Bigg Boss: ఆదివారం ఎపిసోడ్‌లో స్పెషల్ గెస్ట్.. నాగార్జునతో సందడి చేయనున్న తొలి పొలిటీషియన్

అసలు అంచనాలు లేకుండానే వచ్చినా.. సరికొత్త కాన్సెప్టే అయినా.. తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు అందుకున్న ఏకైక షో బిగ్ బాస్. రికార్డు స్థాయిలో టీఆర్పీని అందుకుంటోన్న ఇది సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఇక, ప్రస్తుతం నడుస్తోన్న ఐదో సీజన్ సైతం అదే రీతిలో స్పందనను అందుకుంటోంది. ఫలితంగా మంచి రేటింగ్‌ను కూడా రాబడుతోంది. ఫినాలేకు సమయం దగ్గర పడడంతో ఈ ఆదివారం జరగనున్న ఎపిసోడ్‌లో ఊహించని సంఘటలు జరిగాయని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈరోజు ఎపిసోడ్‌కు ఓ రాజకీయ నాయకుడు స్పెషల్ గెస్టుగా ఎంట్రీ ఇస్తున్నారట. ఇంతకీ ఎవరాయన? ఆ సంగతులు మీకోసం!

టాప్ - 5ను నిర్ణయించే ఎపిసోడ్

టాప్ - 5ను నిర్ణయించే ఎపిసోడ్

బిగ్ బాస్ ఐదో సీజన్ ఫినాలే డిసెంబర్ 19న జరగబోతుంది. ఈ నేపథ్యంలో ఈ ఆదివారం జరగనున్న ఎపిసోడ్‌లో ఒకరు ఎలిమినేట్ అవుతారు. ఇక, మిగిలిన వాళ్లంతా ఫినాలేలో అడుగు పెడతారు. ఇప్పటికే టికెట్ టు ఫినాలే ద్వారా శ్రీరామ్, నిన్నటి ఎపిసోడ్‌లో సన్నీ ఫైనల్‌కు చేరుకున్నారు. ఇప్పుడు సిరి, షణ్ముఖ్, మానస్, కాజల్‌లలో ముగ్గురు మాత్రమే టాప్ 5లోకి వెళ్తారు.

ఆమె ఎలిమినేట్ అయిందంటూ

ఆమె ఎలిమినేట్ అయిందంటూ

14వ వారానికి సంబంధించిన ఓటింగ్‌లో సన్నీ టాప్‌లో నిలిచి ఫినాలేకు చేరాడు. ఇక, షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్, మానస్, ఆర్జే కాజల్‌లలో ఎవరు ఫినాలేకు చేరుకుంటారు? ఎవరు ఎలిమినేట్ అవుతారు? అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక, ఈ వారానికి సంబంధించి ఆర్జే కాజల్ ఎలిమినేట్ అయిపోయినట్లు ఇప్పటికే లీకులు కూడా వచ్చేశాయి కూడా.

ఎలిమినేషన్ టెన్షన్ లేకుండానే

ఎలిమినేషన్ టెన్షన్ లేకుండానే

ఈ రియాలిటీ షోలో ప్రతి ఆదివారం ప్రసారం అయ్యే ఎపిసోడ్స్ ఆటపాటలతో ఫన్నీగా సాగుతుంటాయి. ఆరోజు చివర్లో ఎలిమినేషన్ ఉన్నప్పటికీ.. దానికి ముందు కంటెస్టెంట్లలో టెన్షన్ పోగొట్టేందుకు నిర్వహకులు అదిరిపోయే ఆటపాటలను ప్లాన్ చేస్తారు. దాన్ని అక్కినేని నాగార్జున.. హౌస్‌లో ఉన్న వాళ్లతో ఆడిస్తుంటాడు. ఇలా సండే ఎపిసోడ్‌ మొత్తాన్ని ఫన్‌తో సాగిస్తుంటారు.

ఫన్‌డేగా మార్చేందుకు ఆటలతో

ఫన్‌డేగా మార్చేందుకు ఆటలతో

ఈ ఆదివారం అంటే నేడు ప్రసారం కాబోతున్న బిగ్ బాస్ ఎపిసోడ్ కూడా ఎంతో ఫన్నీగా సాగుతుందని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇందులో హౌస్‌మేట్స్ అందరితో హోస్ట్ నాగార్జున పలు రకాలగేమ్స్ ఆడించాడని తెలుస్తోంది. అంతేకాదు, చివర్లో ఎంతో టెన్షన్ పెట్టి ఒకరిని ఎలిమినేట్ చేయబోతున్నారట. దీంతో ఈ ఎపిసోడ్‌పై అందరూ ఆసక్తికరంగా ఎదరు చూస్తున్నారు.

ఈరోజు ఎపిసోడ్‌లో స్పెషల్ గెస్ట్

ఈరోజు ఎపిసోడ్‌లో స్పెషల్ గెస్ట్

టాప్ -5 కంటెస్టెంట్లను నిర్ణయించే ఎపిసోడ్ కావడంతో ఆదివారం బిగ్ బాస్ షో ఎంతో ఆసక్తికరంగా సాగబోతుందని తెలుస్తోంది. ఇందులో ఆటపాటలతో పాటు కొన్ని సర్‌ప్రైజ్‌లు కూడా ఉండబోతున్నాయని అంటున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు ఎపిసోడ్‌లో ఓ స్పెషల్ గెస్ట్ బిగ్ బాస్ స్టేజ్‌పై హోస్ట్ నాగార్జునతో కలిసి సందడి చేయనున్నారని ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

నాగార్జునతో తొలి పొలిటీషియన్

నాగార్జునతో తొలి పొలిటీషియన్

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈరోజు (ఆదివారం) ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌లో తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ బిగ్ బాస్ షోలోకి స్పెషల్ గెస్టుగా ఎంట్రీ ఇస్తున్నారట. ఇందులో హోస్ట్ అక్కినేని నాగార్జునతో కలిసి ఆయన కంటెస్టెంట్లను పలకరించబోతున్నారట. దీంతో ఈ ఎపిసోడ్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌తో పేరు

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌తో పేరు

దేశంలో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అనే ముఖ్య ఉద్దేశంతో 2018, జూలై 17న జోగినపల్లి సంతోష్ కుమార్ 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనికి దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కింది. ఇందులో ఎంతో మంది సెలెబ్రిటీలు భాగమై.. మొక్కలు నాటిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X