ఆ కంటెస్టెంట్‌తో ఎందుకంత క్లోజ్‌గా ఉంటున్నావ్: మోనాల్‌పై నిందలు వేసిన అఖిల్ సార్థక్
బిగ్ బాస్ హౌస్‌లో లవ్ ట్రాకులు ఎంతగా పాపులర్ అవుతుంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్ని భాషల్లోలానే తెలుగులోనూ ప్రేమ కహానీలు కనిపిస్తూనే ఉన్నాయి. మొదటి సీజన్ నుంచి ప్రస్తుతం ప్రసారం అవుతోన్న నాలుగో సీజన్ వరకు ప్రతి దానిలో కొన్ని జంటలు హైలైట్ అయ్యాయి.. అవుతున్నాయి. వీటిలో అఖిల్ సార్థక్ - మోనాల్ గజ్జర్ జోడీ ఒకటి. ఈ సీజన్‌లో తరచూ వార్తల్లో నిలుస్తోన్న ఈ జంట మధ్య తాజాగా సీరియస్ డిస్కర్షన్ జరిగింది. అంతేకాదు, మోనాల్‌పై అఖిల్ నిందలు వేశాడు. దీంతో ఆమె సిగ్గుతో తలదించుకుంది. ఆ వివరాలు మీకోసం!
Recommended Video

మూడు జంటలు.. వీళ్లే బాగా ఫేమస్
ఎప్పటి లాగే బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోనూ ప్రేమ జంటలు హల్‌చల్ చేస్తున్నాయి. గతంలో ఒకటి రెండు జోడీలే ఉంటే.. ఈ సారి ఏకంగా మూడు జంటలు ఉన్నాయి. అందులో అభిజీత్ - దేత్తడి హారిక జోడీ, ఆరియానా గ్లోరీ - అవినాష్ జంట, అఖిల్ సార్థక్ - మోనాల్ గజ్జర్ పెయిర్లు ఉన్నాయి. వీళ్లలో చివరి జోడీనే తరచూ వార్తల్లో నిలవడం ద్వారా బాగా ఫేమస్ అవుతోంది.

మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ అంటూ ట్రోల్స్
మోనాల్ గజ్జర్‌పై అఖిల్ సార్థక్ ఎంత ప్రేమను చూపిస్తున్నాడో మొదటి నుంచీ చూస్తూనే ఉన్నాం. ఆమె ఆటను కూడా మనోడే ఆడడం, ఆమెను ఎవరైనా ఏమైనా అంటే అంతెత్తున లేవడం, ఎదుటి వారు ఎవరైనా గొడవలకు దిగడం వంటివి చేసి మోనాల్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ అనిపించుకున్నాడు. అలాగే, హగ్గులు, ముద్దులు ఇచ్చుకోవడంతో ట్రోల్స్‌కు గురయ్యారు.

మారిన గేమ్.. ఇద్దరికీ పెరిగిన దూరం
బిగ్ బాస్ నాలుగో సీజన్ చివరి దశకు చేరుకోవడంతో హౌస్‌లోని కంటెస్టెంట్లు అందరూ స్వతహాగా ఆడాలని ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే మోనాల్ తన గేమ్ తాను ఆడుతోంది. ఈ క్రమంలోనే అఖిల్ సార్థక్‌ను సైతం నామినేట్ చేసింది. అతడు కూడా ఆమెను చేశాడు. దీంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. రెండు వారాలుగా వీళ్లిద్దరూ పెద్దగా కలిసి కనిపించడం లేదు.

మోనాల్‌పై నిందలు వేసిన అఖిల్ సార్థక్
శనివారం జరిగిన ఎపిసోడ్ ప్రారంభంలో మోనాల్ గజ్జర్ - అఖిల్ సార్థక్ మధ్య సీరియస్ డిస్కర్షన్ జరిగింది. ఈ సమయంలో ఇద్దరూ ఒకరిని ఒకరు ఆట పట్టిస్తూ నిజాలు మాట్లాడుకున్నట్లు అనిపించింది. ముందుగా అఖిల్‌ను ‘మీరు చాలా మారిపోయారు' అంటూ మోనాల్ సిగ్గు పడిపోయింది. దీనికి ‘నీ వల్లే ఇలా అయిపోయాను' అంటూ ఆమెపై నింద వేశాడాతను.

తనతో ఎందుకంత క్లోజ్‌గా ఉంటున్నావ్
ఈ డిస్కర్షన్ జరుగుతోన్న సమయంలోనే మోనాల్ ‘మీరు హారికతో చాలా క్లోజ్ అయ్యారెందుకు. అడిగి మరీ హగ్గులు తీసుకుంటున్నారు. ఏంటి కథా' అంటూ ప్రశ్నించింది. దీనిపై స్పందించిన అఖిల్ ‘హారికతో నేను ఎప్పుడూ ఒకేలా ఉన్నా. ఎప్పటి నుంచో ఆమె నాతో క్లోజ్‌గా ఉంటుంది. ఇప్పుడెందుకు ఇలా అడుగుతున్నావు' అంటూ బదులిచ్చాడు. దీంతో ఆమె సైలెంట్ అయిపోయింది.

అప్పట్లో అభిజీత్‌ను కూడా అదే తరహాలో
సీజన్ ఆరంభంలో అభిజీత్‌తో క్లోజ్‌గా ఉన్న సమయంలోనూ మోనాల్ గజ్జర్ ఇదే తరహాలో ప్రవర్తించేది. ఒకానొక సందర్భంలో ‘అభి.. మీరు హారికతో ఎందుకంత క్లోజ్‌గా ఉంటున్నారు. ఆమెకు మీరంటే చాలా ఇష్టం. ఎప్పుడూ మీతోనే ఉండాలని, మాట్లాడాలని అనుకుంటుంది' అని చెప్పింది. దానికి అభిజీత్ ‘ఏమో నాకా విషయం తెలియదు' అని సులభంగా బదులిచ్చాడు.


Click it and Unblock the Notifications











