నా బాడీలో ఆ పార్ట్ కొలతలు అడిగాడు.. స్టార్ డైరెక్టర్‌పై నటి షాకింగ్ కామెంట్స్

మోడల్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, నటి మౌనీషా చౌదరి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మోడలింగ్ నుంచి సినిమాల వరకు తన ప్రయాణంలో ఎదురైన చేదు అనుభవాలను బయటపెట్టింది. ముఖ్యంగా చిన్న వయసులోనే సినిమా అవకాశాల పేరుతో ఎదుర్కొన్న అసభ్యకర ప్రశ్నలు తనలో ఇండస్ట్రీపై భయాన్ని పెంచాయని ఆమె వెల్లడించారు. ఒక స్టార్ డైరెక్టర్‌తో పాటు మరికొన్ని ఆడిషన్ల సమయంలో ఎదురైన పరిస్థితులను వివరిస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మౌనీషా చౌదరి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో మాట్లాడుతూ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో తన వీడియోలపై చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారని, తాను చేసే పనులపై కౌంటర్లు వేస్తూ నవ్వుకుంటున్నారని చెప్పారు. అయితే అలాంటి విమర్శలను పెద్దగా పట్టించుకోనని, తనకు నచ్చిన పని తాను చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. "జనం నవ్వుతున్నారు... ఎంజాయ్ చేస్తున్నారు... కింద కామెంట్లు పెడుతున్నారు. అది వారి ఇష్టం. కానీ నేను చేయాల్సింది మాత్రం చేస్తాను" అంటూ తన ధోరణిని వెల్లడించారు.

Mouneesha Chowdary Alleges Casting Couch Star Director Asked Body Measurements for Movie Offer

ఇక తన మోడలింగ్ కెరీర్ గురించి కూడా ఆసక్తికర విషయాలు చెప్పారు. అమెరికాలోనే తన కెరీర్ ప్రారంభమైందని, దాదాపు ఎనిమిదేళ్ల పాటు అమెరికన్ బ్రాండ్స్‌కు మోడల్‌గా పనిచేశానని తెలిపారు. న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ వంటి ప్రతిష్టాత్మక ఈవెంట్లలో ర్యాంప్ వాక్ చేశానని, బిల్‌బోర్డ్స్‌పై తన ఫొటోలు కనిపించాయని చెప్పారు. అలాగే అమెజాన్ వంటి అంతర్జాతీయ సంస్థల కోసం కూడా పలు ప్రకటనల్లో నటించినట్లు వెల్లడించారు.

"మోడలింగ్ అంటే పాత్రకు తగిన దుస్తులు ధరించాల్సిందే. అది నా వృత్తి. ఆ సమయంలో అవసరమైన అన్ని రకాల కాస్ట్యూమ్స్ వేసుకున్నాను. అందులో ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు" అని మౌనీషా చెప్పారు. అయితే తెలుగులో కూడా అలాంటి దుస్తులు ధరించాల్సి వస్తే ఒప్పుకుంటారా? అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. "ప్రస్తుతం నన్ను హీరోయిన్‌గా తీసుకుంటారంటే అదే పెద్ద కామెడీ. కానీ మన బాడీ ఫిట్‌గా ఉంటే ఎలాంటి డ్రస్ వేసుకున్నా కాన్ఫిడెంట్‌గా కనిపించొచ్చు. ఫిట్‌నెస్ అనేది వ్యక్తిగత విషయం. మీరు మీను ఎలా ప్రజెంట్ చేసుకుంటారనేదే ముఖ్యమని నేను నమ్ముతాను" అని వివరించారు.

తనకు ఇష్టమైన హీరో గురించి అడగగా ఎలాంటి సందేహం లేకుండా ప్రభాస్ పేరు చెప్పారు. "చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి సినిమాలు ఎక్కువగా చూసేదాన్ని. కానీ ఇప్పుడు ప్రభాస్ అంటే చాలా ఇష్టం. నిజానికి నేను మొత్తం టాలీవుడ్‌కు అభిమానిని. అందరి సినిమాలు చూస్తుంటాను" అని అన్నారు. ఇక హీరోయిన్లలో శ్రీలీల అంటే చాలా ఇష్టమని చెప్పారు. "మా ఫ్రెండ్స్ చాలా మంది శ్రీలీలకు నాకు పోలికలు ఉన్నాయని అంటుంటారు. ఆమెతో కలిసి ఒక యాడ్‌లో నటించాలని కోరిక ఉంది" అంటూ తన మనసులోని కోరికను బయటపెట్టారు.

