అరియానా, హారిక కష్టాల ముందు నా సమస్యలు ఎంత.. అవినాష్ ఎమోషనల్
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో 75వ రోజు ఇంటి సభ్యుల మధ్య బిగ్‌బాస్ ఓ చర్చ పెట్టాడు. బిగ్‌బాస్‌కు వచ్చిన తర్వాత మీరు ఏం నేర్చుకొన్నారు అనే విషయంపై మాట్లాడమని కోరగా.. ఇంటి సభ్యులు తమ మనసులో మాటను పంచుకొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ... బిగ్‌బాస్ ఇంటిలో తన జీవిత అనుభవాలను చెప్పారు.

బిగ్‌బాస్ శిల్పి నన్ను అందంగా
బిగ్‌బాస్ ఇంటికి వచ్చిన తర్వాత నాలోని కోపం, ఆవేశాన్ని తగ్గించుకొన్నాను. కొన్ని విషయాలపట్ల కాంప్రమైజ్ అయితే నాలో అందమైన మనిషి ఉన్నారనే విషయాన్ని తెలుసుకొన్నాను. బిగ్‌బాస్ అనే శిల్పి.. నన్ను మరింత అందంగా చెక్కారు. ఈ క్షణం నుంచి ఎప్పుడైనా బయటకు వెళ్లినా నేను చాలా హ్యాపీగా బయటకు వెళ్తాను అని అరియానా ఎమోషనల్ అయ్యారు.

బిగ్‌బాస్ ధైర్యాన్ని ఇచ్చాడు..
బిగ్‌బాస్ ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత జీవితంలో ధైర్యంగా ఉండాలని నేర్చుకొన్నాను. నా జీవితంలో చాలా కష్టాలు, సమస్యలను ఎదుర్కొన్నాను. అయితే ఇంటిలోకి వచ్చిన తర్వాత అరియానా, హారిక, మోనాల్, లాస్య చెప్పిన వారి జీవిత అనుభవాలు, సమస్యలను ఎదురించిన తీరును చూసిన తర్వాత నా ఆలోచనను మార్చుకొన్నాను అని అవినాష్ తెలిపారు.

అరియానా, హారిక, మోనాల్ నాకు స్పూర్తి
అరియానా, హారిక, మోనాల్ తమ కుటుంబంలో ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ.. వారు ఈ స్థాయికి రావడానికి వాళ్లు పడిన కష్టం నాకు మరింత స్పూర్తిని ఇచ్చింది అని అన్నారు. ఆడపిల్లల్లే అందంగా ధైర్యంగా ఉన్నప్పుడు నేను ఎందుకు ఉండకూడదనే విషయాన్ని గ్రహించాను. వారిని నుంచి నేను ధైర్యంగా ఉండాలని నిర్ణయించుకొన్నాను అని అవినాష్ తెలిపారు

మీ ప్రేమకు కరిగిపోయాను అంటూ లాస్య
నా కుటుంబం చాలా పెద్దది. మా ఫ్యామిలీలో అందరూ నన్ను ఇష్టపడుతారు. కానీ ఇంటిలో వచ్చిన తర్వాత ఒక్కొక్కరి మైండ్ సెట్ చూసిన తర్వాత అందరితో కలువడానికి సమయం పట్టింది. ఆ తర్వాత నన్ను లాస్య అక్క అంటూ ప్రేమతో పిలుస్తుండటంతో హ్యాపీగా ఫీలయ్యాను. మీరు చూపిస్తున్న ప్రేమకు నేను కరిగిపోయాను. నా జీవితంలో ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయి. ఇప్పుడు ఇది కొత్త అనుభూతి అంటూ లాస్య చెప్పారు.


Click it and Unblock the Notifications











