అఖిల్‌తో లవ్‌ ట్రాక్‌పై మోనాల్ సోదరి షాకింగ్ రియాక్షన్.. అలాంటి పనులు మానుకోమనడంతో!

ప్రస్తుతం ప్రసారం అవుతోన్న బిగ్ బాస్ నాలుగో సీజన్‌ ఆసక్తికరంగా సాగుతోంది. గతంలో చూడని టాస్కులు, ఊహించని సంఘటనలు, స్పెషల్ సర్‌ప్రైజ్‌లు, లవ్ ట్రాకులు, మసాలా సన్నివేశాలు.. వీటన్నింటితో ఈ సీజన్ రసవత్తరంగా నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ బాస్‌లోకి కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు రావడం షోకు మరింత ప్లస్ అయింది. ఇక, మోనాల్ కోసం హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఆమె సోదరి హిమాలీ. వచ్చిన తర్వాత అఖిల్‌తో లవ్‌ ట్రాక్‌పై ఆమె ఊహించని విధంగా రియాక్ట్ అయింది. అంతేకాదు హౌస్‌లో అలాంటి పనులు మానుకోమంది. ఆ సంగతులు మీకోసం.!

అక్కడి నుంచి టాలీవుడ్‌లోకి ఎంట్రీ

అక్కడి నుంచి టాలీవుడ్‌లోకి ఎంట్రీ

గుజరాత్‌కు చెందిన మోనాల్ గజ్జర్.. నటన మీద ఉన్న ఆసక్తితో చదువును కూడా మధ్యలోనే ఆపేసింది. ఈ క్రమంలోనే అల్లరి నరేష్ నటించిన ‘సుడిగాడు' అనే సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత తెలుగులోనే ‘వెన్నెల 1/2', ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాలి' సహా పలు చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత హిందీ, తమిళం, మలయాళం, గుజరాతీ, మరాఠి ఇండస్ట్రీల్లో పని చేసింది.

బిగ్ బాస్ షో కోసం మళ్లీ వచ్చింది

బిగ్ బాస్ షో కోసం మళ్లీ వచ్చింది

దాదాపు మూడు సంవత్సరాల క్రితం మోనాల్ గజ్జర్ తెలుగు సినిమాలకు దూరం అయిపోయింది. అదే సమయంలో వేరే భాషల చిత్రాలతో బాగా బిజీ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే ఆమెకు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో పాల్గొనే అవకాశాన్ని కల్పించారు నిర్వహకులు. దీంతో సుదీర్ఘ విరామం తర్వాత మోనాల్ గజ్జర్ మరోసారి హైదరాబాద్‌లో అడుగు పెట్టింది.

ఆరంభంలోనే లవ్ ట్రాక్‌తో హైలైట్

ఆరంభంలోనే లవ్ ట్రాక్‌తో హైలైట్

బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టిన మొదటి రోజు నుంచే మోనాల్ గజ్జర్ హైలైట్ అవుతోంది. మొదట్లో అభిజీత్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో పాటు ఎక్కువ సమయం అతడితోనే గడుపుతూ కనిపించింది. షో నిర్వహకులు సైతం దీన్నే ఎక్కువగా ఫోకస్ చేశారు. ప్రతి ఎపిసోడ్‌లో వీళ్ల భాగాన్నే ఎక్కువగా చూపించారు. దీంతో మోనాల్ గజ్జర్ బాగా హైలైట్ అయిపోయింది.

 అఖిల్ వైపు వెళ్లి హాట్ టాపిక్‌గా

అఖిల్ వైపు వెళ్లి హాట్ టాపిక్‌గా

అభిజీత్‌తో గ్యాప్ రావడంతో మోనాల్ గజ్జర్ అఖిల్ సార్థక్‌తో చనువుగా ఉండడం ప్రారంభించింది. ఈ క్రమంలోనే అతడితోనే ఎక్కువ సమయం గడిపేది. అంతేకాదు, తన మనసులో A ఉన్నాడని ఏకంగా నాగార్జునతోనే చెప్పింది. దీంతో వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందన్న వార్తలకు బలం చేకూరింది. ఇక, అఖిల్ పుట్టినరోజున అతడిని ముద్దుల్లో ముంచెత్తింది మోనాల్.

అఖిల్‌తో ట్రాక్‌పై హిమాలీ కామెంట్

అఖిల్‌తో ట్రాక్‌పై హిమాలీ కామెంట్

బిగ్ బాస్ హౌస్‌లోకి కంటెస్టెంట్ల ఇంటి సభ్యులు ఒక్కొక్కరుగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే మోనాల్ గజ్జర్ కోసం ఆమె సోదరి హిమాలీ వచ్చింది. స్టైలిష్ లుక్‌తో ఎంట్రీ ఇచ్చిన ఆమె హౌస్‌మేట్లు అందరిపై తన అభిప్రాయం చెప్పింది. అభిజీత్‌ను మాత్రం విమర్శించింది. ఇక, అఖిల్‌తో మోనాల్ గడుపుతున్న ట్రాక్‌పై ఊహించని విధంగా స్పందించింది.

Recommended Video

Allu Arjun Is My Favourite South Star Says Priya Punia
అలా చేస్తే తట్టుకోలేమని చెప్పడంతో!

అలా చేస్తే తట్టుకోలేమని చెప్పడంతో!

హిమాలీ ఎంట్రీ ఇచ్చిన వెంటనే ‘అఖిల్‌తో నేను ఉంటున్న తీరు చెడుగా అనిపిస్తుందా' అని మోనాల్ ప్రశ్నించింది. దీనికి కాసేపు సైలెంట్‌గా ఉన్న ఆమె సోదరి ‘అంతా బాగానే ఉంది' అని అబద్ధం చెప్పింది. దీంతో ప్రేక్షకులు షాకైపోతున్నారు. ఇక, ఆ తర్వాత హౌస్‌లో ఏడవద్దని హిమాలీ తన అక్కను కోరింది. నువ్వు అలా చేస్తే తామంతా బాధపడతామని చెప్పడంతో మోనాల్ నవ్వేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X