Bigg Boss Telugu 6: ఆ సర్వేలో టాప్ 5 కంటెస్టెంట్స్ వీరే.. లిస్ట్ లో ఓకే ఒక్క అమ్మాయి!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 మొదలై రెండు వారాలు దగ్గరపడుతోంది. ఇక కాంటెస్టెంట్స్ అందరూ కూడా ఎవరికి వారు తామే చివరి వరకు నిలుస్తాము అని ధీమాగా ఉన్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో అప్పుడే కొంతమంది కాంటెస్టెంట్స్ కు ఫ్యాన్ గ్రూప్స్ క్రియేట్ అవుతున్నాయి. ఇక మరికొన్ని ప్రముఖ సర్వేలకు సంబంధించిన వివరాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక టాప్ 5లో ఓకే ఒక్క అమ్మాయి ఉండడం హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

టాప్ 5 కంటెస్టెంట్స్
ఓరామాక్స్ సర్వే గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ హీరో హీరోయిన్స్ ర్యాంక్స్ ను కాల్క్యులేట్ చేసే ఈ సంస్థ ఇప్పుడు బిగ్ బాస్ పోటీదారులపై ఫోకస్ చేసింది. డిజిటల్ మీడియా అలాగే సోషల్ మీడియా సర్వేలో ఎక్కువగా వైరల్ అయిన కంటెస్టెంట్స్ కు ప్రత్యేకంగా ఇస్తున్న ర్యాంక్స్ అభిమానులు ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఇక సెప్టెంబర్ 5 నుంచి 9వ తేదీ మధ్యలో ఎక్కువగా వైరల్ అయిన టాప్ 5 కాంటెస్టెంట్స్ కు ర్యాంక్స్ ఇచ్చారు.

మొదటి స్థానంలో
బిగ్ బాస్ హౌస్ లో ఈ సీజన్లో అందరికంటే ఎక్కువగా పాపులర్ సెలబ్రిటీ లిస్టులో అయితే సింగర్ రేవంత్ అన్నాడు. అతను ఇదివరకే కొన్ని సింగింగ్ కాంపిటీషన్స్ ద్వారా ప్రేక్షకులను మంచి గుర్తింపును అందుకున్నాడు. ఇక బిగ్ బాస్ షోలో అతను ఆగ్రేషన్ తో ముందుకు వెళుతున్నప్పటికీ కూడా బాగానే ఆకట్టుకుంటున్నాడు. కోపంగా మాట్లాడిన కరెక్ట్ పాయింట్ మాట్లాడుతున్నాడు అని జనాలు సపోర్ట్ చేస్తున్నారు. అతనికి ఓట్లు కూడా గట్టిగానే పడ్డాయి. ఇక ఈ సర్వేలో అయితే అతను మొదటి స్థానంలో ఉన్నాడు.

రెండవ స్థానంలో
ఇక రెండవ స్థానంలో అందరూ ఊహించినట్లుగానే శ్రీహాన్ కొనసాగుతున్నాడు. శ్రీహాన్ హౌస్ లో మొదటి రోజు నుంచి కూడా చాలా సింపుల్ గా ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నాడు. ఎవరితోనో ఎక్కువగా వివాదాలు తెచ్చుకోకుండా ఆచితూచి అడుగు వేస్తున్నాడు. ఇంకా అసలైన ఆటం మొదలు కాలేదు కాబట్టి ఇప్పటివరకు అయితే అతను ఇతరులకు శత్రువుగా అయితే నిలవలేదు. ఇక ఆడియన్స్ మద్దతుతో అతను ఈ సర్వేలో అయితే రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు.

ఆదిరెడ్డి, చలాకీ చంటి
ఇక బిగ్ బాస్ రివ్యూల ద్వారా క్రేజ్ అందుకుని కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన ఆదిరెడ్డి టాస్క్ లో అయితే బాగానే నిలదొక్కుకునేలా ఉన్నాడు. ఎవరు అతనికి పోటీగా వచ్చినా కూడా దీటుగా ముందుకు వెళుతున్నాడు. అందుకే అతని పేరు సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతుంది. ఇక అతను ఈ సర్వేలో మూడవ స్థానంలో కొనసాగుతున్నాడు. కమెడియన్ జబర్దస్త్ చంటి సింపుల్ గానే పెద్దగా గొడవలు పెట్టుకోకుండా కొనసాగుతున్న విధానం ఓ వర్గం వారిని ఆకట్టుకుంటోంది. దీంతో అతను 4వ స్థానంలో ఉన్నాడు.

ఒక్క అమ్మాయి మాత్రమే
అయితే ఈ సర్వేలో కేవలం ఒకే ఒక అమ్మాయి పేరు ఉండడం హాట్ టాపిక్ గా మారింది. మిగతా అమ్మాయిలు అనవసరంగా గొడవలు పెట్టుకుంటున్నారు తప్ప ఎలిమినేషన్స్ లో కరెక్ట్ పాయింట్స్ మాట్లాడటం లేదు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇక నేహా చౌదరి మాత్రమే ఇప్పుడున్న అమ్మాయిలలో బెస్ట్ కంటెస్టెంట్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఓరామ్యాక్స్ సోషల్ మీడియా సర్వే ప్రకారం ఆమె ఐదవ స్థానంలో కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications











