బిగ్ బాస్ 2: కౌశల్ మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు
Recommended Video

'బిగ్‌బాస్ తెలుగు 2' చివరి దశకు చేరుకుని మరో వారం రోజుల్లో విన్నర్ ఎవరో తేలిపోనున్న తరుణంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బిగ్ బాస్ కంటెస్టెంట్ కౌశల్‌ను సపోర్ట్ చేస్తున్న కౌశల్ ఆర్మీ.... బిగ్‌బాస్ 2 విన్నర్ కౌశల్ మాత్రమే అని, ఎక్కువ మంది మద్దతు ఉన్న అతడు మాత్రమే బిగ్‌బాస్ టైటిల్‌కు అర్హుడు అంటూ సోషల్ మీడియాలో భారీగా కాంపెయిన్ చేయడంతో పాటు కౌశల్‌కు మద్దతుగా 2కె రన్ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ హడావుడి చేస్తున్నారు. కౌశల్ విన్నర్ కాకుండా కుట్రలు జరుగుతున్నాయని ముందు నుండి ఆరోపిస్తున్న కౌశల్ ఆర్మీ.... ఏదైనా తేడా వస్తే తమ తడాఖా చూపిస్తామని సైతం హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
కౌశల్ మీద మహేష్ కత్తి సంచలన కామెంట్స్
ఓ వైపు కౌశల్ ఆర్మీ సీరియస్‌గా తమ పని చేసుకుంటూ వెళుతుంటే...... కౌశల్‌ను విమర్శిస్తూ బిగ్ బాస్ 1 కంటస్టెంట్ మహేష్ కత్తి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అయింది. కొన్ని రోజుల క్రితం ‘కౌశల్ అంతా కోల్పోయాడు.. అతన్ని హౌస్ నుంచి బయటకు గెంటేయండి' అని మహేష్ కత్తి ట్వీట్ పెట్టారు. అయితే ఈ వారం కౌశల్ కాకుండా రోల్ రౌడ్ ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యాడు.
తెలుగు బిగ్ బాస్ చరిత్రలోనే చెత్తగా
శనివారం నాని కౌశల్‌ని ప్రశ్నించిన నేపథ్యంపై మహేష్ కత్తి స్పందిస్తూ..... ‘కౌశల్ చెప్పిన సమాధానాలు చాలా పేలవంగా, చెత్తగా ఉన్నాయి.. బిగ్‌బాస్ తెలుగు చరిత్రలోనే ఇంత చెత్తగా ఎవరూ సమాధానాలు చెప్పలేదు అని మహేష్ కత్తి వ్యాఖ్యానించారు.
అతడు గెలిస్తే మనం ఇడియట్సే
బిగ్ బాస్ 2 షోలో చాలా విసుగు తెప్పించే వ్యక్తి కౌశల్. అలాంటి వ్యక్తి బిగ్ బాస్ 2 టైటిల్ విన్ అవ్వాలని కోరుకోవడం ద్వారా మనం ఎంత ఇడియట్స్ అనేది రుజువు చేసుకుంటున్నాం.... అని మహేష్ కత్తి ట్వీట్ చేశారు.
మహేష్ కత్తి మద్దతు ఎవరికి?
మరి కత్తి మహేష్ మద్దతు ఎవరికి? ఎవరు గెలవాలని ఆయన కోరుకుంటున్నారంటే.... దీప్తి నల్లమోతు అని నిర్మొహమాటంగా చెప్పేశారు. ఎవరైనా దీప్తి తరుపున కాంపెయిన్ నిర్వహిస్తే తాను ఆమెకే ఓటు వేస్తానని మహేష్ కత్తి వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications











