ఇక నుంచి మోనాల్ హైదరాబాద్‌లోనే.. కొత్త ఇంటి కోసం ఎంత ఖర్చు చేస్తోందంటే?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో కంటెస్టెంట్స్ అందరూ కూడా విభిన్నమైన స్వభావలతో ఒక క్రేజ్ అందుకున్నారు. ఇక ఈ ఏడాది ఎక్కువగా తన స్వభావంతో ట్రోలింగ్ కు గురైన కంటెస్టెంట్ మోనాల్ అనే చెప్పాలి. అసలు ఆమె ఫైనల్స్ కు దగ్గరగా వస్తుందని ఎవరు ఉహీంచలేదు. ఇక మొత్తానికి సినిమా అవకాశాలు బాగానే అందుకుంటున్న ఈ బ్యూటీ ఇక పూర్తిగా టాలీవుడ్ పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

గతంలో కంటే ఎక్కువగా గుర్తిస్తున్నారు.
బిగ్ బాస్ సీజన్ 4లో గ్లామర్ తో ఎక్కువగా ఎట్రాక్ట్ చేసిన బ్యూటీ మోనాల్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఆమెకు క్రేజ్ మామూలుగా లేదు. సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా గట్టిగానే పెరిగింది. ఒక విదంగా బిగ్ బాస్ ఆమెకు మంచి గుర్తింపు అందించింది. ట్రయాంగిల్ లవ్ స్టొరీ వలన ట్రోలింగ్ కు గురైనప్పటికీ ఎదో అలా విధంగా జనాలు గతంలో కంటే ఎక్కువగా ఆమెను గుర్తిస్తున్నారు.

బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే..
బిగ్ బాస్ నుంచి అలా బయటకు వచ్చిందో లేదో అమ్మడికి వరుసగా ఆఫర్లు రావడం మొదలయ్యాయి. ముందుగా ఆమె అల్లుడు అదుర్స్ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో ఆఫర్ దక్కించుకున్న విషయం తెలిసిందే. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన ఆ సినిమా ఈ నెల 15న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.

సేఫ్ జోన్ లోనే..
సుడిగాడు సినిమాతో అప్పట్లో బాక్సాఫీస్ హిట్ అందుకున్న మోనాల్ గజ్జర్ అనుకున్నంత రేంజ్ లో అయితే అవకాశాలు అందుకోలేదు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా ఆమెకున్న క్రేజ్ ఒక్కసారిగా పెరిగింది. అందుకే గతంలో కంటే ఎక్కువగా ఆఫర్స్ వస్తున్నాయి. కానీ ఈ నార్త్ బ్యూటీ మాత్రం వీలైనంత వరకు సేఫ్ జోన్ లోనే కథలను ఎంచుకుంటోంది.

ఆ డబ్బుతో పాటు..
ఇక తెలుగులోనే బిజీ అవ్వాలని ఫిక్స్ అయిన మోనాల్ ఇక్కడే ఒక ఇల్లు కొనుక్కొని సెటిల్ అవ్వాలని అనుకుంటోంది. హైదరాబాద్ లోనే ఒక ఫ్లాట్ కోసం సెర్చింగ్ చేస్తున్నట్లు సమాచారం. మోనాల్ బిగ్ బాస్ ద్వారా ఆమె ఉన్నన్ని రోజులు 35 నుంచి 40లక్షల వరకు సంపాదించినట్లు సమాచారం. ఇక ఆ డబ్బుతో పాటు ముందే చేసుకున్న కొన్ని సేవింగ్స్ ద్వారా మోనాల్ ఫ్లాట్ కొనుక్కోవలని అనుకుంటోందట.

ఖర్చు ఎంతైనా పరవలేదని..
ఖర్చు ఎంతైనా పరవలేదని ఖరీదైన ఫ్లాట్ కోసమే సెర్చ్ చేస్తున్నట్లు సమాచారం. బిగ్ బాస్ ద్వారానే కాకుండా ప్రస్తుతం మోనాల్ ఆఫర్స్ గట్టిగానే అందుకుంటోంది. అడ్వాన్స్ లు కూడా బాగానే వస్తున్నట్లు సమాచారం. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఆమెకు ఆఫర్స్ వస్తున్నట్టు సమాచారం. వీలైనంత వరకు టాలీవుడ్ లోనే ఎక్కువగా బిజీగా ఉండాలని మోనాల్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











