For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అఖిల్ సార్థక్ బెడ్‌రూంలో మోనాల్ గజ్జర్: అతడితో అలాంటి అంత క్లోజ్‌గా.. వెనుక నుంచి పట్టుకుని!

  |

  తెలుగు బుల్లితెరపై సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోన్న షోలలో బిగ్ బాస్ ఒకటి. అసలెప్పుడూ చూడని సరికొత్త కాన్సెప్టుతో నడిచే ఈ కార్యక్రమం రియాలిటీ ఆధారంగా రూపొందింది. అందుకే ఇందులో ఎన్నో రకాల ఎమోషన్స్‌ను కనబరుస్తుంటారు కంటెస్టెంట్లు. మరీ ముఖ్యంగా ఈ షో ద్వారా ఎంతో మంది జంటలుగా మారిపోయారు. అలాంటి వారిలో మోనాల్ గజ్జర్, అఖిల్ సార్థక్ జోడీ ఒకటి. నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్లుగా వచ్చిన వీళ్లు.. హౌస్‌లో తెగ సందడి చేశారు. అదే సమయంలో బయట కూడా ఓ రేంజ్‌లో రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మోనాల్ గజ్జర్.. ఏకంగా అఖిల్ సార్థక్ బె‌డ్‌రూంలో దర్శనమిచ్చింది. ఆ సంగతులు మీకోసం!

  ముద్దులు, హగ్గులతో రచ్చ చేశారు

  ముద్దులు, హగ్గులతో రచ్చ చేశారు

  పోయిన ఏడాది వచ్చిన బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు అఖిల్ సార్థక్.. మోనాల్ గజ్జర్. ఈ క్రమంలోనే వీళ్లిద్దరూ షో ఆరంభంలోనే చాలా క్లోజ్ అయ్యారు. అలా అలా ఇద్దరి మధ్య ప్రేమాయణం మొదలైంది. దీంతో తరచూ తమ లవ్‌ను వ్యక్తపరచుకోవడంతో పాటు ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయేవారు. ఫలితంగా హౌస్‌లో ఉన్నప్పుడే పాపులర్ అయిపోయారు.

  Bigg Boss: షోలో ఆ హీరోను అవమానించిన నాగార్జున.. స్టేజ్ మీదే ఆమెతో అలా చేయడంతో విమర్శలు

  బయట కూడా నిత్యం కలుస్తూనే

  బయట కూడా నిత్యం కలుస్తూనే

  బిగ్ బాస్ హౌస్‌లో జంటగా రచ్చ రచ్చ చేసిన అఖిల్ సార్థక్.. మోనాల్ గజ్జర్.. బయటకు వచ్చిన తర్వాత కూడా తీరును కొనసాగిస్తున్నారు. తరచూ కలుసుకోవడం.. వాటికి సంబంధించిన ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం వంటివి చేస్తున్నారు. ఫలితంగా షోలో ఉన్నప్పుడు మాదిరిగానే బయట కూడా హైలైట్ అవుతూ తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.

  కెరీర్ పరంగా బిజీ అయిన కపుల్

  కెరీర్ పరంగా బిజీ అయిన కపుల్

  ఈ షో తర్వాత అఖిల్ సార్థక్.. మోనాల్ గజ్జర్ కెరీర్‌లకూ బూస్ట్ వచ్చింది. దీంతో ఇద్దరూ వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతున్నారు. తద్వారా అటు ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ అవుతున్నారు. ఇప్పటికే మోనాల్.. ఓ సినిమాలో స్పెషల్ సాంగ్‌తో పాటు డ్యాన్స్ షోకు జడ్జ్‌గా వ్యవహరించింది. అలాగే, అఖిల్ కూడా హీరోగా తన మొదటి సినిమాను ప్రారంభించేశాడు కూడా.

