కరోనా బారిన పడిన ‘మనీ హీస్ట్‘ నటి.. పాజిటివ్ అని తేలడంతో..
మనీ హీస్ట్‌లో కీలక పాత్రను పోషించిన స్పానిష్ నటి ఇజియార్ ఇతునో కరోనావైరస్ బారిన పడ్డారు. నెట్‌ఫ్లిక్స్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ వెబ్ సిరీస్‌లో ఇన్స్‌పెక్టర్ రాక్వెల్ మురెల్లో పాత్రలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్న సంగతి తెలిసిందే.
తనకు కరోనా వైరస్ సోకిన విషయంపై ఇజియార్ ఇతునో స్పందిస్తూ.. గత శుక్రవారం నుంచి కరోనా లక్షణాలు నన్ను వెంటాడుతున్నాయి. రోగ నిర్ధారణ పరీక్షల అనంతరం నాకు కరోనా పాజిటివ్ అని తేలింది అని ఆమె వెల్లడించారు. అయితే రోగ తీవ్రత అంత తీక్షణంగా లేదు. మీరు ఈ వ్యాధిని అంత తేలిగ్గా తీసుకోని ప్రాణాలు పణంగా పెట్టుకోవద్దు. ఈ ప్రాణాంతక వ్యాధికి ముగింపు ఎప్పుడో అర్థం కావడం లేదు అని ఇజియార్ పేర్కొన్నారు.

ఇప్పటికే పలువురు విదేశీ నటులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఇప్పటికే హాలీవుడ్ నటలు టామ్ హాంక్స్, రీటా విల్సన్, ఇద్రిస్ ఎల్బా, డేనియల్ డే కిమ్, ప్రిన్స్ అల్బర్ట్ 2 ఆఫ్ మొనాకో తదితరులు ఈ వ్యాధి బారిన పడ్డారు. తాజాగా ఆ ప్రముఖుల జాబితాలోకి ఇజియార్ ఇతునో చేరడం గమనార్హం.
మనీ హీస్ట్ నాలుగో సీజన్ నెట్‌ఫ్లిక్స్‌లో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన చిత్రంగా మారింది. ఏప్రిల్ 3న ప్రదర్శించిన వరల్డ్ ప్రీమియర్‌కు అనుహ్యమైన స్పందన లభిస్తున్నది.
ఇప్పటికే ఈ ప్రాణాంతక వ్యాధి గురించి ప్రజల్లో, సినీ ప్రేక్షకుల్లో అవగాహన కల్పించడానికి పలువురు సినీ ప్రముఖులు ప్రచారం విస్తృతం చేశారు.


Click it and Unblock the Notifications











