మిసెస్ సీరియల్ కిల్లర్‌పై భారీ దెబ్బ.. నెట్‌ఫ్లిక్స్‌కు సవాల్ విసిరిన తమిళ్ రాకర్స్

బాలీవుడ్ తారలు జాక్వలైన్ ఫెర్నాండేజ్, మనోజ్ బాజ్‌పేయ్ నటించిన వెబ్ సిరీస్ మిసెస్ సీరియల్ కిల్లర్ నెట్‌ప్లిక్స్‌లో ఇటీవల రిలీజైంది. అయితే ఈ సీరియల్‌ కంటెంట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మనోజ్ బాజ్‌పేయ్, జాక్వలైన్ ఫెర్ఫార్మెన్స్‌కు మంచి స్పందనే వచ్చింది.. కానీ బ్రహ్మండమైన టాక్‌ను కూడగట్టుకోలేకపోయింది. ఇదిలా ఉండగా ఈ వెబ్‌సిరీస్‌పై తమిళ్ రాకర్స్ పైరసీ దెబ్బ గట్టిగానే కొట్టింది. వివరాల్లోకి వెళితే..

మిసెస్ సీరియల్ కిల్లర్‌ కథ

మిసెస్ సీరియల్ కిల్లర్‌ కథ

మిసెస్ సీరియల్ కిల్లర్ కథ విషయానికి వస్తే.. డాక్టర్ మృత్యుంజయ్ ముఖర్జి అలియాస్ జాయ్ (మనోజ్ బాజ్‌పేయ్) ఓ గైనకాలజిస్ట్. ఆరుగురు గర్బవతులను టార్చర్ చేశారని, అబార్షన్ తర్వాత మహిళలను వేధించారనే ఆరోపణలు ఎదుర్కొంటారు. మత్యుంజయ్‌పై వచ్చిన నేరారోపణల నుంచి అతడిని కాపాడేందుకు ఆయన భార్యగా సోనా ముఖర్జి (జాక్వలైన్ ఫెర్నాండేజ్) ఏం చేశారనేది ఈ వెబ్ సిరీస్ కథ.

మనోజ్, జాక్వలైన్ గురించి

మనోజ్, జాక్వలైన్ గురించి

డాక్టర్ జాయ్‌గా మనోజ్ బాజ్‌పేయ్ ఫెర్ఫార్మెన్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకొంటున్నది. కొన్నిసార్లు ఆయన నటన హృదయాన్ని తట్టిలేపేలా ఉంది. జాక్వలైన్ నటనపరంగానే కాకుండా గ్లామర్ పరంగా కూడా రాణించిందనే మాట వినిపించింది. మోహత్ రైనా, దర్శన్ జరీవాలా, జైన్ మారీ పాత్రలకు కీలకంగా మారాయని చెప్పవచ్చు.

నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్‌గా

నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్‌గా

నెటిఫ్లిక్స్ ఒరిజినల్ ఫిల్మ్‌గా రూపొందిన మిసెస్ సీరియల్ కిల్లర్ వెబ్ సిరీస్‌లో తొలి భాగంలో ఎక్కువగా కథ, కథనాలు ఆకట్టుకొనేలా ఉన్నాయి. చివరి అరగంటలో సన్నివేశాలపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది. అయితే ఈ సిరీస్ హిట్ కావడమనేది కేవలం మనోజ్ బాజ్‌పేయ్, జాక్వలైన నటనా ప్రతిభ మాత్రమే సీరిస్‌ను నిలబెట్టగలదనే అభిప్రాయం వ్యక్తవుతున్నది.

విడుదల కాగానే తమిళ్ రాకర్స్ లీక్

విడుదల కాగానే తమిళ్ రాకర్స్ లీక్

కరోనా లాక్‌డౌన్ సమయంలో వచ్చిన మిసెస్ సీరియల్ కిల్లర్ వెబ్ సిరీస్‌కు పైరసీ వెబ్‌సైట్ తమిళ్ రాకర్స్ గట్టి దెబ్బనే వేసింది. ఈ సీరిస్‌కు సంబంధించిన కంటెంట్‌ను లీక్ చేసి వెబ్‌సైట్‌లో పెట్టి నెటిఫ్లిక్స్ సవాల్ విసిరింది. ఇప్పటికే సినీ విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్న నేపథ్యంలో తమిళ్ రాకర్స్‌లో పైరసీ బారిన పడటం భారీగానే నష్టం వాటిల్లే పరిస్థితి కనిపిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X