బిగ్ బాస్‌లోకి ఇద్దరు స్టార్లు.. టాప్ కమెడియన్ రీఎంట్రీ.. చిరంజీవికి నచ్చిన కంటెస్టెంట్ కూడా!
మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగానే బుల్లితెరపై ఎన్నో రకాల కాన్సెప్టులతో షోలు వస్తున్నాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతూ సక్సెస్ అవుతున్నాయి. అలాంటి వాటిలో బిగ్ బాస్ ఒకటి. గతంలో ఎన్నడూ చూడని కాన్సెప్టుతోనే వచ్చినా ఇది సూపర్ సక్సెస్ అయింది. ముఖ్యంగా తెలుగులో భారీ రెస్పాన్స్ అందుకుంటూ రికార్డులు నమోదు చేస్తోంది. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు నిర్వహకులు ఎనిమిదో సీజన్‌ను తెస్తున్నారు. ఇందులోకి ఇద్దరు స్టార్లు రీఎంట్రీ ఇస్తున్నట్లు తెలిసింది. ఆ పూర్తి వివరాలను మీరే చూడండి!
ఇండియాలోనే టాప్ షోగా
బిగ్ బాస్ షో తెలుగులో ఎనిమిదేళ్ల క్రితమే వచ్చింది. ఎన్నో అనుమానాల నడుమ ప్రారంభం అయిన ఇది.. ఆరంభంలోనే సెన్సేషనల్ హిట్ అయింది. దీంతో వరుసగా సీజన్లు వచ్చాయి. వీటన్నింటికీ భారీ స్థాయిలో రెస్పాన్స్ కూడా వచ్చింది. దీంతో ఈ సీజన్లు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అదే సమయంలో ఇది దేశంలోనే టాప్ షోగా నిలిచి చరిత్రను సృష్టించేసింది.

8వ సీజన్‌కు అంతా రెడీ
తెలుగులో బిగ్ బాస్ నుంచి ఇప్పటి వరకూ ఏడు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లు ప్రసారం అయ్యాయి. ఇవన్నీ అనుకున్న దానికంటే ఎక్కువగా సక్సెస్ అయ్యాయి. దీంతో ఇప్పుడు ఎనిమిదో సీజన్‌ను నిర్వహకులు ప్లాన్ చేశారు. అందుకు తగ్గట్లుగానే అంతులేని వినోదం అనే కాన్సెప్టుతో దీన్ని ప్రసారం చేయబోతున్నారు. దీంతో రాబోయే సీజన్‌పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.
ఆరోజు నుంచే ఆరంభం
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో అందరికీ తెలిసిందే. అందుకు తగ్గట్లుగానే దీన్ని హై లెవెల్‌లో తీసుకు రాబోతున్నారు. ఇక, ఈ సీజన్‌ను సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభించబోతున్నారు. అలాగే, లోగోతో పాటు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ప్రోమోలు కూడా విడుదల అయ్యాయి. అలాగే, సెట్ వర్క్‌తో పాటు మిగిలిన పనులు కంప్లీట్ అయ్యాయి.
కంటెస్టెంట్లు పేర్లు లీక్
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లో కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ చాలా రోజుల క్రితమే మొదలైంది. అంతేకాదు, ఇప్పటికే చాలా మందిని కూడా సెలెక్ట్ చేసుకున్నారు. మరీ ముఖ్యంగా ఈ సీజన్‌లోకి ఇంద్రనీల్, నటి సన, బంచిక్ బబ్లూ, తేజస్విని గౌడ, అంజలి పవన్, అనిల్ గీలా, విష్ణుప్రియ, ఆదిత్య ఓం, గాయత్రి గుప్తాలు ఎంట్రీ ఇవ్వడం ఖాయం అని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి.
మాజీ కంటెస్టెంట్లతోనూ
భారీ అంచనాల నడుమ ప్రారంభం అవబోతున్న బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌కు సంబంధించి కంటెస్టెంట్ల ఎంపికలో నిర్వహకులు బిగ్ ట్విస్ట్ ఇవ్వబోతున్నారట. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఇందులోకి మాజీ కంటెస్టెంట్లను తీసుకు వస్తున్నారట. ఇప్పటి వరకూ జరిగిన ఎనిమిది సీజన్లు (ఓటీటీతో కలిపి) నుంచి ఎనిమిది మంది మాజీ కంటెస్టెంట్లను తీసుకు వస్తున్నారని టాక్.
ఇద్దరు స్టార్ రీఎంట్రీ
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లో కంటెస్టెంట్లుగా పాల్గొనేందుకు నిర్వహకులు ఇప్పటికే చాలా మంది మాజీ కంటెస్టెంట్లతో చర్చలు జరిపినట్లు తెలిసింది. అందులో నాలుగో సీజన్ కంటెస్టెంట్లు టాప్ కమెడియన్ ముక్కు అవినాష్, చిరంజీవికి నచ్చిన సోహెల్‌లు ఓకే చెప్పినట్లు తెలిసింది. అంతేకాదు, ఇటీవలే వీళ్లిద్దరి ఫైనల్ ఇంటర్వ్యూ కూడా కంప్లీట్ అయిందని సమాచారం.


Click it and Unblock the Notifications











