ఆరియానాపై అవినాష్ హాట్ కామెంట్స్: ఫస్ట్ ఇంటర్వ్యూలోనే పెళ్లిపైనా క్లారిటీ ఇచ్చేశాడు

బిగ్ బాస్ నాలుగో సీజన్ చివరి దశకు చేరుకుంది. మరో వారం రోజుల్లో ఫినాలే వీక్ కూడా ప్రారంభం కాబోతుంది. ఇలాంటి సమయంలో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన జబర్ధస్త్ ఫేం ముక్కు అవినాష్ షో నుంచి బయటకు వచ్చేశాడు. 10 వారాల పాటు హౌస్‌లో ఉన్న అతడు.. ఊహించని విధంగా ఎలిమినేట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో రాహుల్ సిప్లీగంజ్‌తో జరిగిన ఇంటర్వ్యూలో ఆరియానా గ్లోరీపై హాట్ కామెంట్స్ చేశాడు. అంతేకాదు, ఆమె ఫొటోను చూస్తూ ముద్దులిచ్చాడు. అలాగే, పెళ్లి విషయంపైనా క్లారిటీ ఇచ్చేశాడు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!

బిగ్ బాస్ షోలో ఆమెతో కలిసి హల్‌చల్

బిగ్ బాస్ షోలో ఆమెతో కలిసి హల్‌చల్

ఎన్నో అంచనాల నడుమ బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు జబర్ధస్త్ కమెడియన్ అవినాష్. హౌస్‌లో కాలు పెట్టిన సమయం నుంచే మిగిలిన వారందరినీ నవ్వించడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే తోటి కంటెస్టెంట్ ఆరియానా గ్లోరీతో క్లోజ్ అయ్యాడు. ఆమెతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ హల్‌చల్ చేశాడు. ఫలితంగా ఇద్దరి మధ్య ట్రాక్ నడుస్తుందని ప్రచారం సాగుతోంది.

సేవ్ అయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నించి

సేవ్ అయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నించి

షో ఆరంభంలో పెద్దగా నామినేట్ అవని అవినాష్.. ఇటీవలి కాలంలో తరచూ ఎలిమినేషన్ జోన్‌లోకి వచ్చాడు. ఎప్పుడు నామినేట్ అయినా ఒత్తిడికి గురవుతుండేవాడు. దీంతో అందరితో గొడవలకు దిగేవాడు. అంతేకాదు, ప్రేక్షకుల మనసు దోచుకుని సేఫ్ అయ్యేందుకు టాస్కుల్లో వందకు వంద శాతం శ్రమను చూపించేవాడు. ఇలానే చాలా సార్లు ఎలిమినేషన్ తప్పించుకున్నాడు.

ఊహించని విధంగా ఇంటి నుంచి అవుట్

ఊహించని విధంగా ఇంటి నుంచి అవుట్

గత వారం అభిజీత్, దేత్తడి హారిక, అఖిల్ సార్థక్, మోనాల్ గజ్జర్‌లతో పాటు నామినేట్ అయిన అవినాష్.. అన్ని టాస్కుల్లో మంచిగానే ఆడడానికి ప్రయత్నించాడు. నిజానికి మోనాల్ కంటే అతడికే ఎక్కువ ఓట్లు పోలయ్యాయని బయట బాగా ప్రచారం జరిగింది. దీంతో ఈ వారం కూడా తప్పించుకునే చాన్స్ ఉందని అనుకున్నారంతా. కానీ, ఊహించని విధంగా షో నుంచి బయటకు వచ్చేశాడు.

నా కోసం వెయిట్ చెయ్ ప్లీజ్ అవినాష్

నా కోసం వెయిట్ చెయ్ ప్లీజ్ అవినాష్

బిగ్ బాస్ షో నుంచి అవినాష్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించిన వెంటనే కంటెస్టెంట్లు అంతా భావోద్వేగానికి గురయ్యారు. మరీ ముఖ్యంగా సోహెల్, ఆరియానా గ్లోరీ, అభిజీత్‌లు ఇంకాస్తా ఎక్కువగా ఎమోషనల్ అయ్యారు. అవినాష్ స్టేజ్ మీదున్న సమయంలో ఆరియానా వెక్కి వెక్కి ఏడ్చేసింది. అంతేకాదు, ‘నా కోసం వెయిట్ చెయ్. రెండు వారాల్లో వచ్చేస్తాను' అంటూ కన్నీటి పర్యంతమైంది.

ఆరియానాపై అవినాష్ హాట్ కామెంట్స్

ఆరియానాపై అవినాష్ హాట్ కామెంట్స్

బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ అయిన వాళ్లతో గత సీజన్ విన్నర్ రాహుల్ సిప్లీగంజ్ ‘బిగ్ బాస్ బజ్' పేరిట చిట్ చాట్ షో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అవినాష్‌తో చేసిన ఇంటర్వ్యూ హాస్యభరితంగా సాగింది. ఇందులో తనదైన శైలి కామెడీతో నవ్వించిన జబర్ధస్త్ కమెడియన్.. ఆరియానా ఫోటో చూపించగానే ‘చుమ్మ' అంటూ హాట్ కామెంట్స్ చేశాడు.

Recommended Video

Metro Kathalu Movie Actor Thiruveer Special Interview || అలా చేస్తే తప్పు కానీ నటించడం తప్పు కాదు!
ఇంటర్వ్యూలోనే పెళ్లిపైనా క్లారిటీ ఇచ్చేశాడు

ఇంటర్వ్యూలోనే పెళ్లిపైనా క్లారిటీ ఇచ్చేశాడు

ఆరియానా గురించి మాట్లాడుతూ.. ‘నీకింక పెళ్లి సంబంధాలు రావు.. హౌస్‌లో వాళ్లను బాగా గెలికావంట కదా' అని రాహుల్ ప్రశ్నించగా.. ‘నేను ఏం చేసినా ఫన్ కోసమే చేశాను. ఆరియానాతోనూ అలాగే ప్రవర్తించా. ఆమె నా క్లోజ్ ఫ్రెండ్ మాత్రమే' అంటూ బదులిచ్చాడు. అలాగే, ఇందులో అవినాష్ చెప్పిన ఇంగ్లీష్ డైలాగులు కూడా పేలుతున్నాయి. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X