స్కిన్ షో చేయమన్నారు.. హారిక అందుకే అలా కనిపించింది: బిగ్ బాస్ బండారం బయటపెట్టిన మోనాల్
అల్లరి నరేష్ నటించిన 'సుడిగాడు' అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది గుజరాతీ బ్యూటీ మోనాల్ గజ్జర్. ఆ వెంటనే తెలుగులో మరో రెండు మూడు సినిమాల్లో నటించిన ఈ అమ్మడు.. ఆ తర్వాత టాలీవుడ్‌కు దూరమైంది. సుదీర్ఘ విరామం తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షో కోసం ఈమె.. హైదరాబాద్‌లో అడుగు పెట్టింది. సాధారణ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. అసాధారణ ప్రతిభతో ఫుల్ పాపులర్ అయిందీ బ్యూటీ. బయటకు వచ్చాక వరుస ఆఫర్లు అందుకుంటూ సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో మోనాల్ గజ్జర్ బిగ్ బాస్ బండారం బయటపెట్టింది. ఆ వివరాలు మీకోసం!

మొదటి కంటెస్టెంట్.. అందరితో కలిసిపోయి
తెలుగులో కొన్ని సినిమాలే చేసినప్పటికీ బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కించుకుంది మోనాల్ గజ్జర్. ప్రీమియర్ ఎపిసోడ్‌లో మొదటి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె.. తర్వాత వచ్చిన అందరినీ చక్కగా రిసీవ్ చేసుకుని మంచి పేరు తెచ్చుకుంది. అదే సమయంలో మొదటి ఎపిసోడ్‌లోనే ఎమోషనల్ అవుతూ పాతలగంగను తలపించిందీ గుజరాతీ బ్యూటీ.

మొదట అతడితో.... ఆ తర్వాత మరొకరితో
నాలుగో సీజన్ ఆరంభంలో తోటి కంటెస్టెంట్ యంగ్ హీరో అభిజీత్‌కు బాగా దగ్గరైంది మోనాల్ గజ్జర్. దీంతో వీళ్లిద్దరూ ప్రేమాయణం సాగిస్తారని అంతా అనుకున్నారు. కానీ, అదే సమయంలో అఖిల్ సార్థక్‌తోనూ చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. దీంతో వీళ్ల మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తున్నట్లు చూపించడంతో ఆమె బాగా ఫేమస్ అయింది. దీనివల్ల ఆమెకు చెడ్డ పేరు కూడా వచ్చింది.

గ్లామర్ షో.. రొమాన్స్.. రెచ్చిపోయిన భామ
బిగ్ బాస్ నాలుగో సీజన్ మొత్తంలో మోనాల్ గజ్జర్ బాగా హైలైట్ అయింది. పొట్టి పొట్టి దుస్తులు వేసుకోకున్నప్పటికీ, స్కిన్ షో మాత్రం చేసింది. మరీ ముఖ్యంగా వీకెండ్ సమయంలో ఆమె తన అందాలతో కనువిందు చేసేది. దీంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. అలాంటి సమయంలోనే తన ప్రియుడు అఖిల్ సార్థక్‌తో ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయింది మోనాల్ గజ్జర్.

అనుకోకుండా ఎలిమినేట్.. ఆఫర్లతో అదుర్స్
మోనాల్ గజ్జర్ బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించినప్పుడు ఆమె ఎన్నో రోజులు ఉండదని అంతా అనుకున్నారు. కానీ, అందుకు భిన్నంగా పద్నాలుగు వారాల పాటు షోలో కొనసాగింది. ఫినాలే వీక్‌కు ముందే హౌస్ నుంచి బయటకు వెళ్లింది. బిగ్ బాస్ తర్వాత అమ్మడు వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ఇప్పటికే ఓ సినిమాలో ఐటమ్ సాంగ్‌తో పాటు డ్యాన్స్ షోకు జడ్జ్‌గా చేస్తోంది.

ఆ పనిలో బిజీగా ఉన్న గుజరాతీ అమ్మాయి
బయటకు వచ్చిన తర్వాత తన స్నేహితులతో కలిసి రచ్చ రచ్చ చేసింది మోనాల్ గజ్జర్. ఈ నేపథ్యంలో చాలా రోజుల తర్వాత తన కుటుంబాన్ని కలిసేందుకు అహ్మదాబాద్ వెళ్లింది. ఇలాంటి సమయంలోనే ఆమె హైదరాబాద్ షిప్ట్ అవబోతున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అలాగే, ఓ ఇంటిని కూడా కొనబోతుందని అంటున్నారు. ఇప్పుడు ఈ పనితోనే బిజీగా ఉందని టాక్.

బిగ్ బాస్ బండారం బయటపెట్టిన మోనాల్
తాజా ఇంటర్వ్యూలో మోనాల్ తన డ్రెస్సింగ్ గురించి మాట్లాడుతూ.. 'నాకు కంఫర్ట్‌గా ఉన్న బట్టలనే వేసుకున్నా. ఎవరో విమర్శలు చేస్తున్నారని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ ఫస్ట్ ఎపిసోడ్‌లో బిగ్ బాస్ వాళ్లు నన్ను పొట్టి బట్టలు వేసుకోమన్నారు. నేను ఒప్పుకోలేదు. దీంతో వాటిని హారికకు ఇచ్చారు. ఆమె మాత్రం వేసుకోక తప్పలేదు' అంటూ షో బండారం బయట పెట్టింది.


Click it and Unblock the Notifications











