మోనాల్ గజ్జర్ సంచలన నిర్ణయం: లవర్ మోసం చేయడంతో వెళ్లిపోయింది.. ఇప్పుడేమో ఇలా!

చాలా ఏళ్ల క్రితం తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయం అయింది గుజరాతీ బ్యూటీ మోనాల్ గజ్జర్. ఆ సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా.. ఆమెను మాత్రం ఎవరూ గుర్తించలేదు. దీంతో అమ్మడు టాలీవుడ్‌ను వదిలేసి వెళ్లిపోయింది. సుదీర్ఘ విరామం తర్వాత బిగ్ బాస్ షో ద్వారా మరోసారి ఇక్కడ అడుగు పెట్టింది. అంతేకాదు, ఇప్పుడు భారీ స్థాయిలో పాపులారిటీ సంపాదించింది. అంతేకాదు, ఆఫర్లను అందుకుంటోంది. అలాగే, ప్రేమాయణమూ సాగిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మోనాల్ గజ్జర్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం పదండి!

బిగ్ బాస్‌లోకి ఎంట్రీ.. ట్రాకులతో పేరొచ్చింది

బిగ్ బాస్‌లోకి ఎంట్రీ.. ట్రాకులతో పేరొచ్చింది

బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో మొదటి కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగు పెట్టింది మోనాల్ గజ్జర్. అప్పటి నుంచే అందరితో మంచిగా మెలుగుతూ వచ్చింది. ఆ క్రమంలోనే అభిజీత్‌కు బాగా దగ్గరైంది. కొన్నాళ్ల పాటు అతడితో ట్రావెల్ చేసిన తర్వాత.. మరో కంటెస్టెంట్ అఖిల్ సార్థక్‌తో క్లోజ్ అయింది. ఒకేసారి ఇద్దరితో ట్రాక్స్ నడుపుతున్నట్లు చూపించడంతో ట్రైయాంగిల్ లవ్‌గా ఇది కనిపించింది.

 నాగార్జునతో చెప్పి.. తర్వాత రెచ్చిపోయింది

నాగార్జునతో చెప్పి.. తర్వాత రెచ్చిపోయింది


రోజులు గడిచిన కొద్దీ మోనాల్ గజ్జర్ బిగ్ బాస్ హౌస్‌లో అఖిల్ సార్థక్‌తో ప్రేమలో పడిపోయింది. నాగార్జున ముందే తన మనసులో A ఉన్నాడని చెప్పి షాకిచ్చింది. అప్పటి నుంచి అతడితోనే ఉంటూ అతడి కోసమే ఆడుతూ హైలైట్ అయింది. అలాగే, నామినేషన్స్ నుంచీ కాపాడుతూ వచ్చింది. అదే సమయంలో హగ్గులు, ముద్దులతో రెచ్చిపోయింది. దీంతో ఆమె బాగా పాపులర్ అయిపోయింది.

ఫినాలేకు ముందు భారీ షాకిచ్చిన ప్రేక్షకులు

ఫినాలేకు ముందు భారీ షాకిచ్చిన ప్రేక్షకులు

పలుమార్లు నామినేషన్స్‌లో ఉన్న సేఫ్ అవుతూ వచ్చింది మోనాల్ గజ్జర్. దీంతో మంచి మంచి కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. ఆ సమయంలో బిగ్ బాస్‌పై విమర్శలు కూడా చెలరేగాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఫినాలేకు ఒక వారం ముందు ఆమె ఎలిమినేట్ అయింది. బయటకు వచ్చిన తర్వాత వరుసగా ఆఫర్లు అందుకుంటూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోందీ గుజరాతీ భామ.

మోనాల్ రేంజ్ మారింది.. అందుకే వరుసగా

మోనాల్ రేంజ్ మారింది.. అందుకే వరుసగా


బిగ్ బాస్ వల్ల వచ్చిన క్రేజ్‌తో మోనాల్ గజ్జర్ స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న ‘డ్యాన్స్+' అనే షోకు జడ్జ్‌గా ఎంపికైంది. ఓంకార్ హోస్టింగ్ చేస్తున్న ఈ షో ఇప్పటికే ప్రారంభం అయింది. దీని తర్వాత ఆమె.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కిస్తోన్న ‘అల్లుడు అదుర్స్'లో ఐటమ్ సాంగ్ చేస్తోంది. ఈ విషయాన్ని ఇటీవలే మీడియా సమావేశంలో వెల్లడించారు.

సంచలన నిర్ణయం తీసుకున్న మోనాల్ గజ్జర్

సంచలన నిర్ణయం తీసుకున్న మోనాల్ గజ్జర్


బిగ్ బాస్ తర్వాత వరుసగా ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతోన్న మోనాల్ గజ్జర్.. ప్రస్తుతం సొంత ఊరిలో ఉంది. రెండు రోజుల క్రితమే ఆమె అహ్మదాబాద్ వెళ్లిపోయింది. ఆ ప్రయాణానికి సంబంధించిన విశేషాలను కూడా ఫ్యాన్స్‌తో పంచుకుంది. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా ప్రేమ విషయంలో మోనాల్ సంచలన నిర్ణయం తీసుకుందట. అందుకే ఇప్పుడు ఇంటికెళ్లిందని టాక్.

మోసం చేయడం వెళ్లిపోయింది.. ఇప్పుడేమో

మోసం చేయడం వెళ్లిపోయింది.. ఇప్పుడేమో

గతంలో మలయాళ పరిశ్రకు చెందిన ఓ వ్యక్తిని ప్రేమించిన మోనాల్ గజ్జర్.. అతడు మోసం చేయడంతో దక్షిణాదిని వదిలేసింది. చాలా కాలం తర్వాత ఇప్పుడు ఆమె హైదరాబాద్ షిఫ్ట్ అవుతుందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. దాని కోసమే ఇప్పుడు గుజరాత్ వెళ్లిందని సమాచారం. ఆమె ఇక్కడికి వచ్చేది ఆఫర్ల కోసం కాదు.. అఖిల్ కోసమని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X