఫి గెలిచిన తర్వాత అభిజిత్‌తో మాట్లాడాను. అతడికి కంగ్రాట్స్ చెప్పాను. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని అభినందించాను. తాను కూడా నాతో పాజిటివ్‌గా స్పందించాడని మోనాల్ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చింది.

అఖిల్ పులిహోర కామెంట్‌పై
అఖిల్‌ను, అవినాష్‌ను పులిహోర అనడంపై మోనాల్ స్పందిస్తూ.. ఇంటిలో ఒకరినొకరం ఆటపట్టించుకోవడానికి అలా కామెంట్ చేసుకొన్నాం. దానిని అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంటిలో ఏ ఒక్కరు కూడా పులిహోర కలిపే వాళ్లు లేరు అని మోనాల్ చెప్పింది.

మెహబూబ్ ఏం చెప్పాడో తెలియదు
బిగ్‌బాస్ ఇంటిలో సోహెల్ సయ్యద్, మెహబూబ్ దిల్ సే మధ్య చోటుచేసుకొన్న సంభాషణ గురించి నాకు తెలిసింది. ఆ వీడియోను నేను కూడా చూశాను. సోహెల్‌కు మెహబూబ్ ఏదో చెప్పడం గమనించాను. కానీ మోహబూబ్ ఏం చెప్పాడో అది నాకు అర్థం కాలేదు. అది ఇంట్లో ఉన్నవారు చెప్పాల్సిన విషయం. ఏం జరిగిందో వారికే బాగా తెలుస్తుంది అని మోనాల్ అన్నారు.


Click it and Unblock the Notifications











