మోనాల్‌తో పర్సనల్ సీక్రెట్ లీక్ చేసిన అఖిల్: ఆ బట్టల్లో చాలా హాట్‌గా.. ఊహించని విధంగా కామెంట్స్!
బిగ్ బాస్ షో వల్ల ఎంతో మంది ఊహించని రీతిలో పాపులారిటీని సొంతం చేసుకున్నారు. వీరిలో చాలా మంది ఒంటరిగానే స్టార్‌డమ్‌ను అందుకోగా.. మరికొందరు మాత్రం జంటలుగా ఫేమస్ అయ్యారు. అలాంటి వారిలో నాలుగో సీజన్ కంటెస్టెంట్లు మోనాల్ గజ్జర్.. అఖిల్ సార్థక్ జంట ఒకటి. ఒకరికొకరు ఏమాత్రం సంబంధం లేకుండానే హౌస్‌లోకి ప్రవేశించిన ఈ ఇద్దరూ లవ్ ట్రాకు నడుపుతూ హాట్ టాపిక్ అయ్యారు. బయటకు వచ్చిన తర్వాత కూడా రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మోనాల్ పర్సనల్ సీక్రెట్ లీక్ చేశాడు అఖిల్. ఆ వివరాలు మీకోసం!
Recommended Video

ట్రయాంగిల్ నుంచి లవ్ ట్రాక్ మొదలు
సీజన్ ఆరంభంలో మోనాల్ గజ్జర్ యంగ్ హీరో అభిజీత్‌తో సన్నిహితంగా ఉండేది. అలా అతడితో కలిసి కనిపించింది. అదే సమయంలో అఖిల్ సార్థక్‌తోనూ సన్నిహితంగా ఉండేది. దీంతో వీళ్ల మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుందన్న ప్రచారం జరిగింది. ఇలాంటి సమయంలో ఆమె అభిజీత్‌కు దూరమై.. అఖిల్ సార్థక్‌కు బాగా దగ్గరైంది. అప్పటి నుంచి వీళ్లిద్దరి మధ్య ట్రాక్ మొదలైంది.

ఒకరి కోసం ఒకరు... ఎప్పుడూ కలిసే
బిగ్ బాస్ హౌస్‌లోకి ఎవరి టాలెంట్‌ను బట్టి వాళ్లు ఎంట్రీ ఇస్తుంటారు. అలాగే.. మోనాల్ గజ్జర్, అఖిల్ సార్థక్ కూడా ఈ అవకాశాన్ని అందుకున్నారు. అయితే, హౌస్‌లో ఒంటరిగా ఆడకుండా ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా వ్యవహరించేవారు. టాస్కుల్లో సహాయం చేసుకోవడం, నామినేషన్స్‌లో త్యాగాలు చేయడం వంటివి చేసి హాట్ టాపిక్ అయ్యారు. ఈ క్రమంలోనే ఎప్పుడూ కలిసే ఉండేవారు.

ప్రేమాయణంతో ఫేమస్... రొమాన్స్‌తో
బిగ్ బాస్ హౌస్‌లో వ్యవహరిస్తున్న తీరును బట్టి అఖిల్ సార్థక్ - మోనాల్ గజ్జర్ మధ్య ప్రేమాయణం సాగుతుందన్న ప్రచారం మొదలైంది. అప్పటి నుంచి వీళ్లు మరింతగా హల్‌చల్ చేశారు. ఈ క్రమంలోనే హగ్గులిచ్చుకోవడం, ముద్దులు పెట్టుకోవడం వంటివి చేస్తూ హైలైట్ అయ్యారు. అలాగే, రొమాంటిక్‌గా మాట్లాడుకుంటూ.. ఒకరి కోసం ఒకరు బాధ పడుతూ వచ్చారు.

బయటకు వచ్చాక కూడా హాట్ టాపిక్
బిగ్ బాస్ హౌస్‌లో కలిసే ఉన్న చేసిన అఖిల్ సార్థక్.. మోనాల్ గజ్జర్ విపరీతమైన క్రేజ్‌ను అందుకున్నారు. అదే కంటిన్యూ చేస్తూ బయట కూడా రచ్చ రచ్చ చేస్తున్నారు. షో అయిపోయిన వెంటనే అఖిల్ ఇంటికి వెళ్లి సర్‌ప్రైజ్ చేసింది మోనాల్. దానికి సంబంధించిన ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. ఆ తర్వాత వీళ్లిద్దరూ ఓ పార్టీకి వెళ్లారు. అలాగే న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ చేసుకున్నారు.

మోనాల్ పర్సనల్ సీక్రెట్ లీక్ చేసిన అఖిల్
బిగ్ బాస్ షో పూర్తయిన తర్వాత కూడా అఖిల్ సార్థక్ - మోనాల్ గజ్జర్ ఒకరిపై ఒకరు తమపై ప్రేమను ఏదో రకంగా వ్యక్త పరుస్తూనే ఉన్నారు. పలు ఇంటర్వ్యూల్లో ఎన్నో రకాల కామెంట్లు చేస్తూ తమ బంధాన్ని బయట పెట్టుకున్నారు. ఇందులో భాగంగానే తరచూ కలుస్తున్న ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ పర్సనల్ సీక్రెట్ లీక్ చేశాడు అఖిల్.

ఆ బట్టల్లో చాలా హాట్‌గా.. ఊహించని విధంగా
తాజాగా అఖిల్ సార్థక్‌కు మోనాల్ గజ్జర్ ఓ ఎరుపు రంగు షర్ట్‌ను గిఫ్టుగా పంపిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా రివీల్ చేశాడు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా తెలిపిన అతడు.. 'ఈ షర్ట్‌లో చాలా హాట్‌గా ఉన్నా కదా.. చాలా థ్యాంక్స్ మోనాల్' అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో వీళ్లిద్దరి మధ్య ఉన్న బంధం మరోసారి బటయ పడడంతో ఇరువురి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











