శుభకార్యానికి సిద్ధమైన మోనాల్ గజ్జర్: తల్లి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అలా.. వాళ్లకు మాత్రమే ఆహ్వానం!
తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవడంతో పాటు సినీ పరిశ్రమలోనూ తన మార్క్ చూపిస్తూ దూసుకుపోతోంది గుజరాతీ భామ మోనాల్ గజ్జర్. చాలా రోజుల క్రితమే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. పలు సినిమాల్లో నటించినా గుర్తింపును మాత్రం దక్కించుకోలేకపోయింది. అయితే, ఇప్పుడు బిగ్ బాస్ షోలోకి కంటెస్టెంట్‌గా వెళ్లడం వల్ల విపరీతమైన క్రేజ్‌ను అందుకుంది. ఇలాంటి సమయంలో తన జీవితంలోనే ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుందామె. ఇందులో భాగంగానే తన తల్లి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో శుభాకార్యానికి సిద్ధమైంది. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

బిగ్ బాస్‌లోకి ప్రవేశం.. లవ్ ట్రాకుతో ఫేమస్
తెలుగులోనే సూపర్ సక్సెస్‌ఫుల్ షో బిగ్ బాస్ నాలుగో సీజన్ ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. ఇందులోకి హీరోయిన్ మోనాల్ గజ్జర్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. షో ఆరంభంలో అభిజీత్‌కు బాగా దగ్గరైన ఆమె.. అదే సమయంలో అఖిల్ సార్థక్‌తోనూ చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. దీంతో వీళ్ల మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తున్నట్లు చూపించడంతో ఆమె బాగా ఫేమస్ అయింది.

అతడి కోసమే... అతడితోనే... ఫుల్ రొమాన్స్
మోనాల్ గజ్జర్ బిగ్ బాస్ హౌస్‌లో క్రమంగా అఖిల్ సార్థక్‌తో ప్రేమలో పడిపోయింది. నాగార్జున ముందే తన మనసులో A ఉన్నాడని చెప్పిన ఆమె.. అప్పటి నుంచి అతడితోనే ఉంటూ అతడి కోసమే ఆడుతూ హాట్ టాపిక్ అయింది. అలాగే, నామినేషన్స్ నుంచీ కాపాడుతూ వచ్చింది. అదే సమయంలో హగ్గులు, ముద్దులతో రెచ్చిపోయింది. దీంతో ఆమె బాగా పాపులర్ అయిపోయింది.
హాట్ అండ్ సెక్సీ సమంత ఫోటోలు.. బికినీలో అదరగొట్టిన బ్యూటీ

చివరి వారంలో ఔట్... అయినా లాభపడింది
ఏమాత్రం అంచనాలు లేకుండానే బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది మోనాల్ గజ్జర్. కానీ ఊహించని విధంగా ఆమె చాలా సార్లు నామినేషన్స్ తప్పించుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇలాంటి పరిస్థితుల్లో ఫినాలేకు ఒక వారం ముందు మోనాల్ ఎలిమినేట్ అయింది. ఇక, ఈ షో వల్ల రెమ్యూనరేషన్ పరంగా మోనాల్ గజ్జర్ బాగానే లాభ పడినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

పెరిగిన పాపులారిటీ.. వరుసగా అవకాశాలు
బిగ్ బాస్ వల్ల మోనాల్ గజ్జర్‌కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ కారణంగానే ఆమెకు తెలుగులో ఆఫర్లూ వస్తున్నాయి. ఇప్పటికే ఈ గుజరాతీ భామ స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'డ్యాన్స్+' అనే షోకు జడ్జ్‌గా ఎంపికైంది. దీని తర్వాత ఆమె.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కిస్తోన్న 'అల్లుడు అదుర్స్'లో ఐటమ్ సాంగ్ కూడా చేసింది.
శృంగారం ఒలకబోస్తున్న యువ హీరోయిన్.. లేటేస్ట్ ఫోటోషూట్‌తో హంగామా

ఫ్యూచర్‌పై కీలక నిర్ణయం తీసుకున్న మోనాల్
బిగ్ బాస్ తర్వాత వరుసగా ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతోన్న మోనాల్ గజ్జర్.. ప్రస్తుతం సొంత ఊరిలో కుటుంబ సభ్యులతో గడుపుతోంది. అయినప్పటికీ తెలుగు వాళ్లతో సోషల్ మీడియా ద్వారా ఇంటరాక్ట్ అవుతోంది. ఇలాంటి సమయంలో గతంలో బ్రేకప్ కారణంగా దక్షిణాదిని వీడిన మోనాల్ గజ్జర్.. ఇప్పుడు హైదరాబాద్‌లోనే సెటిల్ అవ్వాలని డిసైడ్ అయిందని తెలిసింది.

శుభకార్యానికి సిద్ధం: తల్లి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో
విస్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పరచుకోవాలని భావిస్తోన్న మోనాల్ గజ్జర్.. ఓ ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు సిద్ధం అయిందట. ఇందుకోసం ఇప్పటికే బేరం కూడా కుదుర్చుకున్నట్లు తెలిసింది. కుటుంబంతో కలిసి నగరానికి వచ్చి గృహ ప్రవేశం చేయబోతుందని సమాచారం. ఈ శుభకార్యానికి బిగ్ బాస్ ఫ్యామిలీని ఆహ్వానించబోతుందట మోనాల్.


Click it and Unblock the Notifications











