బిగ్ బాస్ హౌస్‌లో కొత్త కహానీ: దేత్తడి హారిక సీక్రెట్ లవ్‌ను లీక్ చేసిన మోనాల్!
తెలుగు బుల్లితెరపై అత్యంత భారీ స్థాయిలో ప్రేక్షకాదరణను పొందతూ.. సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోతోన్న షో బిగ్ బాస్. వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరొందిన దీనికి అన్ని భాషల్లాగే తెలుగులోనూ మంచి స్పందన వస్తోంది. అందుకే ఈ షో ఇప్పటికే మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకోగలిగింది. ఇక, ఇటీవలే నాలుగో సీజన్‌ను సైతం మొదలైది. ఇందులో ఫస్ట్ డే నుంచే ప్రేమ కథలు పుట్టుకొచ్చాయి. దీంతో ఇవి చూపిస్తూ నెట్టుకొస్తోంది బిగ్ బాస్ యూనిట్. ఈ నేపథ్యంలో హౌస్‌లో మరో కొత్త ప్రేమ కహానీ బయటకు వచ్చింది. పూర్తి వివరాలు మీకోసం.!
Recommended Video

అప్పుడే చెప్పేసిన బిగ్ బాస్ యూనిట్
నాలుగో సీజన్ ప్రారంభానికి ముందే ఈ సారి ఎలాంటి ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందో బిగ్ బాస్ యూనిట్ టీజర్ ద్వారా తెలిపింది. వందకు వంద శాతం వినోదం కోసం ఇందులో లవర్స్.. కిస్సులు వగైరా అంశాలను హైలైట్ చేసింది. మరీ ముఖ్యంగా లవ్ ట్రాకులకు సంబంధించిన గాసిప్పులు నడుస్తాయని చెప్పకనే చెప్పింది. దీంతో ఈ సీజన్‌పై అందరిలోనూ ఆసక్తి కనిపించింది.

స్టేజ్ మీదే మొదలు పెట్టిన నాగార్జున
ఈ సీజన్‌లో కావాలనే లవ్ ట్రాక్‌లను హైలైట్ చేయబోతున్నారన్న విషయం షో ప్రారంభం రోజే అర్థం అయింది. ప్రీమియర్ ఎపిసోడ్‌లో భాగంగా హోస్ట్ నాగార్జున... కంటెస్టెంట్ అభిజీత్‌తో హీరోయిన్ల ఫొటోలు చూపిస్తూ ఆడిన ఓ ఆట అందుకు భీజం పోసినట్లు అనిపించింది. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్‌లో అభిజీత్ అందుకు అనుగుణంగానే వ్యవహరిస్తూ హాట్ టాపిక్ అవుతున్నాడు.

వాళ్లిద్దరికీ సెట్టైనట్లే... సినిమా సీన్‌లా
రోజులు గడుస్తున్న కొద్దీ బిగ్ బాస్ హౌస్‌లో అభిజీత్ - మోనాల్ గజ్జర్ మధ్య ప్రేమాయణం సాగుతున్నట్లు చూపిస్తున్నాడు బిగ్ బాస్. అందుకు అనుగుణంగానే వాళ్లిద్దరూ వ్యవహరిస్తున్నారు. తరచూ మాట్లాడుకుంటుండడం.. రొమాంటిక్‌గా సైగలు చేసుకోవడం.. అన్నం తినిపించుకోవడం.. హగ్గులు చేసుకోవడం.. ఒకరిపై ఒకరు పడిపోవడం వంటివి దీనికి బలం చేకూర్చుతోంది.

ట్రైయాంగిల్ లవ్ స్టోరీ ప్లాన్ చేశాడుగా
ఇదే హౌస్‌లో ఉన్న మరో కంటెస్టెంట్ అఖిల్ సార్థక్‌తోనూ మోనాల్ చనువుగా ఉంటోంది. దీంతో అభిజీత్‌తో ఆమె దూరమైనట్లు... అతడికి దగ్గరైనట్లు కన్వే అవుతోంది. దీన్ని హైలైట్ చేస్తూ బిగ్ బాస్ యూనిట్ ప్రత్యేకమైన ప్రోమోలు కూడా క్రియేట్ చేస్తోంది. అంతేకాదు, లవ్ ట్రాక్ ట్రైయాంగిల్ అవుతుందా అన్న క్యాప్షన్ కూడా ఇచ్చింది. దీంతో షోపై ఆసక్తిని పెంచే ప్రయత్నం చేస్తోంది.

నిజంగానే ప్రేమ ఉందా.? ఇదే డౌట్
లవ్ ట్రాకుల వల్ల బిగ్ బాస్ షో రోజురోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. ఆ ముగ్గురు నడుచుకుంటున్న తీరుతో పాటు హౌస్‌మేట్స్ వ్యవహరిస్తున్న శైలితో సరికొత్త సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే షోను ఫాలో అయ్యే వారంతా అభిజీత్ - మోనాల్ మధ్య ప్రేమ ఉందా అని సందేహపడుతున్నారు. ఇక, అఖిల్ ఎంటర్ అవడంతో అయోమయానికి గురవుతున్నారు.

బిగ్ బాస్ హౌస్‌లో మరో కొత్త కహానీ
అభిజీత్ - మోనాల్ గజ్జర్ - అఖిల్ సార్థక్ ట్రైయాంగిల్ లవ్ స్టోరీతో బిగ్ బాస్ షోపై మిశ్రమ స్పందన వస్తోంది. దీంతో ఈ ప్రేమ కథ ఎక్కడి వరకు వెళ్తుందోనని అందరిలోనూ పలు రకాల సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ బాస్ హౌస్‌లో మరో కొత్త లవ్ కహానీ బయటకు వచ్చింది. అది కూడా లవర్ బాయ్ అభిజీత్‌కు సంబంధించినదే కావడం విశేషం.

హారిక సీక్రెట్ లవ్‌ను లీక్ చేసిన మోనాల్
బుధవారం జరిగిన ఎపిసోడ్‌లో అభిజీత్ - మోనాల్ మధ్య చాలా సేపు సంభాషణ జరిగింది. ఇందులో తమ విషయాలతో పాటు ఇతరులకు సంబంధించిన వ్యవహారాలను చర్చించారు. మరీ ముఖ్యంగా దేత్తడి హారిక గురించి మోనాల్ ఓ సీక్రెట్ లీక్ చేసింది. ‘ఆమె నిన్ను బాగా ఇష్టపడుతోంది. ఆ విషయం చాలా మందికి తెలుసు' అంటూ అభిజీత్‌తో చెప్పడంతో అతడు షాక్ అయ్యాడు.


Click it and Unblock the Notifications











