అభిజిత్‌కు మోనాల్ గజ్జర్ సోదరి షాక్.. నా అక్కను అలా అంటావా? అంటూ దురుసుగా
బిగ్‌బాస్ ఇంటిలో 74వ రోజు కూడా కెప్టెన్సీ టాస్క్ కోసం గేమ్ కొనసాగింది. ఇంటి సభ్యులు కమాండెంట్ దుస్తులు ధరించి టాస్క్‌లో పాల్గొన్నారు. క్రితం రోజు మాదిరిగానే ఇంటి సభ్యుల పేరెంట్స్ బిగ్‌బాస్ హౌస్‌ను సందర్శించారు. అరియానా ఫ్రెండ్ వినయ్, మోనాల్ సోదరి హిమాలీ, సోహైల్ తండ్రి సలీం ఇంటిలోకి వచ్చి వెళ్లారు. ఈ సందర్భంగా ఏం జరిగిందంటే..

మోనాల్‌తో అఖిల్ సీరియస్ డిస్కషన్
క్రితం రోజు తన తల్లి వచ్చిన సమయంలో అందర్నీ అడిగింది. కానీ నిన్ను ఎందుకో సరిగా పలకరించలేదు. కారణం ఏమిటో అర్ధం కావడం లేదు అంటూ మోనాల్‌తో అఖిల్ అన్నారు. అయితే తన తల్లి చాలా పొసెసివ్. అందుకే నీతో మాట్లాడకపోవొచ్చు అని అఖిల్ అంటే.. నా ఫ్రెండ్ అంటే నాకు కూడా పొసెసివ్ అని మోనాల్ మాట్లాడుకొన్నారు.

అరియానా స్నేహితుడు ఇంట్లోకి
ఇక అరియానా స్నేహితుడు వినయ్ ఇంటిలోకి వచ్చాడు. వినయ్‌ను చూసి భోరున ఏడ్చింది. అమ్మా, చెల్లెలు రాలేదా? ఇళ్లు మారారా అంటూ ఏడుస్తూనే కుశల ప్రశ్నలు వేసింది. నా జీవితంలో ఎవరు తోడు లేనప్పుడు నాకు అండగా వినయ్ నిలిచాడు. ఐ లవ్ యూ వినయ్ అని అరియానా ఎమోషనల్ అయ్యారు.

భోరున ఏడ్చిన మోనాల్ గజ్జర్
ఆ తర్వాత తన తల్లి మాటలు వినిపించంతో మోనాల్ ఎమోషనల్ అయ్యారు. కొన్ని కారణాల మేము రాలేకపోతున్నాం. నీవు బాగానే ఉన్నావు కదా అంటూ మోనాల్ తల్లి మాటలు ఇంటిలో వినిపించాయి. దాంతో తన తల్లి రాలేదనే కారణంతో భోరును ఏడ్చింది. బాత్రూంలోకి వెళ్లి విలవిలలాడింది. తన ఇంటి నుంచి ఎవరూ రారేమోనని బాధపడితే అందరూ ఊరడించారు.

అభిజిత్‌తో మోనాల్ సోదరి దురుసుగా
ఆ తర్వాత మోనాల్ చెల్లెలు హిమాలి ఇంటిలోకి ప్రవేశించారు. తన అక్కతో కలిసి గుజరాతీలో మాట్లాడారు. ఆ తర్వాత ఇంటి సభ్యులు రావడంతో వారితో కూడా మాట్లాడింది. అయితే అభిజిత్‌తో కాస్త దురుసుగా మాట్లాడినట్టు అనిపించింది. నా అక్క గురించి ఏదైనా ఉంటే ముఖం ముందే మాట్లాడు. వెనుక చెవులు కొరుక్కోకు అంటూ అభిజిత్‌ను ఉద్దేశించి కామెంట్ చేసింది. దాంతో అభిజిత్ కాస్తా బాధపడినట్టు కనిపించాడు.
Recommended Video

ఇంట్లోకి సోహెల్ తండ్రి సలీం
ఇక ఇంటిలోకి సయ్యద్ సోహైల్ తండ్రి సలీం ఇంటిలోకి వచ్చాడు. తండ్రిని చూసి ఎమోషనల్ అయ్యారు. అందరూ బాగా ఆడుతున్నారు. బిగ్‌బాస్ చూసిన తర్వాత కథ వేరేలా ఉంటుందని మాట్లాడుకొంటున్నారు. ఇంట్లో వారందరూ బాగున్నారు. ఎప్పుడు నీవు ఎలా ఉంటావో అనే విషయమే మాకు టెన్షన్‌గా ఉందంటూ కామెంట్ చేయడంతో అందరూ నవ్వారు.


Click it and Unblock the Notifications











