అఖిల్ కోసం మోనాల్ భారీ త్యాగం: ఏకంగా అంత రిస్క్.. ఆమె సంచలన నిర్ణయానికి సినీ పెద్దలే షాక్
కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది గుజరాతీ బ్యూటీ మోనాల్ గజ్జర్. దీనికి కారణం బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొనడంతో పాటు అందులో ఆమె వ్యవహరించిన తీరే. అంతేకాదు, అఖిల్ సార్థక్‌తో ప్రేమాయణం సాగిస్తోందన్న వార్తల కారణంగానూ ఈ బ్యూటీ ఫుల్ పాపులర్ అయింది. హౌస్‌లో అతడిపై ప్రేమను చూపించిన ఈ భామ.. బయట కూడా అదే రీతిలో వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అఖిల్ సార్థక్ కోసం భారీ త్యాగం చేసిందట మోనాల్ గజ్జర్. అతడి కోసం ఏకంగా ఓ రిస్క్‌కు సిద్ధమైందని తెలుస్తోంది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

అలా ఎంట్రీ ఇచ్చింది... జంటగా ఫేమస్
తెలుగు సినీ ఇండస్ట్రీలో 'సుడిగాడు', 'బ్రదర్ ఆఫ్ బొమ్మాలి' అనే సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది మోనాల్ గజ్జర్. అయితే, అప్పుడామెకు అంతగా గుర్తింపు దక్కలేదు. దీంతో టాలీవుడ్‌కు టాటా చెప్పేసిన ఈ భామ.. బిగ్ బాస్ షో నాలుగో సీజన్ ద్వారా తెలుగులోకి సుదీర్ఘ విరామం తర్వాత రీఎంట్రీ ఇచ్చింది. ఆదిలోనే అఖిల్ సార్థక్‌తో కలిసి జంటగా ఫేమస్ అయిపోయింది.

హౌస్‌లో రొమాన్స్.. అన్నింట్లోనూ రచ్చ
మొదట అభిజీత్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన మోనాల్ గజ్జర్.. ఆ తర్వాత అఖిల్ సార్థక్ ప్రేమలో పడిపోయింది. అప్పటి నుంచి అతడితోనే ఉంటూ.. అతడి కోసమే ఆడుతూ హాట్ టాపిక్ అయింది. అంతేకాదు, తరచూ ప్రేమను వ్యక్తపరచుకోవడంతో పాటు పొగుడుకోవడం వంటివి చేసింది. అదే సమయంలో ముద్దులు, హగ్గులు ఇస్తూ వార్తల్లో నిలిచింది. తద్వారా ఆమె హైలైట్ అయింది.

బయటకు వచ్చాక కూడా అదే తీరుతో
బిగ్ బాస్ హౌస్‌లో దాదాపు వంద రోజుల పాటు జంటగా హల్‌చల్ చేసిన మోనాల్ గజ్జర్.. అఖిల్ సార్థక్.. బయటకు వచ్చిన తర్వాత కూడా అదే తీరుదతో వార్తల్లో నిలుస్తున్నారు. తరచూ కలవడం.. జంటగా పార్టీలు చేసుకోవడం.. ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తపరచుకోవడం వంటి వాటితో నిత్యం హాట్ టాపిక్ అవుతున్నారు. దీంతో ఈ జంట బయట కూడా ట్రెండింగ్ అవుతోంది.

జోడీ అయినట్లు ప్రకటించిన బీబీ కపుల్
ప్రేమికుల రోజును పురస్కరించుకుని అఖిల్ సార్థక్‌తో చేస్తున్న వెబ్ సిరీస్‌ను ప్రకటించింది మోనాల్ గజ్జర్. 'తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి' అనే టైటిల్‌తో వస్తున్న దీన్ని సరస్వతి క్రియేషన్స్ బ్యానర్‌పై భాస్కర్ బంతుపల్లి తెరకెక్కిస్తున్నారు. ఈ విషయాన్ని ఈ ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అంతేకాదు, ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

తప్పు చేయలేదంటూ సెల్ఫీ వీడియోతో
తన కొత్త వెబ్ సిరీస్‌ను ప్రకటించిన మోనాల్ గజ్జర్.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సెల్ఫీ వీడియోను స్టోరీగా పోస్ట్ చేసింది. 'నా గురించి మీరు ఆలోచించే దానికి ధన్యవాదాలు. నేనేమీ తప్పు చేయలేదు. దయచేసి నా నిర్ణయాన్ని గౌరవించండి. ఈ విషయంలో ఎవరినీ నిందించవద్దు. నన్ను ట్రోల్ చేసినా పట్టించుకోకండి. నాకు ఫైట్స్ అంటే ఇష్టం ఉండదు' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

అఖిల్ కోసం మోనాల్ భారీ త్యాగం చేసి
తాజా సమాచారం ప్రకారం.. మోనాల్.. అఖిల్ సార్థక్ కోసం ఓ సినిమాను ఒప్పుకుందట. అతడిని హీరోగా చూడాలనే లక్ష్యంతో ఓ నిర్మాణ సంస్థతో చర్చలు జరపగా.. వాళ్లు ఆమెనే హీరోయిన్‌గా ఉండాలని కండీషన్ పెట్టారట. దీనికి మరో ఆలోచన లేకుండానే ఒప్పుకుందట మోనాల్. ఫుల్ క్రేజ్ ఉన్న సమయంలో చిన్న సినిమాకు ఓకే చెప్పడంతో ఆమె గురించే అంతా మాట్లాడుతున్నారు.


Click it and Unblock the Notifications











