ఊహించని పనితో షాకిచ్చిన మోనాల్ గజ్జర్: అతడిని తీసుకెళ్లిపోయిన బ్యూటీ.. అలా చూపించడంతో అనుమానాలు

హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయినప్పటికీ.. అంతగా గుర్తింపును దక్కించుకోలేకపోయింది మోనాల్ గజ్జర్. కానీ, ఎప్పుడైతే బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చిందో.. అప్పటి నుంచి ఆమె విపరీతంగా ఫేమస్ అయిపోయింది. దీనికి కారణం హౌస్‌లో ఆమె వ్యవహరించిన తీరే అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతేకాదు, బయట కూడా తరచూ ఏదో ఒక పని చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఆమె పేరు మారుమ్రోగిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే తాజాగా మోనాల్ ఊహించని పని చేసి అందరినీ షాక్‌కు గురి చేసింది. ఆ వివరాలు మీకోసం!

మొదట అతడితో.. తర్వాత ఇతడితో ట్రాకులు

మొదట అతడితో.. తర్వాత ఇతడితో ట్రాకులు


సినిమా హీరోయిన్‌ అయిన మోనాల్ గజ్జర్ బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా అడుగు పెట్టింది. ఆరంభంలోనే యంగ్ హీరో అభిజీత్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. ఇలా చాలా రోజుల పాటు అతడి వెంట తిరిగింది. అదే సమయంలో అఖిల్ సార్థక్‌తోనూ చనువుగా ఉంది. దీంతో ఇద్దరితో ఒకేసారి ట్రాక్ నడుపుతుందని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగడంతో ఆమెపై విమర్శలొచ్చాయి.

ఎరుపు చీరలో కనువిందు చేసిన జాక్వలైన్ ఫెర్నాండేజ్..

రెచ్చిపోయిన మోనాల్.. ముద్దులు, హగ్గులతో

రెచ్చిపోయిన మోనాల్.. ముద్దులు, హగ్గులతో


బిగ్ బాస్ షో నడిచే కొద్దీ మోనాల్ గజ్జర్.. అఖిల్ సార్థక్ ప్రేమలో పడిపోయింది. దీంతో ప్రేక్షకులతో పాటు హౌస్‌లో ఉన్న వాళ్లంతా వీళ్ల ట్రాక్ గురించి మాట్లాడేవారు. దీంతో మరింత రెచ్చిపోయిన ఈ జంట హౌస్‌లో మరింత హల్‌చల్ చేసింది. ఇందులో భాగంగానే తరచూ ముద్దులు, హగ్గులు చేస్తూ వార్తల్లో నిలిచింది. ఇలా బిగ్ బాస్ హౌస్‌లో ఈ జంట రచ్చ రచ్చ చేసి హైలైట్ అయింది.

రెమ్యూనరేషన్.. ఆఫర్లు.. అన్నింట్లోనూ హవా

రెమ్యూనరేషన్.. ఆఫర్లు.. అన్నింట్లోనూ హవా

సాధారణ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగు పెట్టిన మోనాల్ గజ్జర్.. ఊహించని విధంగా పద్నాలుగు వారాలు షోలో కొనసాగింది. ఇందుకోసం ఆమె ఏకంగా రూ. 50 లక్షలు పైగానే తీసుకుందని తెలిసింది. అదే సమయంలో వరుసగా ఆఫర్లను కూడా అందుకుంటోంది. ఓంకార్ నిర్వహించే 'డ్యాన్స్+' అనే షోకు జడ్జ్‌గా ఎంపికవడంతో పాటు 'అల్లుడు అదుర్స్'లో ఐటమ్ సాంగ్ కూడా చేసింది.

అభిమానుల కల నిజం చేస్తూ.. అఖిల్‌తో అలా

అభిమానుల కల నిజం చేస్తూ.. అఖిల్‌తో అలా

ప్రేమికుల రోజును పురస్కరించుకుని అఖిల్ సార్థక్‌తో చేస్తున్న వెబ్ సిరీస్‌ను ప్రకటించింది మోనాల్ గజ్జర్. 'తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి' అనే టైటిల్‌తో వస్తున్న దీన్ని సరస్వతి క్రియేషన్స్ బ్యానర్‌పై భాస్కర్ బంతుపల్లి తెరకెక్కిస్తున్నారు. ఈ విషయాన్ని ఈ ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అంతేకాదు, ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

అందులో ఆమెదే హవా.. ఎక్కువ ఫోకస్ కూడా

అందులో ఆమెదే హవా.. ఎక్కువ ఫోకస్ కూడా

మోనాల్ గజ్జర్ ప్రస్తుతం 'డ్యాన్స్+' షోలోనే చేస్తోంది. ఇందులో ఆమె జడ్జ్‌గా వ్యవహరించే తీరు ఆకట్టుకుంటోంది. అలాగే, ఆమె డ్రెస్సింగ్ కూడా మెప్పించే విధంగా ఉంది. మొదట్లో అందాలను కనిపించేలా అలంకరించుకున్న ఈ భామ... ఈ మధ్య కాలంలో సంప్రదాయంగా కనిపిస్తోంది. దీంతో ఆమెను ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు షో నిర్వహకులు. తద్వారా తరచూ హైలైట్ అవుతోంది.

ఊహించని పని చేసి షాకిచ్చిన మోనాల్ గజ్జర్

ఊహించని పని చేసి షాకిచ్చిన మోనాల్ గజ్జర్

'డ్యాన్స్+' షో నుంచి గత వారం ఓ జడ్జ్ ముమైత్ ఖాన్ (ఆమె కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయిన కారణంగా) ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు ఐదుగురు న్యాయ నిర్ణేతలు మాత్రమే ఉన్నారు. ఇక, వచ్చే వారం జరగనున్న ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలై వైరల్ అవుతోంది. దీనికి కారణం ఇందులో మోనాల్ గజ్జర్ ఊహించని పని చేయడమే.

Recommended Video

Prabhas Nag Ashwin International మూవీ, కనీవినీ ఎరుగని రీతిలో..!!

అలా చూపించడంతో అనుమానాలు మొదలు

ఈ షోలో అదరగొడుతోన్న కన్నా మాస్టర్ టీమ్ అద్భుతమైన ప్రదర్శన చేసింది. దీంతో మోనాల్ గజ్జర్.. అతడిని తీసుకెళ్లి తన సీట్లో కూర్చోబెట్టింది. అలా తీసుకెళ్తోన్న సమయంలో ఓ రొమాంటిక్ సాంగ్ వేశారు. అంతేకాదు, ఓంకార్ రెట్టించి రెట్టించి ప్రశ్నలు అడుగుతూ రొమాన్స్ పండించాడు. దీంతో వచ్చే ఎపిసోడ్లలో మోనాల్ - కన్నాను హైలైట్ చేస్తారా అన్న అనుమానాలు వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X