ఆ నటుడిపై మనసుపడ్డ నటి... ఒప్పుకోకపోతే తల పగలగొడతానంటూ

సాధారణంగా సెట్‌‌లో నటీనటుల వ్యవహారాలు అప్పుడప్పుడూ బయటికొస్తుంటాయి. వారి సన్నిహితులో లేదంటో సినిమాలలో పనిచేసినవారో వీటిని బయటపెడుతుంటారు. చాలా వరకు మహిళా నటుల పట్ల హీరోలు ఇతర మేల్ యాక్టర్ల వేధింపులకు సంబంధించిన వార్తలే బయటికొచ్చేవి. అయితే ఈసారి నటుడిని ఇష్టపడ్డ నటి అతనికి గత కొన్నేళ్లుగా చుక్కలు చూపిస్తోంది. మాటలతో, చేతలతో హింసిస్తోందట. ఈ విషయాన్ని ఆ నటుడితో పాటు కలిసి పనిచేసిన హీరోయిన్ బయటపెట్టారు. దాంతో ఆ నటుడు ఎవరు? ఆ నటుడిని అంతగా వేధిస్తోన్న నటి ఎవరు? అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

బుల్లితెరపై స్టార్‌గా గుర్తింపు
మలయాళ బుల్లితెరపై స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు రాయ్‌జన్ రాజన్. 2003లో మకల్ సీరియల్‌తో ఎంట్రీ ఇచ్చిన ఆయన.. ఆ ఆర్వాత ఆత్మసాక్షి, ప్రియపెట్టావల్, బాటిల్ లాక్‌డౌన్, తిన్‌కల్‌కళామన్, భావన, ఇష్టం మథురం సీరియల్స్‌లో నటించారు. ఆత్మసాక్షి సీరియల్‌లో సత్యజిత్ ఐపీఎస్ క్యారెక్టర్‌ ఆయనకు బాగా గుర్తింపు తీసుకొచ్చింది. సినిమాలలో నటిస్తూనే సినీరంగంలోనిర్మాతగా అడుగుపెట్టారు. 2018లో విడదలైన జానీ జానీ ఎస్ పాప సినిమాకు రాజన్ నిర్మాతగా వ్యవహరిస్తూ నటించారు. ఇందులో మమతా మోహన్‌దాస్‌తో ఆయన రొమాన్స్ చేశారు.

Mridhula Vijai reveals Rayjan Rajan is being stalked by a junior artist

మోస్ట్ డిజైరబుల్ మెన్‌గా ఘనత
సినిమాలు, సీరియల్స్‌తో పాటు పలు షార్ట్ ఫిలింస్‌లోనూ రాజన్ నటించారు. బ్లాక్‌హోల్, 2 గన్స్, బాలాజీ షార్ట్ ఫిలింస్‌లలో నటించారు. 2018వ సంవత్సరానికి గాను మోస్ట్ డిజైరబుల్ మెన్ ఆన్ టెలివిజన్ అనే అవార్డ్‌ను అందుకున్నారు రాజన్. వీటితో పాటు మోడల్‌గా పలు టాప్ బ్రాండ్స్‌కు ప్రచారకర్తగా వ్యవహరించారు. కామెడీ సర్కాస్, తాకారప్పన్ కామెడీతో పాటు స్టార్ మేజిక్‌లో అరం+ అరం= కిన్నరమ్ అనే షోలలో పాల్గొన్నారు. ఆయనకు శిల్పతో గతంలోనే పెళ్లవ్వగా... రాజన్‌ను ఓ నటి గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్నట్లు ఆయనతో కలిసి సీరియల్‌లో నటిస్తోన్న మృదుల విజయ్ బయటపెట్టారు.

అశ్లీల సందేశాలతో వేధింపులు
తను ఓ జూనియర్ ఆర్టిస్ట్.. అప్పుడుప్పుడు సెట్‌కు వచ్చేది, ఆరేళ్ల నుంచి ఆమె రాజన్‌కు అశ్లీల సందేశాలతో కూడిన మెసేజ్‌లు చేస్తోంది. వాటికి ఆయన స్పందించకుంటే సైకోలో ప్రవర్తించేది. ఇతర నెంబర్ల నుంచి ఫోన్ చేసి బూతులు తిట్టేది. సెట్‌కు వచ్చి రాజన్‌తో మాట్లాడేందుకు ప్రయత్నిచంగా.. ఆయన వెళ్లిపోతుంటే చొక్కా పట్టుకుని లాగింది. రాజన్‌తో బలవంతంగా చాక్లెట్ తినిపించాలని చూసింది.. నన్ను పట్టించుకోకపోతే బీర్ బాటిల్‌తో బుర్ర పగలగొడతానని వార్నింగ్ ఇచ్చింది.

అమ్మాయికే సపోర్ట్ చేస్తారు
ఈ వేధింపులను పంటి బిగువున భరిస్తోన్న రాజన్... ఓ రోజున ఆ అమ్మాయిని మందలించి చూశాడు. ఇంత జరుగుతున్నా ఆ అమ్మాయి గురించి రాజన్ బయట పెట్టలేదు.. ఎందుకంటే ఆయన విషయం చెప్పిన మరుక్షణమే అందరూ ఆ అమ్మాయికే సపోర్ట్ చేస్తారు, రాజన్ చెప్పేది ఎవ్వరూ వినరు. రాజన్‌పై వేధింపులకు పాల్పడ్డ అమ్మాయిపై ఇటీవలే పోలీసులు కేసు పెట్టారు. అని మృదుల తెలిపారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు మలయాళ బుల్లితెర ఇండస్ట్రీలో కలకలం రేపింది. దీనిపై బుల్లితెర వర్గాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X