Pallavi Prashanth: బిగ్ బాస్ దెబ్బకి టాప్ 3కి పల్లవి ప్రశాంత్... టాప్ 1 స్థానంలో ఎవరున్నారంటే?
ప్రముఖ ఆర్మాక్స్ మీడియా సంస్థ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆర్మాక్స్ ఎప్పటి కప్పుడు దేశ వ్యాప్తంగా సినీ తారలపై సర్వేలు నిర్వహిస్తుందనే విషయం తెలిసిందే. అయితే తాజాగా అక్టోబర్ నెలకు సంబంధించిన తెలుగు టెలివిజన్ నాన్ ఫిక్షనల్ పర్సనాలిటీస్ జాబితాను రిలీజ్ చేసింది. ఇక అందులో బిగ్ బాస్ హౌస్ లోకి కామన్ మ్యాన్ గా అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ టాప్ 3లోకి వచ్చేశాడు. ఇక టాప్ 1 స్థానంలో ఎవరు ఉన్నారు... మిగతా స్థానాల్లో ఎవరు ఉన్నారు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ప్రముఖ ఆర్మాక్స్ మీడియా సంస్థ ఎప్పటి కప్పుడు దేశ వ్యాప్తంగా సినీ తారలపై సర్వేలు నిర్వహిస్తూ ఉంటుంది. తాజాగా మరో సర్వే నిర్వహించింది ఈ సంస్థ. అక్టోబర్ నెలకు సంబంధించి.. తెలుగు టెలివిజన్ నాన్ ఫిక్షనల్ పర్సనాలిటీస్ జాబితాను రిలీజ్ చేసింది. అత్యంత ప్రజాదరణ పొందిన నాన్ ఫిక్షన్ పర్సనాలిటీలు లిస్టులో టాప్ 5 జాబితాను చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. మొన్నటి వరకు ఎవరో తెలియని పల్లవి ప్రశాంత్.. ఆ జాబితాలో టాప్ 3లో నిలిచారు.

యూట్యూబ్ లో వీడియోలు చేసుకుంటూ.. కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడు పల్లవి ప్రశాంత్. అతనికి టీవీ సెలబ్రేటీలు ఎలా ఉంటారో తెలియదు.. యాక్టింగ్ రాదు... డ్యాన్స రాదు.. ఓ రైతు బిడ్డగా బిగ్ బాస్ తెలుగు 7లోకి అడుగుపెట్టాడు. ఒక సామాన్యుడికి అలాంటి హౌస్ లో స్థానం దక్కడం ఓ గోప్ప విషయం. ఇప్పుడు తెలుగు టెలివిజన్ నా పిక్షనల్ పర్సనాలిటీల లిస్టులో టాప్ 3 స్థానం దక్కడం మరో గొప్ప విషయం. సామాన్యుడిగా వచ్చి... సెలబ్రేటీగా మారిపోయాడు పల్లవి ప్రశాంత్.
ఇక పల్లవి ప్రశాంత్... బిగ్ బాస్ హౌస్ లో తనదైన శైలిలో ఆడుతూ ప్రజల మెప్పు పొందుతున్నాడు. ఈ సారి సీజన్ విన్నర్ అవుతారని అంటున్నారు. బిగ్ బాస్ షో నిర్వాహకులు సైతం ఓ కామన్ మ్యాన్ కు విన్నర్ టైటిల్ ఇస్తే.. షోకు పాపులారిటీ పెరుగుతుందని అంటున్నారు. అంతే కాదు.. బయట సర్వేల్లో కూడా ప్రశాంత్ కు చాలా పాపులారిటీ వచ్చింది. పల్లవి ప్రశాంత్ క్రేజ్ పెరిగిందనడానికి ఈ ఆర్మాక్స్ సర్వే కూడా ఓ ఉదహరణ.

ఇక ఆర్మాక్స్ నిర్వహించిన సర్వేలో టాప్ 1లో హైపర్ ఆది నిలిచాడు. జబర్దస్త్ షోలో ఓ టీమ్ సభ్యుడిగా ఎంటర్ అయి.. ఆ తర్వాత టీమ్ లీడర్ గా ఎదిగాడు హైపర్ ఆది. ఇక ఆ తర్వాత ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ, పలు ఈవెంట్స్ తో తన పంచులు, తన మార్క్ కామెడీతో క్రేజ్ కొట్టేశాడు. ఇక టీవీ షోస్ లోనే కాకుండా.. సినిమాల్లోనూ తనదైన కామెడీతో అలరిస్తున్నాడు. ఇక హైపర్ ఆది టాప్ 1 స్థానం కైవసం చేసుకోగా... టాప్ 2 స్థానంలో సుడిగాలి సుధీర్ ఉన్నాడు.
సుడిగాలి సుధీర్ కూడా జబర్దస్త్ నుంచి ప్రస్థానం సాధించి.. సినిమా హీరోగా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం సుధీర్ సినిమాల్లో హీరోగా చెస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక టాప్ 3లో పల్లవి ప్రశాంత్, టాప్ 4లో సునామి సుధాకర్ ఉన్నారు. సునామి సుధాకర్ కూడా జబర్దస్త్ నుంచే వచ్చాడు. ఇక టాప్ 5లో శేఖర్ మాస్టర్ నిలిచాడు. ఆయన ఢీ అనే డ్యాన్స్ షో నుంచి వచ్చి.. ఆ షోకి జడ్జ్ గా మారి.. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్టు పాటలకు కొరియోగ్రాఫర్ గా చేశాడు. అవండి ఆర్మాక్స్ సంస్థ రిలీజ్ చేసిన తెలుగు నాన్ ఫిక్షనల్ పర్సనాలిటీ లిస్ట్.


Click it and Unblock the Notifications











