ఎయిర్‌పోర్టులో మోనాల్‌కు ఊహించని షాక్: ఆ పేరుతో కామెంట్స్ చేయడంతో తట్టుకోలేక ఇలా!

గ్లామరస్ హీరోయిన్‌గా తెలుగు వారికి పరిచయం అయింది గుజరాతీ భామ మోనాల్ గజ్జర్. మన సినిమాలతోనే సినీ రంగ ప్రవేశం చేసిన ఈ ముద్దుగుమ్మ.. అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఫలితంగా ఇండస్ట్రీకి దూరమైంది. అయితే, బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో పాల్గొనడం కోసం మరోసారి హైదరాబాద్ వచ్చిన ఈమె.. షోలో రచ్చ రచ్చ చేయడంతో హాట్ టాపిక్ అయిపోయింది. మరీ ముఖ్యంగా ప్రేమాయణంతో పాపులర్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా తనకు జరిగిన ఓ ఊహించని అనుభవం గురించి బయట పెట్టింది మోనాల్. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

ఇలా వచ్చి.. అలా వెళ్లింది.. షోతో రీఎంట్రీ

ఇలా వచ్చి.. అలా వెళ్లింది.. షోతో రీఎంట్రీ

అల్లరి నరేష్ నటించిన 'సుడిగాడు' అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది గ్లామరస్ బ్యూటీ మోనాల్ గజ్జర్. ఆ వెంటనే తెలుగులో మరో రెండు మూడు సినిమాల్లో నటించిన ఈ అమ్మడు.. గుర్తింపు దక్కించుకోవడంలో విఫలం అయింది. ఈ కారణంగానే ఆ తర్వాత టాలీవుడ్‌కు దూరమైంది. ఇలాంటి పరిస్థితుల్లో సుదీర్ఘ విరామం తర్వాత బిగ్ బాస్ ద్వారా తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది.

 ట్రైయాంగిల్ లవ్‌తో పాపులర్... చెడ్డ పేరు

ట్రైయాంగిల్ లవ్‌తో పాపులర్... చెడ్డ పేరు

నాలుగో సీజన్ కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది మోనాల్. ఆరంభంలో తోటి కంటెస్టెంట్ అభిజీత్‌కు బాగా దగ్గరైందామె. దీంతో వీళ్లిద్దరూ ప్రేమాయణం సాగిస్తారని అంతా అనుకున్నారు. సరిగ్గా అప్పుడే అఖిల్ సార్థక్‌తోనూ చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. దీంతో వీళ్ల మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తున్నట్లు చూపించారు. దీనివల్ల ఆమెకు చెడ్డ పేరు కూడా వచ్చింది.

 అఖిల్ సార్థక్‌తో ప్రేమాయణం... రొమాన్స్

అఖిల్ సార్థక్‌తో ప్రేమాయణం... రొమాన్స్

బిగ్ బాస్ హౌస్‌లో అఖిల్ సార్థక్‌తోనే ఎక్కువగా సమయాన్ని గడుపుతూ ఉండేది మోనాల్ గజ్జర్. అప్పుడే అతడి మీద ప్రేమ ఉన్నట్లు అందరూ ఊహించుకున్నారు. అందుకు అనుగుణంగానే తరచూ వీళ్లిద్దరూ రచ్చ రచ్చ చేసేశారు. ఎప్పుడూ కలిసే ఉండడం, కలిసి మాట్లాడుకోవడం వంటి వాటితో పాటు ముద్దులిచ్చుకోవడం.. హగ్గులు చేసుకోవడం వంటివి చేసి హైలైట్ అయ్యారు.

 ఇండస్ట్రీలో హల్‌చల్.. వరుస ఆఫర్లతో బిజీ

ఇండస్ట్రీలో హల్‌చల్.. వరుస ఆఫర్లతో బిజీ

ఏమాత్రం అంచనాలు లేకుండా బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లిన మోనాల్ గజ్జర్.. ఊహించని విధంగా పద్నాలుగు వారాల పాటు షోలో కొనసాగింది. అయితే, ఫినాలేకు ముందు వారం బయటకు వెళ్లిపోయింది. షో తర్వాత అమ్మడు ఫుల్ బిజీ అయిపోయింది. ఇప్పటికే 'అల్లుడు అదుర్స్' సినిమాలో ఐటమ్ సాంగ్‌ చేయడంతో పాటు ఓంకార్ నిర్వహించే డ్యాన్స్‌ షోకు జడ్జ్‌గా చేస్తోంది.

ఎయిర్‌పోర్టులో మోనాల్‌కు ఊహించని షాక్

ఎయిర్‌పోర్టులో మోనాల్‌కు ఊహించని షాక్

బిగ్ బాస్ షో కోసం హైదరాబాద్ వచ్చిన మోనాల్.. చాలా గ్యాప్ తర్వాత అహ్మదాబాద్‌లోని నివాసానికి వెళ్లింది. అక్కడ కొద్ది రోజులు ఎంజాయ్ చేసిన తర్వాత నగరానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. 'హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో నన్ను చూసి అందరూ అఖిల్ ఎలా ఉన్నాడు అని అడుగుతున్నారు' అని ఓ విషయాన్ని బయట పెట్టింది.

అతడి పేరుతో కామెంట్స్ చేయడంతో క్లారిటీ

అతడి పేరుతో కామెంట్స్ చేయడంతో క్లారిటీ

అఖిల్ పేరుతో కామెంట్స్ చేయడంపై స్పందించిన మోనాల్ గజ్జర్ .. 'అప్పట్లో నన్ను ఎవరూ గుర్తు పట్టేవారు కాదు. కానీ, ఇప్పుడు మోనాల్ మోనాల్ అంటున్నారు. అయితే, అఖిల్ పేరు అడగడం మాత్రం నన్ను బాధిస్తోంది. వాస్తవానికి అతడు వాళ్ల ఇంట్లోనే ఉంటాడు. నాతో ఎందుకు వస్తాడు. కాబట్టి నన్ను ఇకపై అలా అడగొద్దని అందరినీ కోరుకుంటున్నా' అంటూ వివరించిందామె.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X