twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ద్రౌపది ఒంటిపై అలానా..? సంస్కృతిని మార్చడం కుదరదు.. ఏక్తా కపూర్‌పై ‘శక్తిమాన్’ సంచలన కామెంట్స్

    |

    బుల్లితెరపై సంచలనాలు నమోదు చేసిన ధారావాహికలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ఓ ముప్పై యేళ్ల క్రితం దూరదర్శన్ ఛానెల్‌లో వచ్చిన రామాయణ, మహాభారతం, శక్తిమాన్ వంటి సీరియల్స్ ఇప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి. అవి చూపిన ప్రభావం అలాంటిది. కరోనా వచ్చి ప్రపంచమంతా అల్లకల్లోలం అవుతోంటే.. ప్రజలంతా ఇంటి పట్టునే ఉండాలని ప్రభుత్వాలు ఆదేశించాయి. దీంతో ఇంటికే పరిమితమైన వారి కోసం నాటి స్మృతులను గుర్తు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నాటి సీరియల్స్‌ను పున: ప్రసారం చేస్తోంది.

    ప్రజల విజ్ఞప్తి మేరకు..

    ప్రజల విజ్ఞప్తి మేరకు..


    కరోనాను కట్టిడి చేసే భాగంలో దేశమంతా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఏప్రిల్ 14 వరకు ప్రజలంతా రోడ్లపైకి రాకూడదు. అందరికీ వినోధాన్ని పంచే ఉద్దేశ్యంలో ప్రజల డిమాండ్ మేరకు రామాయణ, మహాభారత గాథలను పున: ప్రసారం చేసింది. వీటితో పాటు 90ల కాలం నాటి పిల్లలకు హీరో అయిన శక్తిమాన్ సీరియల్‌ను కూడా ప్రసారం చేశారు.

     రికార్డు స్థాయిలో టీఆర్పీ..

    రికార్డు స్థాయిలో టీఆర్పీ..

    ప్రజలంతా ఇంటి పట్టునే ఉండటంతో ఈ సీరియల్స్ రికార్డు స్థాయిలో టీఆర్పీలు వచ్చాయని ప్రకటించారు. రామాయణ్ సీరియల్‌ను రెండు రోజుల్లో 8.5కోట్ల మంది వీక్షించారని లెక్కలు బయటకు వచ్చాయి. బుల్లితెరపై మళ్లీ అపురూప కావ్యాలుగా ఇవి రికార్డులు క్రియేట్ చేశాయి.

    ఏక్తా కపూర్‌పై ఫైర్..

    ఏక్తా కపూర్‌పై ఫైర్..

    బుల్లి తెర క్వీన్, స్టార్ ప్రొడ్యూసర్ అయిన ఏక్తా కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భాషలతో సంబంధం లేకుండా లెక్కకు మించిన సీరియల్స్‌ను నిర్మించి బుల్లితెరను శాసించింది. ఆమె తీసిన మోడ్రన్ భారతం కహానీ హమారే భారతం సీరియల్‌పై శక్తిమాన్ హీరో ముఖేష్ ఖన్నా నిప్పులు చెరిగాడు.

    Recommended Video

    Tollywood And Bollywood Celebrities Participated in Modi's 9 PM 9 Baje Light Lamps event
    సంస్కృతిని మార్చడం కుదరదు..

    సంస్కృతిని మార్చడం కుదరదు..

    తాను నటించిన శక్తిమాన్ సీరియల్‌ను మోడ్రనైజ్ చేసి ప్రసారం చేస్తున్నారని, ఈ సీరియల్ ఏక్తా కపూర్ మోడ్రన్ మహాభారతంలా.. ద్రౌపది ఒంటిపై టాటూలు వేసుకున్నట్టు చూపించమని సెటైర్ వేశాడు. ఆమె భారతాన్ని చంపేసిందని, సంస్కృతిని మార్చే హక్కు ఎవ్వరికీ లేదని, అసలు మార్చడం కుదరదని, మార్చాలని ప్రయత్నించిన రోజే అది చచ్చిపోయినట్టని ఏక్తా కపూర్‌పై ఫైర్ అయ్యాడు.

    English summary
    Shaktimaan Mukesh Khanna Fires On Ekta Kapoor. He Slammed Her That Sanskriti kabhi modern nahi ho sakti, putri. Jis din Sanskriti ko modern karoge, khatam ho jayegi
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X