సినిమా అవకాశాల గురించి మాట్లాడుతూ మౌనీషా మరో ఆసక్తికర విషయం చెప్పారు. కాలేజ్‌లో చదువుతున్న రోజులలోనే తనకు తెలుగు సినిమాల నుంచి అవకాశాలు వచ్చాయని, అయితే కుటుంబ సభ్యులు అప్పుడు సినిమాల్లోకి వెళ్లడానికి అంగీకరించలేదని తెలిపారు. "మా నాన్న అసలు ఒప్పుకోలేదు. ఇండస్ట్రీలో అడుగుపెడితే కాళ్లు విరగ్గొడతామని కూడా అన్నారు. ఆ తర్వాత నేను అమెరికా వెళ్లిపోయాను. కానీ చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలనే కోరిక మాత్రం ఎప్పుడూ ఉండేది. అదే నన్ను మోడలింగ్ వైపు తీసుకెళ్లింది" అని చెప్పారు.

ఇటీవల కూడా రెండు మూడు తెలుగు సినిమాల్లో అవకాశాలు వచ్చాయని వెల్లడించిన మౌనీషా, వాటిని అంగీకరించడానికి మాత్రం భయపడ్డానని చెప్పారు. "నటించాలంటే యాక్టింగ్ రావాలి కదా" అంటూ సరదాగా చెప్పినా, ఆ మాట వెనుక ఉన్న అసలు కారణాన్ని తర్వాత బయటపెట్టారు. విశ్వక్ సేన్ నటిస్తున్న ఓ భారీ బడ్జెట్ చిత్రంలో కూడా అవకాశం వచ్చినట్లు ఆమె వెల్లడించారు. అయితే ధైర్యం చేయలేక ముందుకు వెళ్లలేదని చెప్పారు.

ఈ సందర్భంగా తన చిన్న వయసులో ఎదురైన ఓ చేదు సంఘటనను గుర్తు చేసుకున్నారు. "నాకు 16-17 ఏళ్లు ఉన్నప్పుడు ఒక వ్యక్తి సినిమా అవకాశం గురించి మాట్లాడటానికి ఓ స్టార్ డైరెక్టర్ వచ్చాడు. ముందుగా సినిమాల్లో నటించాలని ఉందా అని అడిగాడు. నేను సమాధానం చెప్పేలోపే, 'నీ బాడీ సైజ్ ఎంత? నీ తొడల సైజ్ ఎంత?' అంటూ అసభ్యకరంగా ప్రశ్నించాడు. ఆ ఒక్క సంఘటనతోనే సినిమా ఇండస్ట్రీ అంటే భయపడిపోయాను నటన గురించి అడగకుండా శరీర కొలతల గురించి ఎందుకు అడుగుతారు? అప్పటి నుంచి ఆ భయం నా మనసులో ఉండిపోయింది" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంకో సందర్భంలో ఇండియా టూరిజంకు సంబంధించిన ప్రకటన పేరుతో తనను ఆడిషన్‌కు పిలిచారని చెప్పారు. మొదట అది ప్రభుత్వానికి సంబంధించిన బ్రాండ్ అంబాసిడర్ ఎంపిక అనుకుని వెళ్లేందుకు సిద్ధమయ్యానని తెలిపారు. అయితే మరుసటి రోజు ఫోన్ చేసి "మినీ స్కర్ట్ వేసుకుని రండి" అని చెప్పడంతో తాను ఆశ్చర్యపోయానన్నారు. "ఇండియా టూరిజం ప్రకటనకు మినీ స్కర్ట్‌కు సంబంధం ఏమిటి? హీరోయిన్ కావాలంటే బాడీ మెజర్‌మెంట్స్ ఎందుకు? యాక్టింగ్ వచ్చా లేదా అని అడగండి. అంతే కానీ ఇలాంటి ప్రశ్నలు ఎందుకు?" అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

సినిమా అవకాశాల పేరుతో కొంతమంది అనుచితంగా ప్రవర్తించడం వల్లే తాను ఇండస్ట్రీకి దూరంగా ఉన్నానని మౌనీషా వెల్లడించారు. అయితే తనకు నటనపై ఆసక్తి ఇప్పటికీ తగ్గలేదని, సరైన అవకాశం వస్తే భవిష్యత్తులో సినిమాల్లో నటించడానికి సిద్ధమేనని తెలిపారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.

Read more about: casting couch sreeleela prabhas
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X