‘అభిజిత్ స్టాంగ్ కంటెస్టెంట్ కాదు.. ఎందుకు ఓట్లు వేస్తున్నారో అర్ధం కావడం లేదు’
బిగ్‌బాస్ తెలుగు 4 రియాలిటీ షోలో అభిజిత్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనే భావన ఇప్పటికే అందరిలో నెలకొన్నది. బిగ్‌బాస్ 4 సీజన్ టైటిల్ విన్నర్ అనే మాట అందరిలో వినిపిస్తున్నది. ఈ క్రమంలో అవినాష్ సోదరుడు మాత్రం అభిజిత్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. బిగ్‌బాస్‌లో అభిజిత్ పెద్దగా రాణించకపోయినా ప్రేక్షకులు ఎందుకు ఓట్లు వేస్తున్నారో అర్ధం కావడం లేదు అన్నారు. ఇంకా అవినాష్ సోదరుడు అజయ్ ఏమన్నారంటే..

బిగ్‌బాస్‌లో అభిజిత్‌కు క్రేజ్
బిగ్‌బాస్ తెలుగు షోలో అభిజిత్‌కు బయట ఉన్న క్రేజ్ చూస్తే స్ట్రాంగ్ కంటెస్టెంట్ చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. బయట ప్రేక్షకుల నుంచి మంచి స్పందన ఆయనపై వ్యక్తమవుతున్నది. కానీ ఇంటిలో అభిజిత్ పెద్దగా ఆడింది ఏమీలేదు. ఆయనకు ప్రేక్షకుల మద్దతు మాత్రం బ్రహ్మండంగా ఉంది అంటూ అవినాష్ సోదరుడు పేర్కొన్నారు.

ఒకే ఒక్క టాస్క్‌లో మైండ్ గేమ్
బిగ్‌బాస్ ఇంటిలో టాస్క్‌ల పరంగా అభిజిత్ పెద్దగా ఆడిన దాఖలాలు లేవు. కానీ తొలుత రోబో గేమ్‌లో మైండ్ గేమ్ ఆడటంతో ఆయనకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత పెద్దగా టాస్కులు ఆడిన దాఖలాలు లేవు. కానీ ప్రేక్షకులు అభిజిత్‌ను ఆదరిస్తున్నారు అని ముక్కు అవినాష్ సోదరుడు ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

ఇతర సభ్యులు పెర్ఫార్మెన్స్ చూస్తే
బిగ్‌బాస్ ఇంటిలో మిగితా సభ్యులు ఆడే గేమ్స్, టాస్క్‌లను చూస్తే అభిజిత్ అంత స్ట్రాంగ్ కాదు. అతడి కంటే మిగితా వాళ్లు మంచి బాగా ఆడుతున్నారు. అభిజిత్ ఏ గేమ్‌లో కూడా ఇంప్రెస్ చేయలేదు. ఒక్క గేమ్‌లో కూడా ఆఢలేదు. అయితే అభిజిత్‌కు ఎందుకు అంత క్రేజ్ వచ్చింది. ఎందుకు ఆయనకు అలా ఓట్లు వేస్తున్నారో అర్ధం కాదు అంటూ అవినాష్ సోదరుడు కామెంట్ చేశాడు

ఫన్ కోసమే అవినాష్ అలా చేశాడు..
అవినాష్ బయట ఉన్నట్టే.. బిగ్‌బాస్ ఇంటిలో కూడా అలానే ఉన్నారు. అమ్మాయిలను ఫ్లర్టింగ్ చేయడం తప్పుకాదు. కామెడీ కోసం అలా ఫన్ జనరేట్ చేశాడు. అంతేకానీ తన సోదరుడిలో మరో ఉద్దేశం లేదు. కేవలం ఇంటిలో అందరితో కలిసి పోయి వినోదం పంచడానికే అలా కనిపించాడు అని అవినాష్ తమ్ముడు పేర్కొన్నాడు.

టాప్ 5లో చేరకుండానే ఇంటికి
ఇలా ఉండగా, టాప్ 5లో స్థానం సంపాదిస్తాడనే భావించిన అవినాష్ అనూహ్య పరిస్థితుల్లో ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ఆదివారం డిసెంబర్ 6వ తేదీన జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియలో అవుట్ అయి బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చాడు. దాంతో ఆయన బిగ్ బాస్ తెలుగు 4 జర్నీ ముగిసింది.


Click it and Unblock the Notifications











