For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘మోనాల్ గజ్జర్’ భారీ మోసం: ఫొటోతో బండారం బయట పెట్టిన హీరోయిన్!

  |

  మోనాల్ గజ్జర్.. తెలుగు రాష్ట్రాల్లో కొంత కాలంగా మారుమ్రోగిపోతోన్న పేరిది. అంతలా ఈ బ్యూటీ హల్‌‌చల్ చేసేస్తోంది. అప్పుడెప్పుడో సినిమాల్లోకి ప్రవేశించినప్పటికీ అంతగా గుర్తింపును మాత్రం దక్కించుకోలేదు. కానీ, ఎప్పుడైతే బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చిందో.. అప్పటి నుంచి ఆమె భారీగా పాపులారిటీని సంపాదించుకుంది. దీంతో వరుస ఆఫర్లను కూడా దక్కించుకుంటోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ ఫాలోయింగ్‌ను అందుకుంటోంది. ఈ నేపథ్యంలోనే మోనాల్ గజ్జర్ ఫొటోను పోస్ట్ చేసి మరీ ఓ భారీ మోసాన్ని బయట పెట్టేసింది. ఆ వివరాలు మీకోసం!

  ఎయిర్ పోర్ట్ లోనూ వదలని కృష్ణా ష్రాఫ్..హాట్ డ్రెస్ లో హీట్ పెంచేస్తూ

  అప్పుడెప్పుడో అలా వచ్చిన మోనాల్

  అప్పుడెప్పుడో అలా వచ్చిన మోనాల్

  అల్లరి నరేష్ నటించిన ‘సుడిగాడు' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా అడుగు పెట్టింది గుజరాతీ బ్యూటీ మోనాల్ గజ్జర్. ఆ తర్వాత టాలీవుడ్‌లో మరో రెండు మూడు చిత్రాల్లో నటించింది. అయితే, ఇవేమీ ఆమెకు అంతగా గుర్తింపును తీసుకు రాలేకపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన ఇండస్ట్రీకి బైబై చెప్పేసింది. అప్పటి నుంచి వేరే భాషల్లో నటిస్తూ వచ్చింది.

  చీరలో కూడా గ్లామర్ తో కవ్విస్తున్న నివిషా

  బిగ్ బాస్ ఆఫర్... ఆరంభంలోనే ప్రేమ

  బిగ్ బాస్ ఆఫర్... ఆరంభంలోనే ప్రేమ

  తెలుగులో పెద్దగా సినిమాలు చేయకున్నా.. బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుంది మోనాల్ గజ్జర్. ఆరంభంలోనే ట్రైయాంగిల్ లవ్ స్టోరీతో ఫేమస్ అయిందామె. ఆ తర్వాత అఖిల్ సార్థక్‌తో కలిసి ప్రేమాయణం సాగిస్తుందన్న వార్తలతో మరింత పాపులర్ అయింది. ఇలా గేమ్ పరంగా కంటే లవ్ ట్రాకుల కారణంగానే ఈ అమ్మడు ఎనలేని క్రేజ్‌ను అందుకుంది.

  అమ్రిత అయ్యర్.. నవ్వుతోనే మాయ చేస్తున్న హాట్ బ్యూటీ

  ఇంటా బయటా రచ్చ రచ్చ చేసేసిందిగా

  ఇంటా బయటా రచ్చ రచ్చ చేసేసిందిగా

  బిగ్ బాస్ హౌస్‌లో అఖిల్ సార్థక్‌తో కలిసి మోనాల్ గజ్జర్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. చుట్టూ ఎంతో మంది ఉన్నా.. వీళ్లిద్దరే జంటగా కనిపిస్తూ ఉండేవారు. అదే సమయంలో హగ్గులు, ముద్దులతో హల్‌చల్ చేసేవారు. ఇలా హౌస్‌లో మాత్రమే కాదు.. బయటకు వచ్చిన తర్వాత కూడా తరచూ కలుస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. తద్వారా జంటగా ఉంటూ వార్తల్లో నిలుస్తున్నారు.

  హాట్ బ్యూటీగా దృశ్యం మూవీ చిన్నారి.. ఎస్తేర్ అనిల్ ఫొటోలు వైరల్ై

  మోనాల్‌పై ఆఫర్ల వర్షం.. అందులో ఫిక్స్

  మోనాల్‌పై ఆఫర్ల వర్షం.. అందులో ఫిక్స్

  బిగ్ బాస్ షో పుణ్యమా అని మోనాల్ గజ్జర్‌కు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. ఒక్క దెబ్బతో ఆమె సెన్సేషన్ అయిపోయింది. దీంతో ఆఫర్లు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన ‘అల్లుడు అదుర్స్'లో స్పెషల్ సాంగ్ చేసిన ఈ బ్యూటీ.. ప్రముఖ ఛానెల్‌లో ఓంకార్ నడిపిస్తోన్న ‘డ్యాన్స్ ప్లస్' అనే షోలో పర్మినెంట్ జడ్జ్‌గా చేస్తోంది.

  అందాలతో యాంకర్ అనసూయ భరద్వాజ్ మాయ.. లేటేస్ట్ ఫోటోషూట్ వైరల్

  ఎప్పుడూ అందులోనే ఉంటూ హల్‌చల్

  ఎప్పుడూ అందులోనే ఉంటూ హల్‌చల్

  వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నప్పటికీ మోనాల్ గజ్జర్ నిత్యం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ హల్‌చల్ చేస్తోంది. తద్వారా ఫాలోవర్లను గణనీయంగా పెంచుకుంటూ దూసుకెళ్తోంది.

  ఓర చూపులతో మతులు చెడగొడుతున్న భానుశ్రీ

  ‘మోనాల్ గజ్జర్' పేరుతో భారీ మోసం

  ‘మోనాల్ గజ్జర్' పేరుతో భారీ మోసం

  బిగ్ బాస్ షో తర్వాత మోనాల్ గజ్జర్‌కు సోషల్ మీడియాలో ఎనలేని క్రేజ్ సొంతం అయింది. దీంతో ఆమె పేరిట, ఆమెను అభిమానించే వారి పేరిట ఎన్నో అకౌంట్లు క్రియేట్ అయ్యాయి. ఫలితంగా కొద్ది రోజులుగా మోనాల్ గజ్జర్ పేరు ట్రెండ్ అవుతోంది. ఇలాంటి సమయంలో ఈ గుజరాతీ హీరోయిన్ తన పేరును వాడుకుంటూ యూట్యూబ్‌లో కొందరు చేస్తున్న మోసాన్ని బయట పెట్టేసింది.

  BA Raju : Mahesh Babu కి Loyal PRO, Tollywood Encyclopaedia || Filmibeat Telugu
  ఫొటోతో బండారం బయట పెట్టిన బ్యూటీ

  ఫొటోతో బండారం బయట పెట్టిన బ్యూటీ

  యూట్యూబ్‌లో ‘M Monal Gajjar Official' అనే పేరుతో ఓ అకౌంట్‌ను క్రియేట్ చేశారు. అందులో మోనాల్ గజ్జర్‌కు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. దీంతో అది ఆమెదే అనుకుని చాలా మంది సబ్‌స్క్రైబ్ చేసుకుంటున్నారు. ఇది మోనాల్ దృష్టికి వెళ్లడంతో దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ షేర్ చేస్తూ ఇది ఫేక్ అని తేల్చేసింది. అంతేకాదు, దీనిపై రిపోర్ట్ చేయమని కోరింది.

  English summary
  టాలీవుడ్ హీరోయిన్, బిగ్ బాస్ ఫేం మోనాల్ గజ్జర్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఫేక్ యూట్యూబ్ అకౌంట్ వివరాలు రివీల్ చేసింది.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X