అవి చూపిస్తేనే అమ్మాయి అని నమ్ముతారేమో.. అఖిల్ వల్లే ఈ మార్పులు: మోనాల్ షాకింగ్ కామెంట్స్

స్టార్ హీరోయిన్ అవ్వాలనే లక్ష్యంతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది గుజరాతీ బ్యూటీ మోనాల్ గజ్జర్. అందుకు అనుగుణంగానే మొదటి సినిమానే సూపర్ హిట్ అవడంతో ఆమె రేంజ్ పెరుగుతుందని అంతా అనుకున్నారు. కానీ, దానికి భిన్నంగా ఆమె మరో రెండు చిత్రాలు మాత్రమే చేసి టాలీవుడ్‌కు టాటా చెప్పింది. ఇక, సుదీర్ఘ విరామం తర్వాత బిగ్ బాస్ ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అఖిల్ సార్థక్‌తో ప్రేమాయణంతో మరింత హైలైట్ అయింది. ఈ నేపథ్యంలో తన బాడీ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది మోనాల్. ఆ వివరాలు మీకోసం!

ఇద్దరితో చనువుగా.. చివరికి అతడితోనే

ఇద్దరితో చనువుగా.. చివరికి అతడితోనే

బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలోనే యంగ్ హీరో అభిజీత్‌తో ప్రేమాయణం సాగిస్తోందన్న వార్తలతో హాట్ టాపిక్ అయింది మోనాల్ గజ్జర్. అతడితోనే ఎక్కువగా చనువుగా ఉంటూ అనుమానాలకు మరింత బలాన్నిచ్చింది. అదే సమయంలో అఖిల్ సార్థక్‌తోనూ క్లోజ్‌గా ఉండడంతో వీళ్ల ముగ్గురి మధ్య ట్రైయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తున్నట్లు అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది.

రెచ్చిపోయిన మోనాల్... హగ్స్.. కిస్సెస్‌

రెచ్చిపోయిన మోనాల్... హగ్స్.. కిస్సెస్‌

క్రమ క్రమంగా అభిజీత్‌కు దూరమైన మోనాల్ గజ్జర్.. అఖిల్ సార్థక్‌తో మరింత దగ్గరైంది. దీంతో వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అదే సమయంలో వీళ్లిద్దరూ మరింత రెచ్చిపోయి రొమాన్స్ చేసేవారు. తరచూ హగ్గులిచ్చుకోవడం.. ముద్దులు పెట్టుకోవడం.. కొంటెగా చూసుకోవడం.. మాట్లాడుకోవడం వంటి వాటితో తరచూ వార్తల్లో నిలుస్తూ వచ్చిందీ జంట.

రెమ్యూనరేషన్‌తో పాటు ఆఫర్లూ బాగానే

రెమ్యూనరేషన్‌తో పాటు ఆఫర్లూ బాగానే

ఏమాత్రం అంచనాలు లేకుండానే బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మోనాల్ గజ్జర్.. పద్నాలుగు వారాల పాటు షోలో కొనసాగింది. దీని ద్వారా రూ. 50 లక్షలు పైగానే సంపాదించింది. ఈ షో వల్ల క్రేజ్‌ను కూడా భారీగానే అందుకున్న ఈ అమ్మడు.. వరుసగా ఆఫర్లు అందుకుంటోంది. 'డ్యాన్స్+' అనే షోకు జడ్జ్‌గా ఎంపికవడంతో పాటు 'అల్లుడు అదుర్స్'లో ఐటమ్ సాంగ్ కూడా చేసింది.

బయట కూడా కలిసే.. తరచూ మీటింగ్స్

బయట కూడా కలిసే.. తరచూ మీటింగ్స్


బిగ్ బాస్ హౌస్‌లో జంటగా హల్‌చల్ చేసిన మోనాల్ గజ్జర్.. అఖిల్ సార్థక్.. బయటకు వచ్చిన తర్వాత కూడా రచ్చ రచ్చ చేస్తూనే ఉంది. తరచూ కలిసి తిరగడం.. పార్టీలు చేసుకోవడం వంటివి చేస్తుండేది. అదే సమయంలో సోషల్ మీడియా చాట్ల ద్వారా.. ఇంటర్వ్యూల ద్వారా ఒకరిపై ఒకరు తమ ప్రేమను వ్యక్త పరచుకుంటున్నారు. దీంతో ఎప్పుడూ ట్రెండ్ అవుతూనే ఉన్నారు.

మోనాల్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన అఖిల్

మోనాల్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన అఖిల్

బిగ్ బాస్ ఉత్సవంలో కంటెస్టెంట్లు అందరూ నచ్చిన వాళ్లకు కానుకలు తీసుకు వచ్చారు. ఇందులో అఖిల్ సార్థక్.. సయ్యద్ సోహెల్ రియాన్‌కు షూ ఇచ్చాడు. ఆ తర్వాత మోనాల్ గజ్జర్‌కు పట్టీలను తీసుకొచ్చాడు. అంతేకాదు, తాను మోకాళ్లపై కూర్చుని ఆమెకు స్వయంగా అలంకరించాడు. ఆ తర్వాత అతడు మాట్లాడుతూ.. 'మోనాల్ ఎక్కడికి వెళ్లినా ఇవే చూస్తారు' అన్నాడు.

అవి చూపిస్తేనే నమ్ముతారనుకుంటాను

అవి చూపిస్తేనే నమ్ముతారనుకుంటాను

అఖిల్ ఇచ్చిన గిఫ్ట్ గురించి మాట్లాడుతూ.. 'నేను చిన్నప్పటి నుంచి ముక్కుపుడక, పట్టీలు, గాజులు లాంటివి వేసుకునే దాన్ని కాదు. దీంతో అందరూ నేను అబ్బాయిని అనుకునే వారు. కానీ, అఖిల్ ఇచ్చిన ఈ పట్టీలను చూసిన తర్వాత అయినా అందరూ నన్ను అమ్మాయినని నమ్ముతారని భావిస్తున్నా' అంటూ ఫన్నీగానే షాకింగ్ కామెంట్స్ చేసిందీ గుజరాతీ ముద్దుగుమ్మ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X