  Bigg Boss: ప్రియాంకకు రామ్ చరణ్ బంపర్ ఆఫర్.. నిహారిక పేరు చెప్పగానే ప్రామిస్.. హమీదాకు కూడా!

  జంటగా చెప్పారు.. రావడం లేదు

  జంటగా చెప్పారు.. రావడం లేదు

  వాలంటైన్స్ డేను పురస్కరించుకుని అఖిల్ సార్థక్‌తో చేస్తున్న వెబ్ సిరీస్‌ను ప్రకటించింది మోనాల్ గజ్జర్. 'తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి' అనే టైటిల్‌తో వస్తున్న దీన్ని సరస్వతి క్రియేషన్స్ బ్యానర్‌పై భాస్కర్ బంతుపల్లి తెరకెక్కిస్తున్నారు. అంతేకాదు, ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. అయితే, ఇద్దరి మధ్య డేట్స్ కుదరకపోవడంతో ఇది ఇంకా మొదలు కాలేదు.

  ఇక్కడికి వచ్చేసిన మోనాల్ గజ్జర్

  ఇక్కడికి వచ్చేసిన మోనాల్ గజ్జర్

  అహ్మదాబాద్‌కు చెందిన మోనాల్ గజ్జర్.. ఇప్పుడు మాత్రం ఆమె హైదరాబాద్‌కు షిఫ్ట్ అయిపోయింది. గతంలో ఎప్పుడో ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ.. ఇటీవలే ఓ ఇంటిని కొనుగోలు చేసింది. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితమే ఆమె తన ఫ్యామిలీతో సహా ఇక్కడకు వచ్చేసింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. దీంతో అఖిల్ కోసమే వచ్చిందని అన్నారు.

  బూతులతో రెచ్చిపోయిన శ్రీరెడ్డి: ఆ శృంగారం ఎలా చేస్తారో వివరిస్తూ వీడియో.. అక్కలు, ఆంటీల కోసమే అంటూ!

  అఖిల్ బెడ్‌రూంలో మోనాల్ రచ్చ

  అఖిల్ బెడ్‌రూంలో మోనాల్ రచ్చ

  ఆ మధ్య ఎప్పుడూ కలుస్తూ జంటగా కనిపించిన అఖిల్ సార్థక్.. మోనాల్ గజ్జర్.. ఇటీవల పెద్దగా కలిసింది లేదు. దీంతో వీళ్ల మధ్య దూరం పెరిగిందేమో అని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఇటీవలే వీళ్లు మరోసారి జంటగా కనిపించారు. అది కూడా అఖిల్ సార్థక్ ఇంట్లోనే. అవును.. అతడి బెడ్‌రూంలో మోనాల్ సందడి చేసిన వీడియో వైరల్ అవుతోంది.

  Recommended Video

  Bigg Boss Telugu 5 Episode 7 Analysis..RJ Kajal the ultimate target for housemates
  అలా చేస్తూ కనిపించడంతో షాక్

  అలా చేస్తూ కనిపించడంతో షాక్

  ఇటీవల మోనాల్ గజ్జర్.. అఖిల్ సార్థక్ ఇంటికి డిన్నర్‌కు వెళ్లిందట. ఆ సమయంలో అతడి బె‌డ్‌రూంలో ఓ సెల్ఫీ వీడియోను తీసుకున్నాడు. అందులో మోనాల్ వెనుక నుంచి అఖిల్‌ను పట్టుకుని కనిపించింది. అంతేకాదు, అతడి జుట్టును కూడా సరి చేసింది. దీంతో వీళ్లిద్దరూ ఎంత క్లోజ్‌గా ఉన్నారో అర్థం అవుతోంది. ఈ వీడియోను అఖిల్, మోనల్ ఇన్‌స్టాలో స్టోరీగా పెట్టారు.

  English summary
  Tollywood Hero, Bigg Boss Fame Akhil Sarthak Very Active in Social Media. Now He Posted A Selfie Video with Monal Gajjar in Instagram
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X