మోనాల్ ఫోన్‌లో అఖిల్ నెంబర్ అలా: సీక్రెట్ లీక్ చేసి బుక్కైన బ్యూటీ.. ఆ ఫొటో వెనుక అసలు కథ ఇదేనంటూ!

తెలుగులోకి వచ్చిన చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ ఆదరణను అందుకుని టాప్ షోగా మారిపోయింది బిగ్ బాస్. ఇప్పటికే మన దగ్గర ఏకంగా నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. అది కూడా భారీ స్థాయి రేటింగ్‌ను అందుకుంటూనే కావడం విశేషం. ఇక, ఈ షో ద్వారా ఎంతో మంది ఎనలేని క్రేజ్‌ను అందుకున్నారు. అందులో కొందరు మాత్రం జంటగా ఫేమస్ అయ్యారు. వారిలో అఖిల్ సార్థక్.. మోనాల్ గజ్జర్ జోడీ ఒకటి. బయట కూడా రచ్చ చేస్తోన్న వీళ్లిద్దరూ తరచూ వార్తల్లో నిలుస్తోన్నారు. ఈ క్రమంలోనే ఓ టాప్ సీక్రెట్ లీకైంది. ఆ వివరాలు మీకోసం!

ట్రైయాంగిల్ నుంచి చివరికిలా మారింది

ట్రైయాంగిల్ నుంచి చివరికిలా మారింది

బిగ్ బాస్ హౌస్‌లో ప్రేమకథలకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. వాటినే అక్కడ ఎక్కువగా హైలైట్ చేసి చూపిస్తుంటారు. ఇటీవల ముగిసిన నాలుగో సీజన్‌లో మోనాల్ గజ్జర్ - అభిజీత్ మధ్య ప్రేమాయణం సాగుతున్నట్లు అనిపించింది. అదే సమయంలో ఆమె అఖిల్‌తోనూ చనువుగా ఉండడంతో ట్రైయాంగిల్ లవ్ అని టాక్ వినిపించింది. కానీ, ఆ తర్వాత అఖినాల్ జోడీ అయ్యారు.

 ముద్దులు, హగ్గులతో రచ్చ చేసిన జోడీ

ముద్దులు, హగ్గులతో రచ్చ చేసిన జోడీ

అఖిల్ సార్థక్‌తో మోనాల్ గజ్జర్ ప్రేమాయణం సాగిస్తుందన్న వార్తలు అటు బిగ్ బాస్ హౌస్‌తో పాటు ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ అయిపోయాయి. అందుకు అనుగుణంగానే హౌస్‌లో వీళ్లిద్దరూ ఒకరి కోసం ఒకరు అన్నట్లు కనిపించేవారు. అదే సమయంలో ప్రేమను వ్యక్తపరిచేలా వ్యవహరించారు. అంతేకాదు, తరచూ ముద్దులు, హగ్గులు ఇస్తూ హౌస్‌లోనే రచ్చ చేసేవారు.

 బిగ్ బాస్ వల్ల అతడిలా.. ఆమెకు అలా

బిగ్ బాస్ వల్ల అతడిలా.. ఆమెకు అలా

బిగ్ బాస్ షో పుణ్యమా అని అఖిల్ సార్థక్.. మోనాల్ గజ్జర్ జోడీ ఎనలేని క్రేజ్‌ను అందుకున్నారు. అదే సమయంలో వీళ్లిద్దరూ ఆట పరంగానూ సత్తా చాటారు. దీంతో రెమ్యూనరేషన్ కూడా భారీగానే అందుకున్నారు. అంతేకాదు, సినిమా, షోలు, వెబ్ సిరీస్‌లలో అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. మోనాల్ వరుస షూట్లతో బిజీగా ఉంటే అఖిల్ సన్నద్ధం అవుతున్నాడు.

 ఎప్పుడూ జంటగానే.. హల్‌చల్ చేస్తూనే

ఎప్పుడూ జంటగానే.. హల్‌చల్ చేస్తూనే

బిగ్ బాస్ హౌస్‌లో దాదాపు వంద రోజుల పాటు జంటగా హల్‌చల్ చేసిన మోనాల్ గజ్జర్.. అఖిల్ సార్థక్.. బయటకు వచ్చిన తర్వాత కూడా అదే తీరుదతో వార్తల్లో నిలుస్తున్నారు. తరచూ కలవడం.. జంటగా పార్టీలు చేసుకోవడం.. ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తపరచుకోవడం వంటి వాటితో నిత్యం హాట్ టాపిక్ అవుతున్నారు. దీంతో ఈ జంట బయట కూడా ట్రెండింగ్ అవుతోంది.

ప్రేమికుల రోజున కలుస్తున్నట్లు చెప్పారు

ప్రేమికుల రోజున కలుస్తున్నట్లు చెప్పారు

ప్రేమికుల రోజును పురస్కరించుకుని అఖిల్ సార్థక్‌తో చేస్తున్న వెబ్ సిరీస్‌ను ప్రకటించింది మోనాల్ గజ్జర్. 'తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి' అనే టైటిల్‌తో వస్తున్న దీన్ని సరస్వతి క్రియేషన్స్ బ్యానర్‌పై భాస్కర్ బంతుపల్లి తెరకెక్కిస్తున్నారు. ఈ విషయాన్ని ఈ ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అంతేకాదు, ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

మోనాల్ ఫోన్‌లో అఖిల్ సీక్రెట్ బయటకు

మోనాల్ ఫోన్‌లో అఖిల్ సీక్రెట్ బయటకు

మోనాల్ గజ్జర్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించింది. ఇందులో ఓ నెటిజన్ 'మీ ఫోన్‌లో అఖిల్ నెంబర్ ఎలా సేవ్ చేశారో చూపించండి' అని అడిగాడు. దీనికి ఆమె వెంటనే దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ షేర్ చేసింది. అందులో 'అఖిల్ మేరా దోస్త్ హైదరాబాద్' అని ఉంది.

ఆ ఫొటో వెనుక అసలు కథ ఇదేనంటూ!

ఆ ఫొటో వెనుక అసలు కథ ఇదేనంటూ!

ఇదే సెషన్‌లో అఖిల్ రిలేషన్ గురించి కూడా చాలా విషయాలు వెల్లడించింది మోనాల్. 'అతను నా క్లోజ్ ఫ్రెండ్. ఎంతో జెన్యూన్ పర్సన్. నా పట్ల కేరింగ్‌గా ఉంటాడు. ఈ రిలేషన్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి అని కోరుకుంటున్నా' అని చెప్పుకొచ్చింది. ఇక, అఖిల్ వెనుక నిల్చుని దిగిన ఓ ఫొటోను షేర్ చేసిన మోనాల్ గజ్జర్.. 'ఇదే నాకెప్పటికీ ఇష్టమైన ఫొటో' అని వెల్లడించిందామె.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X