యాంకర్లను వెనక్కి నెట్టిన కమెడియన్లు.. అందరుమెచ్చిన బుల్లితెర నటుల్లో టాప్ 5 వీళ్లే!
ప్రముఖ ఆర్మాక్స్ మీడియా సంస్థ గురించి దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలు అందరికీ తెలిసిందే. ఎప్పటిప్పుడు టీవీ సెలబ్రిటీలు, హీరో, హీరోయిన్లు, సినిమాలు, వెబ్ సిరీస్ లపై సర్వేలు నిర్వహిస్తూ ఉంటుంది. ఏవి ట్రెండింగ్ లో ఉన్నాయి టాప్ 10లో ఎవరెరున్నారు, టాప్ 10లో ఎలాంటి సినిమాలు ఉన్నాయి అనే వాటిపై సర్వే చేస్తుంటారు. అయితే తాజాగా ఆర్మాక్స్ మీడియా సంస్థ తాజాగా ఓ సర్వే చేసింది. తెలుగు బుల్లితెర నటుల్లో ఎవరికి ఎక్కువ క్రేజ్ ఉందని... సర్వే జరపగా.. ఎక్కువ మంది వారికే ఓట్లు వేశారు.
ముఖ్యంగా అందరినీ ఎంటర్ టైన్ చేస్తూ ఎప్పుడూ కనిపించే యాంకర్ల కంటే కూడా కడుపుబ్బా నవ్వించే కమెడియన్లే టాప్ లో నిలిచారు. 2024 ఫిబ్రవరి నెలకు సంబంధించిన తెలుగు టెలివిజన్ నాన్ ఫిక్షనల్ పర్సనాలిటీస్ జాబితాలో ముగ్గురు కమెడియన్లు టాప్ 3లో నిలవగా.. మిగతా ఇద్దరు యాంకర్లు చివరి స్థనాల్లో నిలించారు. ఆ టాప్ లిస్టులో ఉన్న వాళ్లు ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

అందురు మెచ్చిన బుల్లితెర నటుల్లో టాప్ లో కమెడియన్ హైపర్ ఆది ఉన్నాడు. ఆర్మాక్స్ సంస్థ నిర్వహించిన ఈ సర్వేలో.. ఎక్కువ సార్లు టాప్ 1 పొజిషన్ దక్కించుకుంది ఈయనే. జబర్దస్త్ షోలో ఓ టీమ్ మెబర్ గా కెరియర్ ప్రారంభించిన హైపర్ ఆది.. ఆ తర్వాత టీమ్ లీడర్ గా మారిపోయాడు. ఆ తర్వాత నుంచి ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ, పలు ఈవెంట్స్, చివరకు సినిమాల్లో కూడా కనిపిస్తూ తెగ అలరిస్తున్నాడు. అనేక షోలలో యాంకర్ గా కూడా కనిపిస్తూ రచ్చ చేస్తున్నాడు.
ఇక టాప్ 2లో ఇక టాప్ 2లో సుడిగాలి సుధీర్ నిలిచాడు. ఈయన కూడా జబర్దస్త్ షోలో టీమ్ మెంబర్ గా వచ్చి టీమ్ లీడర్ అయ్యాడు. ఆ తర్వాత యాంకర్ గా మారి సందడి చేశారు. ఓవైపు ఇవన్నీ చేస్తూనే.. మరోవైపు సినిమాల్లో హీరోగా కూడా చేస్తూ కెరియర్ లో దూసుకెళ్తున్నాడు. ఇలా బుల్లితెరపై అటు సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తూ తెలుగు ప్రేక్షకులను ఎప్పుడూ అలరిస్తూ ట్రెండింగ్ లోనే ఉంటున్నాడు. ఇక టాప్ 3లో జబర్దస్త్ కమెడియన్ రాం ప్రసాద్ నిలిచాడు.

ఈయన కూడా జబర్దస్త్ షోలో కమెడియన్ గా చేరి ఆపై టీం లీడర్ గా మారాడు. ఇప్పుడు అనేక షోలు చేస్తున్న ఈయన సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. విపరతీమైన క్రేజ్ అందుకుని బుల్లితెర నటులకు చేరవయ్యాడు. అలాగే టాప్ 4 స్థానంలో జబర్దస్త్ షో యాంకర్.. హాట్ అండ్ బోల్డ్ బ్యూటీ యాంకర్ రష్మి గౌతమ్ నిలిచింది. ఈ షో ద్వారానే తన కెరియర్ ప్రారంభించిన ఈమె.. ప్రస్తుతం అనేక షోలు చేస్తుంది. ముఖ్యంగా సినిమాల్లో కూడా నటిస్తూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటుంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గర అయి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
ఇక చివరి స్థానంలో అంటే టాప్ 5లో యాంకర్ ప్రదీప్ ఉన్నాడు. యాంకర్ గా కెరియర్ ప్రారంభించిన ఈయన అనే షోలకు హోస్ట్ గా చేశాడు. అలాగే పలు సినిమాల్లో కూడా నటించి మెప్పించాడు. ప్రస్తుతం కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతగానో ఇష్టపడే యాంకర్ గా దూసుకెళ్తున్నాడు. అద్భుతమైన కామెడీ, స్పాంటెనియస్ తో అందరినీ అలరిస్తున్న ఈయన టాప్ లోకి నిలవడంతో అంతా తెగ ఖుషీ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











