సర్‌ప్రైజ్ అంటూ షాకిచ్చిన మోనాల్: వాలంటైన్స్ డే రోజే ఇలా.. ఏకంగా అలాంటి పోస్ట్ చేయడంతో అనుమానం!

మోనాల్ గజ్జర్.. దాదాపు మూడు నాలుగు నెలలుగా తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోతోన్న పేరిది. అప్పుడెప్పుడో హీరోయిన్‌గా పరిచయం అయిన ఈ బ్యూటీ.. అంతగా గుర్తింపును దక్కించుకోలేకపోయింది. కానీ, ఎప్పుడైతే బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చిందో.. అప్పటి నుంచి ఆమె ఫేట్ మారిపోయింది. విపరీతమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకోవడంతో పాటు వరుస ఆఫర్లను కూడా అందుకుంటోంది. అన్నింటికీ మించి అఖిల్ సార్థక్‌తో ప్రేమాయణంతో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఈ నేపథ్యంలో వాలంటైన్స్ డే సర్‌ప్రైజ్ అంటూ షాకిచ్చింది మోనాల్. ఆ వివరాలు మీకోసం!

ఒకేసారి ఇద్దరితో ట్రాక్.. ట్రైయాంగిల్ లవ్ అంటూ

ఒకేసారి ఇద్దరితో ట్రాక్.. ట్రైయాంగిల్ లవ్ అంటూ


గతంలో పలు చిత్రాల్లో హీరోయిన్‌గా చేసిన మోనాల్ గజ్జర్.. బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలోనే యంగ్ హీరో అభిజీత్‌తో ప్రేమాయణం సాగిస్తోందన్న వార్తలతో హాట్ టాపిక్ అయింది. అదే సమయంలో అఖిల్ సార్థక్‌తోనూ క్లోజ్‌గా ఉండడంతో వీళ్ల ముగ్గురి మధ్య ట్రైయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తున్నట్లు ప్రచారం జరిగింది.

అతడికి దగ్గరైన మోనాల్.. ఏకంగా రొమాన్స్ చేసి

అతడికి దగ్గరైన మోనాల్.. ఏకంగా రొమాన్స్ చేసి

కొద్ది రోజులకు అభిజీత్‌కు పూర్తిగా దూరమైపోయింది మోనాల్. అంతేకాదు, అఖిల్ సార్థక్‌తో మరింత దగ్గరైంది. దీంతో వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని అంతా అనుకున్నారు. అందుకు తగ్గట్లే వీళ్లిద్దరూ మరింత రెచ్చిపోయి రొమాన్స్ చేసేవారు. తరచూ హగ్గులిచ్చుకోవడం.. ముద్దులు పెట్టుకోవడం.. కొంటెగా చూసుకోవడం.. మాట్లాడుకోవడం వంటి వాటితో హాట్ టాపిక్ అయిందీ జంట.

బాగా కలిసొచ్చింది.. ఇప్పటికే వాటిలో అవకాశం

బాగా కలిసొచ్చింది.. ఇప్పటికే వాటిలో అవకాశం

సాదాసీదా కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చింది మోనాల్. కానీ, ఊహించని విధంగా పద్నాలుగు వారాల పాటు షోలో కొనసాగింది. దీని ద్వారా రూ. 50 లక్షలు పైగానే సంపాదించింది. ఈ షో వల్ల క్రేజ్‌ను కూడా భారీగానే అందుకున్న ఈ అమ్మడు.. వరుసగా ఆఫర్లు అందుకుంటోంది. 'డ్యాన్స్+' అనే షోకు జడ్జ్‌గా ఎంపికవడంతో పాటు 'అల్లుడు అదుర్స్'లో ఐటమ్ సాంగ్ కూడా చేసింది.

హౌస్‌లోనే కాదు... బయట కూడా... జంట రచ్చ

హౌస్‌లోనే కాదు... బయట కూడా... జంట రచ్చ


బిగ్ బాస్ హౌస్‌లో ప్రేమాయణం సాగిస్తున్నట్లు వచ్చిన వార్తలతో విపరీతంగా ట్రెండ్ అయింది మోనాల్ గజ్జర్.. అఖిల్ సార్థక్ జంట. బయటకు వచ్చిన తర్వాత కూడా అలాగే కనిపిస్తున్నారీ ఇద్దరు. తరచూ కలిసి తిరగడం.. పార్టీలు చేసుకోవడం వంటివి చేస్తున్నారు. అదే సమయంలో సోషల్ మీడియా చాట్ల ద్వారా.. ఇంటర్వ్యూల ద్వారా ఒకరిపై ఒకరు తమ ప్రేమను వ్యక్త పరచుకుంటున్నారు.

సర్‌ప్రైజ్ అంటూ షాకిచ్చిన గుజరాతీ ముద్దుగుమ్మ

సర్‌ప్రైజ్ అంటూ షాకిచ్చిన గుజరాతీ ముద్దుగుమ్మ


బిగ్ బాస్ షో తర్వాత తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది మోనాల్ గజ్జర్. దీంతో అమ్మడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ తరచూ ఏదో ఒక రకంగా ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోంది. అంతేకాదు, తనకు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. ఇలాంటి సమయంలో తాజాగా ఈ అమ్మడు ఓ ఊహించని పోస్ట్ చేసింది.

Recommended Video

GQ25 Most Influential Young Indians : Allu Arjun కి స్థానం , Pant, Kl Rahul కూడా..!!
ఏకంగా అలాంటి పోస్ట్ చేయడంతో అనుమానం

ఏకంగా అలాంటి పోస్ట్ చేయడంతో అనుమానం


తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో 'గాయ్స్.. ఒక ఆసక్తికరమైన అప్‌డేట్.. రేపు మధ్యాహ్నం బిగ్ సర్‌ప్రైజ్. వేచి చూడండి' అంటూ శనివారం పోస్ట్ చేసింది మోనాల్ గజ్జర్. దీంతో తన ప్రేమ గురించే ఆమె ప్రకటించబోతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో సినిమాకు సంబంధించిన అప్‌డేట్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X