twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టార్ డైరక్టర్ తో మోనికా బేడీ రీ ఎంట్రీ

    By Srikanya
    |

    ముంబై: తెలుగులో వచ్చిన తాజ్ మహల్, శివయ్య వంటి చిత్రాల్లో కనిపించి తర్వాత మాఫియా లింక్ లతో అరెస్టైన మోనికాబేడీ గుర్తుందా. ఆమె మళ్లీ ప్రేక్షకులను మళ్లీ అలరించటానికి సిద్దమవుతోంది. అయితే ఈసారి సినిమాలతో కాకుండా ఓ టెలీ షోతో అభిమానుల ముందుకు వస్తోంది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్న 'సరస్వతీ చంద్ర' టెలీ షోతో మళ్లీ నటిగా కెరీర్‌ను ప్రారంభిస్తోంది.

    తన గతాన్నంతా మరిచి నటిగా కెరీర్‌ను ప్రారంభించాలనుకుంటున్నానని, జీవితంలో ఇప్పటిదాకా జరిగినవన్నీ తలరాతే అనుకుంటున్నానని చెప్పింది. అంతేకాదు జీవితంలో ఎవరికి, ఎలా రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుందని, విధిరాత నుంచి ఎవరూ తప్పించుకోలేరని చెబుతోంది.

    Mounika Bedi

    గతాన్ని ఎవరూ మార్చలేరని, కష్టాలకు ఎదురొడ్డి నిలిచి ముందుకు పోవడమే జీవితమని చెబుతోంది. గత అనుభవాలన్నీ తనకు ఎన్నో పాఠాలను నేర్పాయని, కష్టాలతో పోరాడే ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయంటోంది. బాలీవుడ్‌లో నటించింది కొన్ని రోజులే అయినా సంజయ్ దత్, గోవిందా, అర్జున్ రాంపాల్ వంటి పెద్ద స్టార్‌లతో నటించింది. జోడీ నంబర్ 1, జానమ్ సంఝా కరో, ప్యార్ ఇష్క్ ఔర్ మొహబ్బత్ వంటి చిత్రాలతో అభిమానులకు చేరువైంది. అనంతరం అండర్ వరల్డ్ డాన్ అబు సలేంతోపాటు పోర్జుగల్‌లో 2005లో అరెస్టయింది.

    జైలు జీవితం తర్వాత 'బిగ్ బాస్' రియాల్టీ షోతో మళ్లీ వెలుగులోకి రావడంతో ఇక సినిమాల్లో నటిస్తుందని భావించారు. అయితే మోనికాకు అవకాశాలిచ్చేందుకు దర్శకనిర్మాతలెవరూ ముందుకు రాకపోవడంతో ఖాళీగానే గడిపింది. ఇన్నాళ్లకు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఓ టెలీ షోలో నటించే అవకాశం ఇవ్వడంతో మళ్లీ అభిమానుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.

    English summary
    Sanjay Leela Bhansali has stepped in the production of TV serials and it is also based upon a great epic love story Sarswati Chandra .Star PLUS is the channel that is the main telecasting organization. The entire team of SANJAY LEELA BHANSALI and star parivar are there. The lead casts, Monika Bedi ,director, star plus officers and other crew members are there to increase the event of launch of SLB's first TV Serial SARSWATICHANDRA. 
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X