Ormax Popular Tv Stars: టాప్ లిస్టులో జబర్దస్త్ టీమ్.. యాంకర్ ప్రదీప్ కంటే వారికే క్రేజ్ ఎక్కువ..
ఇటీవల కాలంలో టెలివిజన్ సెలబ్రెటీలకు కూడా మంచి క్రేజ్ అందుతోంది. రియాల్టీ షోలతో కూడా మరికొందరు వారి రేంజ్ ను పెంచుకుంటున్నారు. ఇక దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో టాప్ స్టార్స్ కు ర్యాంక్స్ ఇస్తున్న ఓరామ్యాక్స్ టెలివిజన్ వ్యక్తులకు కూడా ర్యాంక్స్ ఇస్తోంది. ఇక తెలుగులో ఫిబ్రవరి నెలకు చెందిన మోస్ట్ పాపులర్ నాన్ ఫిక్షనల్ వ్యక్తుల లిస్టును విడుదల చేశారు. ఇక అందులోని టాప్ 5 ర్యాంక్స్ అందుకున్న సెలబ్రెటీల వివరాల్లోకి వెళితే..

మొదటి స్థానంలో ఆది
ఓరామ్యాక్స్ తెలుగు టెలివిజన్ మోస్ట్ పాపులర్ నాన్-ఫిక్షన్ పెర్సొనలిటిస్ లిస్టులో మొదటి స్థానంలో హైపర్ ఆది ఉన్నారు. గత కొంతకాలంగా ఆది కేవలం కామెడీ షోలతో మాత్రమే కాకుండా సినిమాలు కూడా బాగానే చేస్తున్నాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా తన రేంజ్ ను మరో లెవెల్ కు పెంచుకున్న ఆది ఈ సర్వేలో మొదటి స్థానంలో అందుకున్నాడు.

గెటప్ శ్రీను 2వ స్థానం
ఆది తరువాత మరో జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను ఓరామ్యాక్స్ లిస్టులో ఈసారి రెండవ ర్యాంక్ అందుకోవడం విశేషం. శ్రీను జబర్దస్త్ ప్రపంచానికి కాస్త గ్యాప్ ఇచ్చినప్పటికీ ఏదో ఒక విధంగా అతని పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఇక అతని ఇప్పుడు సినిమాల్లో కూడా బాగానే అవకాశాలు అందుకుంటున్నాడు. మొత్తానికి శ్రీను ఓరామ్యాక్స్ లిస్టులో టాప్ లో నిలవడం విశేషం.

3వ స్థానంలో ప్రదీప్
గెటప్ శ్రీను తరువాత టాప్ లిస్టులో 3వ స్థానంలో ఫేమస్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు నిలిచాడు. ప్రదీప్ ఇప్పుడు ఢీ షో మాత్రమే చేస్తున్నప్పటికీ అతనికి క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. అలాగే సినిమాల్లో హీరోగా కూడా నిరూపించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇప్పుడు ఓరామ్యాక్స్ సర్వేలో ప్రదీప్ 3వ ర్యాంక్ తో కొనసాగుతున్నాడు.

సుధీర్ 4వ స్థానంలో
ఇక ఓరామ్యాక్స్ సర్వేలో మరోసారి జబర్దస్త్ కమెడియన్ సుధీర్ కూడా టాప్ 5 లిస్టులో చోటు సంపాదించుకున్నాడు. అతను జబర్దస్త్, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ షోల ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. ఇక రీసెంట్ గా సుధీర్ సినిమాలలో హీరోగా కూడా బిజీ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే గాలోడు అనే సినిమాతో హిట్ అందుకున్నాడు. ఇక మొత్తానికి ఈసారి ఓరామ్యాక్స్ లో అతనికి 4వ ర్యాంక్ దక్కింది.

రామ్ ప్రసాద్ కూడా.
.
మోస్ట్ పాపులర్ టెలివిజన్ స్టార్స్ లో ఈసారి రామ్ ప్రసాద్ కూడా తన సత్తా చాటుకున్నాడు. ఇంతవరకు అతనికి పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ఈసారి సర్వేలో అతను మంచి క్రేజ్ అందుకున్నట్లుగా తేలింది. జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ షో ల ద్వారా మంచి క్రేజ్ అందుకున్నటువంటి రామ్ ప్రసాద్ ఈసారి ఈ సర్వేలో 5వ ర్యాంక్ తో తన క్రేజ్ మరింత పెంచుకున్నాడు. ఇక రాబోయే రోజుల్లో ఈ లిస్టులో మరి కొంతమంది టెలివిజన్ స్టార్స్ గట్టి పోటీని ఇచ్చే అవకాశం అయితే ఉంది.


Click it and Unblock the Notifications











