ప్లాన్ మార్చిన బిగ్ బాస్: వారం తిరగకముందే మరో వైల్డ్ కార్డ్.. హౌస్‌లోకి ఎంటరైన ‘జోకర్’.!

By Manoj Kumar P

తెలుగులో తన ప్రత్యేకతను చాటుకుంటూ సక్సెస్‌ఫుల్ షోగా పేరొందింది బిగ్ బాస్. ఈ క్రమంలోనే మూడు సీజన్లను ఇప్పటికే విజయవంతంగా పూర్తి చేసుకోగలిగింది. ఇక, ఇటీవలే నాలుగో సీజన్‌ను సైతం ప్రారంభించారు షో నిర్వహకులు. ఎన్నో అంచనాలతో మొదలైన ఈ సీజన్ పేరు లేని కంటెస్టెంట్లు... ఫేలవ ప్లానింగ్ వల్ల చప్పగా సాగుతోంది. ఇలాంటి తరుణంలో షోను చూసేందుకు ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపడం లేదు. దీంతో బిగ్ బాస్ యూనిట్ సరికొత్త ప్లాన్ వేసింది. ఇందులో భాగంగానే వారం తిరగకముందే హౌస్‌లోకి మరో కంటెస్టెంట్‌ను పంపింది. ఇంతకీ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంటరైంది ఎవరు.? ఆ వివరాలు మీకోసం.!

ప్రీమియర్ ఎపిసోడ్ తప్ప.. చప్పగా షో

ప్రీమియర్ ఎపిసోడ్ తప్ప.. చప్పగా షో

అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తూ ప్రారంభించిన ప్రీమియర్ ఎపిసోడ్ అంగరంగ వైభవంగా జరిగింది. ఆరోజు హౌస్‌లోకి పదహారు మంది కంటెస్టెంట్లను పంపించాడాయన. ఆ వెంటనే నామినేషన్.. లగ్జరీ బడ్జెట్ టాస్క్‌.. కట్టప్ప అంటూ కొత్త నాటకం.. ఇవన్నీ సోసోగానే జరిగాయి. చిన్న చిన్న వాగ్వాదాలు జరిగినా ప్రేక్షకులను ఆకర్షించలేకపోయాయి. దీంతో ఫస్ట్ వీక్ షో చప్పగా సాగింది.

ఒకరిని పంపారు.. ఇంకొకరిని దింపారు

ఒకరిని పంపారు.. ఇంకొకరిని దింపారు

ఈ సీజన్ పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తిని నింపేందుకు బిగ్ బాస్ యూనిట్ సరికొత్త ప్రయోగాలు చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే ఫస్ట్ వీక్ ముగిసిన వెంటనే సూర్య కిరణ్‌ను ఎలిమినేషన్ ద్వారా బయటకు పంపించేశారు. అదే సమయంలో కమెడియన్ కుమార్ సాయిని వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి తీసుకొచ్చారు. ఇది షోకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

రెండో వారం వాళ్ల మీదే ఫోకస్ చేశారు

రెండో వారం వాళ్ల మీదే ఫోకస్ చేశారు

వందకు వంద శాతం వినోదాన్ని పంచుతామని చెప్పిన బిగ్ బాస్ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే హౌస్‌లో లవ్ కహానీలు ఉన్నట్లు కలరింగ్ ఇస్తున్నారు. మొదటి నుంచీ అభిజీత్ - మోనాల్ గజ్జర్ మధ్య ప్రేమాయణం సాగుతున్నట్లు చూపించిన బిగ్ బాస్... ఇప్పుడు వీళ్ల మధ్యలోకి అఖిల్ సార్థక్‌కు పంపి ట్రైయాంగిల్ లవ్‌గా క్రియేట్ చేస్తున్నారు.

ఎంటర్‌టైన్‌మెంట్ పెంచేందుకు ప్లాన్లు

ఎంటర్‌టైన్‌మెంట్ పెంచేందుకు ప్లాన్లు

ఇక, షోలో ఎంటర్‌టైన్‌మెంట్ లెవెల్ పెంచేందుకు బిగ్ బాస్ యూనిట్ సరికొత్త ప్లాన్లు సిద్ధం చేసినట్లు అర్థం అవుతోంది. గొడవలు జరిగే విధమైన టాస్కులు కాకుండా.. ఆటపాటలతో వినోదాన్ని పంచేవి పెడుతున్నారు. ఇందులో భాగంగానే హౌస్‌లోని కంటెస్టెంట్లు బుధవారం డ్యాన్సులు ఇరగదీశారు. మధ్యలో వ్యాపార ప్రకటనలు కూడా ప్లాన్ చేశారు. దీంతో షో వినోదాత్మకంగా సాగుతోంది.

అందుకోసం ప్లాన్ మార్చిన బిగ్ బాస్

అందుకోసం ప్లాన్ మార్చిన బిగ్ బాస్

లవ్ స్టోరీలు... వినోదాత్మక టాస్కుల కారణంగా బిగ్ బాస్ నాలుగో సీజన్‌పై ఇప్పుడిప్పుడే ఆసక్తి పెరుగుతోంది. దీన్ని కంటిన్యూ చేసేందుకు షో నిర్వహకులు సరికొత్త ప్లాన్లు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వారం వారం ఇచ్చే టాస్కులను ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా రూపొందించడంతో పాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీలను త్వరగానే పంపాలని నిర్ణయించినట్లు సమాచారం.

వారం తిరగకముందే మరో వైల్డ్ కార్డ్

వారం తిరగకముందే మరో వైల్డ్ కార్డ్

బిగ్ బాస్ నాలుగో సీజన్‌ కోసం ముగ్గురు ప్రముఖులు వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి ఎంటర్ అవుతారని గతంలోనే చెప్పుకున్నాం. అందుకు అనుగుణంగానే మొదటి వారమే కమెడియన్ కుమార్ సాయి ఎంట్రీ ఇచ్చాడు. అతడు వచ్చి వారం రోజులు తిరగకముందే హౌస్‌లోకి మరో కంటెస్టెంట్ రాబోతున్నాడు. ఈ మేరకు బుధవారం రాత్రి ప్రోమోను కూడా విడుదల చేసింది యూనిట్.

Recommended Video

Bigg Boss Telugu 4 : Episode 12 Highlights : బిగ్ బాస్ ముందు ఏడ్చేసిన Gangavva | Filmibeat Telugu
బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటరైన ‘జోకర్'.!

బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటరైన ‘జోకర్'.!

‘జోకర్... ఈ పదం గురించి మనకు తెలిసిన డెఫినీషన్ చాలా చిన్నది. ఆనందానికి, బాధకు మధ్యలో నలిగిపోతూ ఉండే ఒక చిన్న పదం. వింటేనే నవ్వు వచ్చే ఓ జోకర్ వెనుక నిజానికి ఒక జీవితమే ఉంది. ఎంతైనా జోకర్‌ను కదా' అంటూ బిగ్ బాస్ హౌస్‌లోకి ఒకరు ప్రవేశించారు. అది మరెవరో కాదు.. జబర్ధస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ అని విశ్వసనీయంగా తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X