ప్రమాదంలో జబర్ధస్త్ కమెడియన్: అవినాష్ చేసిన పని వల్లే అతడికీ పరిస్థితి.!

By Manoj

తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతోన్న కార్యక్రమాల్లో 'జబర్ధస్త్'ది ప్రత్యేకమైన స్థానం. సీరియల్స్ హవా కనిస్తున్న సమయంలో మొదలై... దాదాపు ఏడేళ్లుగా విజయవంతంగా ప్రసారం అవుతోందీ షో. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే తరహాలో రెస్పాన్స్ అందుకుంటూ దూసుకుపోతోంది. దీని వల్ల అవకాశాలు లేక ఇబ్బందులు పడుతోన్న చాలా మంది ఆర్టిస్టులు వెలుగులోకి వచ్చారు. అలాంటి వారిలో ముక్కు అవినాష్ ఒకడు. చిన్న ఆర్టిస్టుగా వచ్చి పాపులర్ అయిన అతడు తాజాగా బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో అవినాష్ చేసిన పని వల్ల ఒకరు ప్రమాదంలో పడ్డారు.? ఇంతకీ ఏం జరిగింది.? పూర్తి వివరాల్లోకి వెళితే...

అవినాష్ జబర్ధస్త్ ఎంట్రీ వెనుక కథ ఇదే

అవినాష్ జబర్ధస్త్ ఎంట్రీ వెనుక కథ ఇదే

కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న ఈవెంట్లు చేసుకుంటూ వచ్చిన అవినాష్... కమెడియన్‌గా కంటే మిమిక్రీ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. డైలాగ్ కింగ్ సాయి కుమార్, నారాయణ మూర్తిని ఇమిటేట్ చేస్తూ ఆకట్టుకునే వాడు. ఇలా నెట్టుకొస్తున్న సమయంలో అతడు జబర్ధస్త్‌ షోలోని కొందరు టీమ్ లీడర్ల దృష్టిలో పడ్డాడు. దీంతో అందులో పని చేసే అవకాశం దక్కించుకున్నాడు.

మొదట అలా.... అందరితోనూ చేశాడు

మొదట అలా.... అందరితోనూ చేశాడు

జబర్ధస్త్‌లోకి వచ్చిన తొలినాళ్లలో అవినాష్ గుర్తింపు తెచ్చుకునేందుకు బాగా శ్రమించాడు. ఇందులో భాగంగానే షోలోని దాదాపు అందరి టీమ్‌లలో సభ్యుడిగా చేశాడు. ఈ క్రమంలోనే లేడీ గెటప్‌లు సైతం వేశాడు. దీంతో అతడికి మంచి గుర్తింపు వచ్చింది. అప్పటి నుంచి కొన్ని టీమ్‌లలో ప్రధాన సభ్యుడిగా మారిపోయాడు. ఇక, ఆ తర్వాత అతడు వెనుదిరిగి చూసుకోలేదనే చెప్పాలి.

అవినాష్‌కు కెవ్వు కార్తీక్ తోడయ్యాడు

అవినాష్‌కు కెవ్వు కార్తీక్ తోడయ్యాడు

అద్భుతమైన టాలెంట్‌తో జబర్ధస్త్‌లో మంచి ఆర్టిస్టు అనిపించుకున్న అవినాష్‌కు... అదే తరహాలో గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్ తోడయ్యాడు. దీంతో వీళ్లిద్దరినీ కలిపి జబర్ధస్త్ నిర్వహకులు కొత్త టీమ్‌ను ఏర్పాటు చేశారు. ‘మాస్ అవినాష్ కెవ్వు కార్తీక్' అనే పేరుతో వచ్చే ఈ టీమ్ ఎక్స్‌‌ట్రా జబర్ధస్త్‌లో ఆకట్టుకుంది. అంతేకాదు, చాలా ఎపిసోడ్స్‌లో ఉత్తమ ప్రదర్శన కనబరిచి గెలుపొందింది.

జబర్ధస్త్‌కు దూరమైన మాస్ అవినాష్

జబర్ధస్త్‌కు దూరమైన మాస్ అవినాష్

కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్న అవినాష్.. ఇటీవల జబర్ధస్త్ షోకు దూరమయ్యాడు. అదే సమయంలో బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. రావడం రావడమే తన మార్క్ చూపించే విధంగా హౌస్‌మేట్స్‌తో ఆటాడుకున్నాడు. అంతేకాదు, ప్రతి టాస్క్‌లో తనదైన శైలి నైపుణ్యం చూపిస్తూ సత్తా చాటుతున్నాడు. ఫలితంగా తరచూ హైలైట్ అవుతున్నాడు.

ప్రమాదంలో పడ్డ జబర్ధస్త్ కమెడియన్

ప్రమాదంలో పడ్డ జబర్ధస్త్ కమెడియన్

అవినాష్ జబర్ధస్త్ షోను వీడడంతో సహచర టీమ్ లీడర్ అయిన కెవ్వు కార్తీక్‌కు ప్రమోషన్ వచ్చింది. ఈ వారం నుంచే అతడు సోలో టీమ్ లీడర్‌గా కనిపించనున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతడి గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అవినాష్ లేకపోవడంతో కార్తీక్‌కు కొన్ని ఎపిసోడ్స్‌కు మాత్రమే ఛాన్స్ ఇచ్చారట. ఆ తర్వాత తప్పుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది.

అవినాష్ చేసిన పని వల్లే ఈ పరిస్థితి.!

కెవ్వు కార్తీక్ సోలో టీమ్‌ లీడర్‌గా సత్తా చాటితే అతడి కెప్టెన్సీని కొనసాగించాలని... లేకుంటే తప్పించాలని జబర్ధస్త్ యూనిట్ భావిస్తున్నట్లు ఓ న్యూస్ లీకైంది. అంతేకాదు, అతడికి కొన్ని ఎపిసోడ్స్ వరకు టార్గెట్ పెట్టినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో కార్తీక్... అతడి టీమ్ సభ్యులు స్కిట్ల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని అంటున్నారు.

Recommended Video

Psycho Varma: Pichodi Chetilo Rayi Song Teaser | Natti Kranthi
పరోక్షంగా వార్నింగ్ ఇచ్చిన జడ్జ్ రోజా

పరోక్షంగా వార్నింగ్ ఇచ్చిన జడ్జ్ రోజా

‘కార్తీక్ అన్న సోలో టీమ్ లీడర్ అయ్యాడురా. సన్మానం చేద్దాం రండి' అని సహచర సభ్యులు ఏర్పాట్లు చేస్తారు. ఇది చూసిన కార్తీక్ ‘ఎందుకురా సన్మానం చేస్తున్నారు. ఇప్పుడే కదా అయింది. ఇంకో నాలుగైదు ఎపిసోడ్ల తర్వాత చేయొచ్చుగా' అని అంటాడు. దీనికి అక్కడే ఉన్న జడ్జ్ రోజా ‘అన్ని ఎపిసోడ్ల వరకు ఉంటారో లేదో అని ఇప్పుడే చేసేస్తున్నారు' అని ఒక పంచ్ విసిరింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X