జబర్దస్త్‌ నుంచి అవుట్.. అవమానాలు భరించి వచ్చా.. ఎలాంటి కష్టమైనా భరిస్తా.. ముక్కు అవినాష్

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో 9వ వారానికి ఎలిమినేషన్ కోసం జరిగిన ప్రక్రియలో ఇంటి సభ్యుల మధ్య ఆవేశాలు, భావోద్వేగాలు బయటపడ్డాయి. నామినేషన్ ప్రక్రియ నుంచి బయటపడటానికి జరిగిన టాస్క్‌లో అభిజిత్, అవినాష్, అమ్మా రాజశేఖర్, హారిక, మోనాల్‌ను తోటి కంటెస్టెంట్లు చిత్ర హింసకు గురిచేశారు. ఈ సందర్భంగా టాస్క్ అనంతరం అవినాష్ మాట్లాడుతూ...

ముఖం దాచుకో టాస్క్ సందర్భంగా

ముఖం దాచుకో టాస్క్ సందర్భంగా

ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి చేసిన నామినేషన్లలో అభిజిత్, అవినాష్, అమ్మా రాజశేఖర్, హారిక, మోనాల్ ఉన్నారు. నామినేషన్ నుంచి తప్పించుకోవడానికి ఓ అవకాశాన్ని ఇస్తున్నట్టు బిగ్‌బాస్ ప్రకటించారు. ముఖం దాచుకో టాస్క్‌లో ఇంటి సభ్యులు పెట్టే చిత్ర హింసలు తట్టుకొని ఎవరైతే చివరకు వరకు ఉంటారో ఆ కంటెస్టెంట్ నామినేషన్ నుంచి సేవ్ అవుతారని ప్రకటించాడు. అందుకు సిద్ధమై అనేక కష్టాలను అనుభవంచినా ఫలితం దక్కలేదు. టాస్క్ గడువు ముగిసే సరికి ఒకరి కంటే ఎక్కువగా ఉండటంతో ఆ ఆఫర్ రద్దు చేశారు.

ముఖంపై చెత్త, చెదారంతో దాడి

ముఖంపై చెత్త, చెదారంతో దాడి

ముఖం దాచుకో టాస్క్‌లో అవినాష్‌తోపాటు మిగితా సభ్యులందరి ముఖంపై చెత్త, చెదారం, షేవింగ్ ఫోమ్, ఐస్ వాటర్ లాంటివి ముఖంపైకి కొట్టారు. అయితే టాస్క్ అనంతరం అవినాష్ మాట్లాడుతూ.. చాలా కష్టంగా అనిపించింది. కానీ తప్పదు. బిగ్‌బాస్ హౌస్‌కు వచ్చే సమయంలో బయట ఎన్నో అవమానాలకు గురయ్యాను అంటూ తన బాధలను చెప్పుకొన్నారు.

జబర్దస్త్ గురించి ఇంటిలో

జబర్దస్త్ గురించి ఇంటిలో


నేను చేసే రియాలిటీ షో నిర్వాహకులు బిగ్‌బాస్‌లోకి రావడానికి ఒప్పుకోలేదు. వారితో అగ్రిమెంట్ ఉన్న కారణంగా బిగ్‌బాస్‌కు రావడానికి కష్టంగా మారింది. ఒక్కసారి వెళ్లిపోతే మళ్లీ తీసుకోమని చెప్పారు. అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోవడానికి చాలా కష్టాలు పడ్డాను. అవమానాలు భరించాను. ఇక్కడి నుంచి బయటకు వెళ్తే నాకు వేరే ఆప్షన్ లేదు అని అవినాష్ అన్నారు. గతంలో తాను ఆర్థిక కష్టాల్లో ఉన్నట్టు, సూసైడ్‌కు ప్రయత్నించినట్టు తెలిపిన విషయం తెలిసిందే.

బయట పరిస్థితులు అలా ఉన్నాయి అంటూ

బయట పరిస్థితులు అలా ఉన్నాయి అంటూ

ఇంటి బయట అలాంటి పరిస్థితులు ఉన్నావి కాబట్టి.. బిగ్‌బాస్‌లో రాణించడానికి చాలా కష్టపడుతున్నాను. ఎన్ని అవమానాలైనా భరించడానికి సిద్ధపడ్డుతున్నాను. ఎన్ని కష్టాలైనా భరిస్తాను అంటూ అవినాష్ తన బాధను సోహైల్‌తో పంచుకొన్నారు. టాస్క్ సందర్భంగా జరిగిన చర్యలతో అవినాష్ కళ్లు ఎరుపెక్కాయి. బాధను భరిస్తూ టాస్క్‌ను ఇతర సభ్యులతో కొనసాగించారు.

జబర్దస్త్ నుంచి బయటకు రావడంపై

జబర్దస్త్ నుంచి బయటకు రావడంపై

ఇదిలా ఉండగా, బిగ్‌బాస్‌ కోసం అవినాష్ తనకు గుర్తింపు తెచ్చిన జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పుకొన్నారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ షోతో ఉన్న అగ్రిమెంట్ కారణంగా వారికి కొంత మొత్తాన్ని చెల్లించారనే విషయం ప్రచారమైంది. అయితే ఈ విషయంలో కొంత మొత్తాన్ని చెల్లించిన విషయంలో అనేక సందేహాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ అంశంలో క్లారిటీ రావాల్సి ఉన్న సమయంలో అవినాష్ స్వయంగా వెల్లడించడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X