ఎక్కడా తగ్గని వంటలక్క.. తెలుగు నటులందరినీ వెనక్కు తోసి టాప్ ప్లేస్.. టాప్ ఫైవ్ లో ఎవరెవరంటే?
తెలుగు టీవీ సీరియల్స్ కూడా మంచి రేటింగులు సాధిస్తూ సినిమాలకు దీటుగా నిలుస్తున్నాయి. మరీ ముఖ్యంగా స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న కార్తీకదీపం, జానకి కలగనలేదు, అలాగే జీ తెలుగు లో ప్రసారం అవుతున్న రాధమ్మ కూతురు, త్రినయని ఇలాంటి సీరియల్స్ ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తూ టి ఆర్ పి లు సాధిస్తున్నాయి.. అయితే ఒక పాపులర్ మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ టీవీ సీరియల్ క్యారెక్టర్స్ లో ఎవరు తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు అనే విషయం వెల్లడైంది. జూలై నెల వరకు నిర్వహించిన సర్వేలో మొదటి స్థానం దక్కించుకుంది కార్తీకదీపం వంటలక్క అలియాస్ దీప క్యారెక్టర్. ఇక టాప్ ఫైవ్ లో ఎవరున్నారు అనే వివరాల్లోకి వెళితే
Recommended Video

వంటలక్క
మా టీవీలో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ మంచి టిఆర్పి రేటింగ్ సాధిస్తోంది. మరీ ముఖ్యంగా ఈ సీరియల్లో లీడ్ రోల్ లో నటిస్తున్న దీప క్యారెక్టర్ అదేనండి మన వంటలక్క ఈ లిస్టులో మొదటి స్థానంలో నిలిచింది. ఆమెకు ఈ సీరియల్ ద్వారా ఫ్యాన్స్ కోట్లల్లో ఏర్పడ్డారు అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

డాక్టర్ బాబు
ఇక ఇదే సీరియల్ కి సంబంధించిన లీడ్ రోల్ లో నటిస్తున్న కార్తీక్ అలియాస్ నిరుపం రెండో స్థానం సాధించారు. ఆయన చేస్తున్న కార్తీక్ పాత్ర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది అనే చెప్పాలి.. అయితే కార్తీక్ అనే పేరు కంటే కూడా ఆయన డాక్టర్ బాబు గానే తెలుగు ప్రేక్షక లోకానికి బాగా దగ్గరయ్యాడు. అదే పేరుతో ఆయన పాపులారిటీ కూడా సంపాదించుకున్నాడు.

అక్షర
ఇక అలాగే జీ తెలుగు సీరియల్ లో ప్రసారం అవుతున్న రాధమ్మ కూతురు అనే సీరియల్ లో అక్షర అనే క్యారెక్టర్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. కార్తీకదీపం సీరియల్ నుంచి దీప, కార్తీక్ తర్వాత ఈ రాధమ్మ కూతురు సీరియల్ నుంచి అక్షర పాత్ర టాప్ ప్లేస్ లో నిలిచింది అని చెప్పవచ్చు. అంటే ఈ టాప్ 5 లిస్టులో ఆమెకు మూడో స్థానం దక్కింది.

ఆర్య వర్ధన్
జీ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న సీరియల్ 'ప్రేమ ఎంత మధురం'.. అను, ఆర్యల రొమాంటిక్ ప్రేమ కథ ఈ సీరియల్ ఆసక్తికరంగా సాగుతుంది. ఈ సీరియల్ లో ఆర్య వర్ధన్ పాత్ర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది అనే చెప్పాలి. జూలై నెలలో టాప్ 5 లిస్టులో 4వ స్థానం దక్కింది.

త్రినయని
ఇక జీ తెలుగు ఛానల్ లో ప్రసారం అవుతున్న త్రినయని సీరియల్ కూడా ఆసక్తికరంగా సాగుతుంది అని చెప్పాలి. టాప్ ఫైవ్ సీరియల్స్ లో ఒకటిగా ఈ సీరియల్ కూడా మంచి స్థానం సంపాదించింది.. ఇక ఈ సీరియల్ లో లీడ్ రోల్ లో నటిస్తున్న త్రినయని పాత్రకు ఈ లిస్టులో చోటు దక్కింది. ఈ లిస్టు లో 5వ స్థానం లో త్రినయని పాత్ర నిలిచింది. మొత్తం మీద ఈ ఐదుగురు లిస్ట్ టెలివిజన్ ఫిక్షనల్ క్యారెక్టర్స్ నుంచి వెలుగులోకి వచ్చాయి.


Click it and Unblock the Notifications











