ఆ వీడియోతో అడ్డంగా దొరికిపోయిన మోనాల్: లీకైన టాప్ సీక్రెట్.. హాట్ షోతో మంట పెట్టేసింది కూడా!

దాదాపు ఎనిమిదేళ్ల క్రితమే తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయం అయినా.. అంతగా గుర్తింపును తెచ్చుకోలేకపోయింది గుజరాతీ భామ మోనాల్ గజ్జర్. దీంతో టాలీవుడ్‌కు టాటా చెప్పేసింది. ఇలాంటి పరిస్థితుల్లో సుదీర్ఘ విరామం తర్వాత బిగ్ బాస్ షో కోసం హైదరాబాద్‌లో అడుగు పెట్టింది. అయితే, ఈ సారి మాత్రం ఆమె ఎనలేని క్రేజ్‌ను అందుకుంది. తద్వారా వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ఇలాంటి సమయంలో తన వ్యవహార శైలితో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ సెల్ఫీ వీడియోతో అడ్డంగా దొరికిపోయింది. ఆ వివరాలు మీకోసం!

బిగ్ బాస్ ఎంట్రీ.. ట్రైయాంగిల్ లవ్‌తో ఫేమస్

బిగ్ బాస్ ఎంట్రీ.. ట్రైయాంగిల్ లవ్‌తో ఫేమస్

సుదీర్ఘ విరామం తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షో వల్ల తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది మోనాల్ గజ్జర్. రావడం రావడమే యంగ్ హీరో అభిజీత్‌తో క్లోజ్‌గా మూవ్ అయింది. దీంతో వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందన్న టాక్ బాగా వినిపించింది. అయితే, అదే సమయంలో అఖిల్ సార్థక్‌తోనూ చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. తద్వారా ఇది ట్రైయాంగిల్ లవ్‌గా కనిపించడంతో ఆమె ఫేమస్ అయింది.

అతడితో కలిసి రచ్చ.. హగ్గులు, ముద్దులతో

అతడితో కలిసి రచ్చ.. హగ్గులు, ముద్దులతో


బిగ్ బాస్ షో నడుస్తోన్న కొద్దీ మోనాల్ గజ్జర్ క్రమంగా అఖిల్ సార్థక్ ప్రేమలో పడిపోయింది. తరచూ అతడితోనే ఉంటూ.. అతడి కోసమే చూస్తూ కెమెరాలు ఫోకస్ చేసేలా చేసుకుంది. దీంతో ప్రేక్షకులతో పాటు హౌస్‌మేట్స్ కూడా ఈ బంధాన్ని ఎక్కువగా హైలైట్ చేశారు. ఆ తర్వాత ఆమె మరింతగా రెచ్చిపోయింది. అతడికి ముద్దులు, హగ్గులు ఇస్తూ తరచూ వార్తల్లో నిలిచింది.

పేరు.. డబ్బు.. ఆఫర్లు.. మోనాల్ ఫుల్ బిజీ

పేరు.. డబ్బు.. ఆఫర్లు.. మోనాల్ ఫుల్ బిజీ

అంచనాలు లేకుండానే బిగ్ బాస్ షోలోకి వచ్చిన మోనాల్ గజ్జర్.. పద్నాలుగు వారాల పాటు షోలో కొనసాగింది. దీంతో ఆమె మొత్తంగా రూ. 50 లక్షలు పైగానే ముట్టాయని తెలిసింది. ఈ షో వల్ల క్రేజ్‌ను కూడా భారీగానే అందుకున్న ఈ అమ్మడు.. వరుసగా ఆఫర్లు అందుకుంటోంది. ఓంకార్ 'డ్యాన్స్+' అనే షోకు జడ్జ్‌గా ఎంపికవడంతో పాటు 'అల్లుడు అదుర్స్'లో ఐటమ్ సాంగ్ కూడా చేసింది.

అఖిల్‌తో రచ్చకు రెడీ... ప్రేమికుల రోజే అలా

అఖిల్‌తో రచ్చకు రెడీ... ప్రేమికుల రోజే అలా

ప్రేమికుల రోజును పురస్కరించుకుని అఖిల్ సార్థక్‌తో చేస్తున్న వెబ్ సిరీస్‌ను ప్రకటించింది మోనాల్ గజ్జర్. 'తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి' అనే టైటిల్‌తో వస్తున్న దీన్ని సరస్వతి క్రియేషన్స్ బ్యానర్‌పై భాస్కర్ బంతుపల్లి తెరకెక్కిస్తున్నారు. ఈ విషయాన్ని ఈ ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అంతేకాదు, ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

అందులో ఆమెదే హవా... ఎక్కువగా ఫోకస్‌

అందులో ఆమెదే హవా... ఎక్కువగా ఫోకస్‌

మోనాల్ గజ్జర్ ప్రస్తుతం 'డ్యాన్స్+' షోలోనే చేస్తోంది. ఇందులో ఆమె జడ్జ్‌గా వ్యవహరించే తీరు ఆకట్టుకుంటోంది. అలాగే, ఆమె డ్రెస్సింగ్ కూడా మెప్పించే విధంగా ఉంది. మొదట్లో అందాలను కనిపించేలా అలంకరించుకున్న ఈ భామ... ఈ మధ్య కాలంలో సంప్రదాయంగా కనిపిస్తోంది. దీంతో ఆమెను ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు షో నిర్వహకులు. తద్వారా తరచూ హైలైట్ అవుతోంది.

ఆ వీడియోతో అడ్డంగా దొరికిపోయిన మోనాల్

ఆ వీడియోతో అడ్డంగా దొరికిపోయిన మోనాల్


మోనాల్ గజ్జర్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోందన్న విషయం తెలిసిందే. తరచూ తనకు సంబంధించిన విషయాలను దీని ద్వారానే వెల్లడిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సెల్ఫీ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఎంతో హాట్‌గా కనిపించిన ఈ బ్యూటీ.. క్యూట్‌గా మాట్లాడుతూ ఊహించని విధంగా ఓ టాప్ సీక్రెట్‌ను రివీల్ చేసి అడ్డంగా దొరికిపోయింది.

లీకైన టాప్ సీక్రెట్.. ఆమె అలా వచ్చేసిందంటూ

లీకైన టాప్ సీక్రెట్.. ఆమె అలా వచ్చేసిందంటూ

'డ్యాన్స్+' షో నుంచి రెండు వారాల క్రితం ఓ జడ్జ్ ముమైత్ ఖాన్ (ఆమె కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయిన కారణంగా) బయటకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అయితే, మోనాల్ గజ్జర్ పెట్టిన సెల్ఫీ వీడియోలో ముమైత్ షోలోకి రీఎంట్రీ ఇచ్చినట్లు ముందుగానే లీక్ చేసేసింది. అంతేకాదు, ఆమె తన పక్కనే కూర్చుందని కూడా చెబుతూ చూపించింది. దీంతో షో టాప్ సీక్రెట్ లీకైపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X