శ్రీరాముడిపై మోనాల్ గజ్జర్ అనుచిత వ్యాఖ్యలు: అందుకే అలాంటోడిని చేసుకోనంటూ షాకింగ్‌గా!

తెలుగులో ప్రసారం అవుతూ దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న షోలలో బిగ్ బాస్ పేరు ప్రధానంగా చెప్పుకోవచ్చు. అంతలా ఈ షో ఇండియన్ టెలివిజన్‌పై ప్రభావం చూపిస్తోంది. అన్ని భాషలతో పోలిస్తే ఇక్కడ ప్రసారం అయ్యే రియాలిటీ షోకే ఎక్కువ ఆదరణ లభిస్తోంది. అందుకే సక్సెస్‌ఫుల్‌గా నాలుగు సీజన్లు పూర్తి చేసుకుంది. అదే సమయంలో ఎంతో మందిని యమ పాపులర్ చేసిందీ షో. ఇలా ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకున్న వారిలో మోనాల్ గజ్జర్ ఒకరు. తాజాగా ఈమె శ్రీరాముడిపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ వివరాలు మీకోసం!

ఇద్దరితోనూ క్లోజ్.. అలా ఫేమస్ అయింది

ఇద్దరితోనూ క్లోజ్.. అలా ఫేమస్ అయింది

ఇటీవల జరిగిన బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది మోనాల్ గజ్జర్. షో ఆరంభంలో యంగ్ హీరో అభిజీత్‌తో చనువుగా ఉంటూ వచ్చిన ఆమె.. అదే సమయంలో మరో యంగ్‌స్టర్ అఖిల్ సార్థక్‌తోనూ క్లోజ్ అయింది. దీన్నే అదునుగా చేసుకున్న బిగ్ బాస్ నిర్వహకులు.. వీళ్ల మధ్య ట్రయాంగిల్ లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు చూపించారు. దీంతో ఆమె ఫేమస్ అయింది.

మనసులో ఉన్నోడిని బయటపెట్టి హైలైట్

మనసులో ఉన్నోడిని బయటపెట్టి హైలైట్

మోనాల్ గజ్జర్ ఇద్దరితోనూ క్లోజ్ ఉన్న సమయంలో ఆమె మనసులో ఎవరు ఉన్నారో ప్రేక్షకులతో పాటు హౌస్‌మేట్స్‌కు కూడా అర్థం కాలేదు. ఇలాంటి సమయంలో ఆమె అభిజీత్‌ను దూరం పెట్టి.. అఖిల్‌ సార్థక్‌కు బాగా దగ్గరైంది. సరిగ్గా అప్పుడే తన మనసులో A ఉన్నాడని చెప్పి ఏకంగా నాగార్జునకే చెప్పేసింది. దీంతో ఆమె ఎవరిని ప్రేమిస్తుందోనన్న దానిపై అందరికీ క్లారిటీ వచ్చేసింది.

బిగ్ బాస్‌లో రెచ్చిపోయి రొమాన్స్ చేసింది

బిగ్ బాస్‌లో రెచ్చిపోయి రొమాన్స్ చేసింది

ఆ తర్వాత మోనాల్ గజ్జర్.. అఖిల్ సార్థక్‌తో మరింత క్లోజ్ అయిపోయింది. అతడిపై ప్రేమను చూపిస్తూ తరచూ హైలైట్ అవుతూ వచ్చింది. అప్పటి నుంచి మరింత రెచ్చిపోయిన ఈ గుజరాతీ భామ.. అఖిల్‌కు ముద్దులు, హగ్గులు ఇస్తూ హాట్ టాపిక్ అయింది. ఆ సమయంలో ఆమెపై విమర్శలు కూడా వచ్చాయి. అయినప్పటికీ ఏమాత్రం తగ్గని ఈ బ్యూటీ మరింతగా తన ప్రేమను వ్యక్త పరిచేది.

భారీగా సంపాదించింది.. ఆఫర్లు పట్టేసింది

భారీగా సంపాదించింది.. ఆఫర్లు పట్టేసింది

బిగ్ బాస్ షో ద్వారా తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది మోనాల్ గజ్జర్. అదే సమయంలో ఈ షో వల్ల రూ. 50 లక్షల వరకూ సంపాదించిందని ప్రచారం జరుగుతోంది. దీనితో పాలు ఆఫర్లు కూడా అందుకుంటోంది. ఇప్పటికే 'అల్లుడు అదుర్స్' అనే సినిమాలో ఐటం సాంగ్ చేసిన ఈ అమ్మడు.. ఓంకార్ నిర్వహిస్తున్న 'డ్యాన్స్+' అనే షోలోనూ జడ్జ్‌గా వ్యవహరిస్తోంది.

శ్రీరాముడిపై మోనాల్ అనుచిత వ్యాఖ్యలు

శ్రీరాముడిపై మోనాల్ అనుచిత వ్యాఖ్యలు

బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మోనాల్ గజ్జర్ వరుస ఇంటర్వ్యూలతో ఫుల్ బిజీ అయిపోయింది. అలాగే, లైవ్ చాట్‌లు కూడా చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తనకు సంబంధించిన ఎన్నో విషయాలను వెల్లడిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా జరిగిన ఓ చిట్ చాట్ షోలో తన ఇష్ట దైవం గురించి మాట్లాడుతూ మోనాల్ గజ్జర్.. శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసింది.

Recommended Video

Vijay Devarakonda As Liger | బ్యాక్ గ్రౌండ్ లేకుండ ప్యాన్ ఇండియా రేంజ్ కి వచ్చానన్న విజయ్!!
అందుకే అలాంటోడిని చేసుకోనంటూ అలా

అందుకే అలాంటోడిని చేసుకోనంటూ అలా

ఈ ఇంటర్వ్యూలో యాంకర్ మీరు ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటారని మోనాల్ గజ్జర్‌ను అడిగాడు. దీనికి 'శ్రీక‌ృష్ణుడు లాంటి భర్త కావాలి' అని జవాబిచ్చింది. అప్పుడు అంతా రాముడు అంటే మీరు ఈ పేరు చెప్పారేంటి అని ప్రశ్నించాడు యాంకర్. దీనికి 'రాముడంటే నాకిష్టం ఉండదు. అంతేకాదు, ఎవరో చెప్పిన మాట విని భార్యను అనుమానించాడు. ఒకవేళ ఆయన నాకు కనిపిస్తే ఎందుకిలాంటి పని చేశావని ప్రశ్నిస్తా' అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X