ప్లీజ్ భయ్యా... మీ టార్చర్ ఆపకపోతే ఆత్మహత్యే గతి: జబర్దస్త్ అవినాష్ ఆవేదన!
Recommended Video

జబర్దస్త్‌లో రకరకాలు గెటప్స్ వేస్తూ ఫన్ క్రియేట్ చేయడానికి సమాజంలో జరిగే ఏదో ఒక టాపిక్ తీసుకుని నవ్విస్తుంటారు కమెడియన్స్. అయితే కొన్ని సార్లు వారు చేసే స్కిట్లు వివాదాస్పదం అవుతున్నాయి. ఇదే తరహాలో ఇటీవల జబర్దస్త్ ముక్కు అవినాష్ చేసిన కామెడీ స్కిట్ పెద్ద వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే.
గల్ఫ్ వెళ్లే కుటుంబాలకు చెందిన మహిళలను అవమానపరిచే విధంగా అవినాష్ చేసిన స్కిట్ ఉందంటూ అతడి సొంత ప్రాంతమైన జగిత్యాల ప్రజల నుంచే వ్యతిరేక వ్యక్తం అవ్వడం, దీనిపై అప్పట్లో కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే.

వారి వల్ల టార్చర్ అనుభవిస్తున్నాను
ఆ వివాదం తర్వాత నుంచి అవినాష్‌కు సోషల్ మీడియాలో టార్చర్ ఎక్కువైందట. అతడిని టార్కెట్ చేస్తూ ట్రోలర్స్ రెచ్చిపోతున్నారు. వారి వల్ల తాను ఎంత టార్చర్ అనుభవిస్తున్నానో వెల్లడిస్తూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అవినాష్ ఆవేదన వ్యక్తం చేశారు.

కన్నీళ్లతో మొర పెట్టుకున్న అవినాష్
నేను చేసిన చిన్న పొరపాటుకు నన్ను దారుణంగా టార్గెట్ చేస్తున్నారు. ఈ విషయమై నేను క్షమాపణలు చెప్పినా వినిపించుకోవడం లేదని కన్నీళ్లతో జబర్దస్త్ అవినాష్ మొర పెట్టుకోవడం అందరినీ ఆశ్చర్య పరిచింది.

మా వాళ్లను తిట్టడం బాధేస్తుంది
మాకు ఎవరూ శత్రవులు లేరు. ఎవరో చెబితే మేము చేయడం లేదు. ఏదో తప్పు చేశాను అయిపోయింది. క్షమించమని అడిగాను. మా అమ్మను, వదినను తిట్టడం చాలా బాధేస్తుంది అని అవినాష్ తెలిపారు.

మీరు టార్చర్ ఆపకపోతే ఆత్మహత్యే గతి
భయ్యా ప్లీజ్ భయ్యా... మీరు ఇదే టార్చర్ కంటిన్యూ చేస్తే సూసైడ్ చేసుకున్న వీడియో కూడా మీకు పంపించాల్సి ఉంటుందని అవినాష్ బాధ పడుతున్నాడు. మీరు ఆయనకు అలాంటి పరిస్థితి తీసుకురావద్దు అంటూ.... ముక్కు అవినాష్‌ను ఇంటర్వ్యూ చేసిన యాంకర్ సైతం ట్రోలర్స్‌కు విజ్ఞప్తి చేయడం గమనార్హం.


Click it and Unblock the Notifications











