జబర్ధస్త్ షో సీక్రెట్ లీక్ చేసిన అవినాష్: అందుకే వాళ్లంతా బయటకు.. రీఎంట్రీపైనా కీలక వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర చరిత్రలోనే భారీ స్థాయిలో ప్రజాదరణను అందుకున్న షోలలో జబర్ధస్త్ ఒకటి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఎనిమిదేళ్లుగా హవాను చూపిస్తూ దూసుకుపోతోందీ షో. వారంలో రెండు రోజుల పాటు మజాను పంచుతూ ప్రేక్షకుల మద్దతును దక్కించుకుంది. అదే సమయంలో పదుల సంఖ్యలో ఆర్టిస్టులను ఇండస్ట్రీకి పరిచయం చేసింది. అలా పాపులర్ అయిన వారిలో ముక్కు అవినాష్ ఒకడు. తాజా ఇంటర్వ్యూలో అతడు జబర్ధస్త్ షో సీక్రెట్ లీక్ చేశాడు. అంతేకాదు, కొందరు ఈ షోను వీడడం వెనుక కారణం చెప్పాడు. ఆ వివరాలు మీకోసం!

అలా మొదలెట్టి.. ఇలా ఫేమస్ అయ్యాడు

అలా మొదలెట్టి.. ఇలా ఫేమస్ అయ్యాడు

కెరీర్ ఆరంభంలో మిమిక్రీ ఆర్టిస్టుగా పని చేశాడు ముక్కు అవినాష్. కొందరు హీరోల వాయిస్‌ను అనుకరించడంతో పాటు వాళ్ల స్టైల్స్‌ను ఇమిటేట్ చేసేవాడు. ఇలా జబర్ధస్త్ కమెడియన్ల దృష్టిలో పడ్డాడు. అప్పుడే ఆ షో అవకాశం దక్కించుకున్నాడు. ఆ తర్వాత అనతి కాలంలోనే అద్భుతమైన టాలెంట్‌తో ఆకట్టుకోవడంతో అవినాష్‌కు టీమ్ లీడర్‌గా ప్రమోషన్ ఇచ్చిందీ జబర్ధస్త్ యూనిట్.

ఆ షోకు బైబై.. బిగ్ బాస్‌లోకి గ్రాండ్ ఎంట్రీ

ఆ షోకు బైబై.. బిగ్ బాస్‌లోకి గ్రాండ్ ఎంట్రీ

చిన్న ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే జబర్ధస్త్ టీమ్ లీడర్‌గా ఎదిగాడు అవినాష్‌కు. ఇలాంటి పరిస్థితుల్లో అతడికి బిగ్ బాస్ షో నుంచి ఆఫర్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే నాలుగో సీజన్‌లో ఎంట్రీ ఇవ్వాలని అతడిని కోరారు. దీంతో రెండో వారంలో జోకర్ గెటప్‌తో అవినాష్ ఇంట్లోకి అడుగు పెట్టాడు. అప్పటి నుంచి నవ్వుతూ అందరినీ నవ్విస్తూ రచ్చ రచ్చ చేసేశాడు.

అన్నింట్లో ఉంటూ.. మరింత ఫేమయ్యాడు

అన్నింట్లో ఉంటూ.. మరింత ఫేమయ్యాడు

జోకర్ అని తాను పెట్టుకున్న పేరుకు ఏమాత్రం తీసిపోని విధంగా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటర్ అయినప్పటి నుంచే తనదైన మార్క్ చూపించడానికి అవినాష్ ఎంతగానో ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే అందరినీ ఆట పట్టిస్తూ, కామెడీని పంచుతూ ఎంటర్‌టైనర్ అనిపించుకున్నాడు. అదే సమయంలో ఆరియానా గ్లోరీతో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు కలరింగ్ ఇచ్చి హాట్ టాపిక్ అయ్యాడు.

చివరి మొట్టు ముందు బోల్తా... చిరు గిఫ్ట్

చివరి మొట్టు ముందు బోల్తా... చిరు గిఫ్ట్

అవినాష్ బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చినప్పటి నుంచి అతడు టైటిల్ ఫేవరెట్లలో ఒకడన్న టాక్ వినిపించింది. అందుకు అనుగుణంగానే చాలా రోజులు మంచి గేమ్ ఆడాడు. కానీ, చివర్లో సహనం కోల్పోతూ ఉండడంతో ఊహించని విధంగా 13వ వారంలోనే షో నుంచి బయటకు వచ్చేశాడు. ఇక, గ్రాండ్ ఫినాలేలో చీఫ్ గెస్ట్ చిరంజీవి.. అవినాష్‌పై ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.

జబర్ధస్త్ సీక్రెట్ లీక్ చేసిన ముక్కు అవినాష్

జబర్ధస్త్ సీక్రెట్ లీక్ చేసిన ముక్కు అవినాష్

బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత అవినాష్ వరుస ఇంటర్వ్యూలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఫేమస్ యూట్యూబ్ చానెల్‌తో చిట్ చాట్ చేశాడు. ఈ సందర్భంగా జబర్ధస్త్ నియమ నిబంధనల గురించి సీక్రెట్‌ను బయట పెట్టాడతను. షోలోకి వెళ్లినప్పుడే బాండ్ రాయించుకుంటారని, అందుకు అనుగుణంగానే వ్యవహరించాలని అవినాష్ చెప్పాడు.

వాళ్లంతా బయటకు.. రీఎంట్రీపైనా వ్యాఖ్యలు

వాళ్లంతా బయటకు.. రీఎంట్రీపైనా వ్యాఖ్యలు

దీనిపై మాట్లాడుతూ.. ‘జబర్ధస్త్‌ వాళ్లు సంతకం పెట్టించుకునే బాండ్‌లో వేరే కామెడీ షోలోకి వెళ్లకూడదని ఉంటుంది. అలా కాదని వెళ్తే మాత్రం నిర్ణీత మొత్తం చెల్లించాలని ఉంది. ఇప్పటి వరకు షోను వదిలిన వాళ్లలో చాలా మంది మనీ కట్టే వెళ్లారు. నేను కూడా రూ. 10 లక్షలు కట్టా. రీఎంట్రీ అనేది నా చేతుల్లో లేదు. వాళ్లు పిలిస్తే మాత్రం కచ్చితంగా వెళ్తా' అంటూ వివరించాడు అవినాష్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X