ఆ సమయంలో సూసైడ్ చేసుకుందాం అనుకున్నా.. ముక్కు అవినాష్ ఎమోషనల్..

ముక్కు అవినాష్.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఈ నటుడి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ ద్వారా తెలుగు వారికి పరిచయమయ్యారు. తన కామెడీ టైమింగ్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ ఫేమ్ తో బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షోలో అడుగుపెట్టారు. ఈ షోతో ఆయన మరింత ప్రజాదరణ పొందాడు. రెండు సార్లు ఈ రియాలిటీ షోలో పాల్గొన్న అతను విజేతగా నిలవకున్నా తన ఆట, మాట తీరుతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇక బిగ్ బాస్ తర్వాత ఎన్నో షోలో పాల్గొంటూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇలా చిరునవ్వులు పంచే ముక్కు అవినాష్ ఓ సారి ఆత్మహత్య చేసుకోవాలనే పరిస్థితికి వెళ్లాడంట. ఇంతకీ ఏం జరిగింది?

కామెడియన్ ముక్కు అవినాష్ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన గతాన్ని గుర్తు చేసుకుంటూ, అవకాశాలు లేక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రోజులను వివరించాడు. తన జీవితంలో అత్యంత ముఖ్యమైనవి ఇద్దరేనని, పేరెంట్స్, ప్రేక్షకులు అని చెప్పాడు. తన కెరీర్‌లో సాధించిన ప్రతి విజయానికి కారణం వాళ్లేనని, తాను ఇల్లు, కారు కొనుగోలు చేయగలిగితే అది అభిమానుల ప్రేమ వల్లేనని వెల్లడించాడు. అయితే ఇదే సమయంలో తనపై ఉన్న బాధ్యతలు, ముఖ్యంగా కుటుంబ పరిస్థితులు ఎలా తనను మానసికంగా కుంగదీశాయో వివరించాడు.

Mukku Avinash Gets Emotional Recalling Suicide Thoughts During Lockdown Struggles

ముఖ్యంగా కరోనా లాక్‌డౌన్ సమయంలో షూటింగ్స్ పూర్తిగా ఆగిపోవడంతో ఆదాయం లేకుండా పోయిందని చెప్పాడు. అదే సమయంలో కొత్తగా కొనుగోలు చేసిన ఇంటి కోసం నెలకు సుమారు రూ.45 వేల ఈఎంఐ, మరోవైపు కుటుంబ ఆరోగ్య సమస్యలు, తండ్రికి హార్ట్ సమస్య, తల్లికి మోకాళ్ల సమస్య వల్ల ఆర్థికంగా తీవ్రంగా ఇబ్బంది పడ్డారంట.ఇల్లు కోసం దాచుకున్న డబ్బంతా వైద్య ఖర్చులకు వెళ్ళిపోయిందని ఆయన పేర్కొన్నారు. కుటుంబ బాధ్యతలన్నీ తనపై పడటంతో అప్పులు చేయాల్సి వచ్చిందని తెలిపాడు.

ఇక కుటుంబంలో ఐదుగురు అన్నదమ్ములు ఉండటంతో బాధ్యతలు ఎక్కువగా తనపై పడినట్టు అవినాష్ తెలిపాడు. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేసే స్థోమత లేకపోవడంతో తానే ముందుకు వచ్చి ఖర్చులు భరించాల్సి వచ్చిందని, అదే సమయంలో ఇల్లు కొనుగోలు ప్రక్రియ కూడా కొనసాగడంతో బయట నుంచి సుమారు రూ.13 లక్షలు అప్పు చేయాల్సి వచ్చిందని వెల్లడించాడు. లాక్‌డౌన్ సమయంలో చాలా మంది అభిమానులు ఇబ్బందులు పడుతుంటే, ఒక ఆర్టిస్ట్‌గా వారిని సహాయం చేయాల్సిన బాధ్యత ఉందని తాను భావించానని అన్నాడు.

కానీ తన దగ్గరే డబ్బులు లేకపోవడం, అప్పుల భారంతో కుంగిపోవడం వల్ల ఆ సహాయం చేయలేకపోయాననే బాధ కూడా తనను వెంటాడిందని తెలిపాడు. ఇలా ఆర్థిక ఒత్తిళ్లు, బాధ్యతలు పెరిగిపోవడంతో ఒక దశలో తీవ్ర నిరాశకు లోనయ్యాననీ, ఆత్మహత్య గురించి ఆలోచించానని అవినాష్ ఎమోషనల్ అయ్యారు. అయితే ఆ సమయంలో స్టార్ మా నుంచి వచ్చిన అవకాశం తన జీవితాన్ని మళ్లీ మార్గంలో పెట్టిందని చెప్పాడు. బిగ్ బాస్‌లో పాల్గొనే అవకాశం రావడంతో ఆర్థికంగా కొంత ఊరట లభించిందని వెల్లడించాడు.

ఈ కష్టకాలంలో అవినాష్ జీవితంలో వచ్చిన కీలక మలుపు ... బిగ్ బాస్ ఆఫర్. ఆ షోలోకి వెళ్లేందుకు ఆయన జబర్దస్త్ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. అందుకోసం సుమారు రూ. 10 లక్షలు చెల్లించాల్సి రావడంతో... సహచరులైన శ్రీముఖి, గెటప్ శ్రీను, చమ్మక్ చంద్రల నుంచి అప్పు తీసుకుని ఆ డబ్బు చెల్లించారని సమాచారం. ఆ నిర్ణయం ఆయన కెరీర్‌ను మళ్లీ ట్రాక్‌లోకి తీసుకువచ్చింది.

ముక్కు అవినాష్ ఆయన భార్య మాట్లాడుతూ.. లాక్‌డౌన్ సమయంలో కుటుంబం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నట్లు తెలిపారు. ఈఎంఐలు, అప్పులు, కుటుంబ ఆరోగ్య ఖర్చులు అన్ని కలిపి అవినాష్‌ను మానసికంగా తీవ్రంగా కుంగదీశాయని చెప్పారు. ఒక దశలో నిద్రపట్టకుండా రోజంతా ఆలోచిస్తూ ఉండేవాడని, పరిస్థితి ఎంత దారుణంగా మారిందో వివరించారు. అయితే మరోవైపు అవినాష్ ఈ విషయాన్ని పలుమార్లు ప్రస్తావించడం పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X