Jabardasth నుంచి సుడిగాలి సుధీర్ టీమ్ అవుట్.. ముక్కు అవినాష్ లీక్స్
జబర్దస్త్ వారా మంచి క్రేజ్ అందుకున్న కమెడియన్స్ అందరు కూడా ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో అలాగే ఇతర రియాలిటీ షోలతో బిజీగా మారుతున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా ఎన్నో ప్రైవేట్ ఈవెంట్స్ ద్వారా కూడా వారు మంచి క్రేజ్ అందుకుంటున్నారు. ఒకవైపు క్రేజ్ మాత్రమే కాకుండా మరొకవైపు ఆదాయపరంగా కూడా జబర్దస్త్ కొంతమంది కెరీర్ కు ఎంతగానో ఉపయోగపడింది.
అయితే ఆ కామెడీ షో నుంచి ఇది వరకే చాలామంది బయటకు వెళ్ళిపోగా త్వరలోనే మరికొందరు సీనియర్ కమెడియన్స్ కూడా వెళ్లిపోయే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక రీసెంట్ గా ముక్కు అవినాష్ కూడా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల పై కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

నెంబర్ వన్ షోగా..
గత రెండు మూడేళ్ల క్రితం వరకు కూడా తెలుగు టెలివిజన్ రంగంలో అత్యధిక TRP అందుకున్న వీక్లీ షోలలో జబర్దస్త్ కూడా టాప్ లిస్టులో ఉంది అని చెప్పాలి. అరుంధతి సినిమాను నిర్మించిన మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ లో వచ్చిన ఈ కామెడీ షో చాలా తొందరగానే జనాల్లోకి వెళ్లిపోయింది. 2013 నుంచి 2019 వరకు కూడా నెంబర్ వన్ కామెడీ షోగా గుర్తింపును సొంతం చేసుకుంది.

టాప్ రేటింగ్స్
అన్ని వర్గాల ప్రేక్షకులకు కూడా చాలా దగ్గర అయిపోయినా జబర్దస్త్ కామెడీ షోను ఆ తర్వాత రెండు షోలు గా విభజించారు. మరొక ఎక్స్ ట్రా జబర్దస్త్ ను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. దాంట్లో కూడా కొంత మంది కమెడియన్స్ స్కిట్స్ బాగా క్లిక్ అవడంతో చాలా తొందరగానే టాప్ రేటింగ్ లభించింది. ఏడేళ్ళ వరకు కూడా తిరుగు లేదు అనే విధంగా రేటింగ్స్ అయితే వచ్చాయి.

బయటకు వెళ్లిపోతున్న సీనీయర్స్
కానీ గత రెండు మూడేళ్ల నుంచి కూడా జబర్దస్త్ గతంలో మాదిరిగా అయితే రేటింగ్స్ అందుకోవడం లేదు. ఇక జబర్దస్త్ లో ఎప్పటి నుంచి కొనసాగుతున్న కమెడియన్స్ కూడా మెల్ల మెల్లగా బయటకు వెళ్లిపోతున్నారు. నాగబాబు వెళ్లిపోయిన తర్వాత చమ్మక్ చంద్ర అలాగే ముక్కు అవినాష్ ఇలా కొంతమంది ప్రముఖ కమెడియన్స్ అందరూ కూడా ఆ షో నుంచి బయటకు వచ్చేశారు.

సుడిగాలి సుధీర్ టీమ్ కూడా..
కొంతమంది షో తెరవెనుక జరుగుతున్న విభేదాల కారణంగా బయటకు రాగా మరికొంతమంది అటువైపు సినిమాలను ఇటువైపు జబర్దస్త్ ను బ్యాలెన్స్ చేయలేక బయటకు వచ్చేశారు. ఇక త్వరలోనే ఎంతో ముఖ్యమైన సుడిగాలి సుధీర్ టీమ్ కూడా షో నుంచే అవుట్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా కథనాలు వినిపిస్తున్నాయి.న మధ్యకాలంలో గెటప్ శ్రీను కూడా కొంత గ్యాప్ ఇవ్వడం అనుమానాలు మరింత బలపడ్డాయి.

స్పందించిన ముక్కు అవినాష్
రీసెంట్ గా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముక్కు అవినాష్ ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ గురించి తనదైన శైలిలో ఒక క్లారిటీ ఇచ్చాడు. సుడిగాలి సుధీర్ టీమ్ లో తనకు ఎక్కువగా క్లోజ్ గా ఉండేది మాత్రం గెటప్ శ్రీను అంటూ అతను కేవలం సినిమాల కారణంగానే ఆ మధ్యలో కొంత బ్రేక్ ఇచ్చాడు అని తెలియజేశాడు.

వెళ్లిపోయే ఛాన్స్?
నిజంగానే సుడిగాలి సుదీర్ టీం జబర్దస్త్ లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది అనే విషయంలో కూడా ముక్కు అవినాష్ వెళ్లి పోవడం లేదు అనే అయితే క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఎవరి ఇష్టం వాళ్ళది అని నాకు కూడా ఈ విషయంలో పూర్తిగా క్లారిటీ లేదు అని అన్నాడు.
ఇతర అవకాశాలతో బిజీగా ఉండటం వలన సుధీర్ తో కూడా నాకు కొంత గ్యాప్ వచ్చింది అంటూ నిజంగా వాళ్ళు జబర్దస్త్ వదిలేస్తున్నారని నాకు పెద్దగా తెలియదు అని అవినాష్ ఒక వివరణ ఇచ్చాడు.
ఇక ఇప్పటి వరకు సుడిగాలి సుధీర్ టీమ్ సైతం జబర్దస్త్ వదిలేస్తున్నారా లేదా విషయంలో ఎన్ని వార్తలు వస్తున్నా కూడా వాళ్లనుంచి కూడా సరైన క్లారిటీ రాలేదు. దీంతో వాస్తున్న టాక్ ప్రకారం సుధీర్ టీమ్ వెళ్లిపోయే ఆలోచనలో ఉండవచ్చునని కూడా ఒక టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











